E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

గ్లామర్ క్వీన్ వెనుక కన్నీటి సముద్రం.. సావిత్రి కంటే ముందే ఆ స్టార్ హీరోతో సీక్రెట్ లైఫ్!

గ్లామర్ క్వీన్ వెనుక కన్నీటి సముద్రం.. సావిత్రి కంటే ముందే ఆ స్టార్ హీరోతో సీక్రెట్ లైఫ్!
Advertisement

Pushpavalli Life: పుష్పవల్లి.. ఈ పేరు చెప్తే అక్కడ గుర్తుపట్టలేకపోవచ్చు ఏమో కానీ జెమినీ గణేషన్ భార్య అనగానే ఎవరైనా గుర్తుపట్టేస్తారు. సినిమా రంగంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నఈ స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి అష్ట కష్టాలు పడింది.ఘనంగా మొదలై బాధాకరంగా సాగిన ఈ అలనాటి హీరోయిన్ జీవిత  విశేషాలను ఒకసారి చూసేద్దాం .

1920లో ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు అనే గ్రామంలో జన్మించిన పుష్పవల్లి  పూర్తి పేరు కందుల వెంకట పుష్పవల్లి తయారమ్మ .సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పుష్పవల్లికి చిన్నప్పటి నుంచే సినిమాలో నటించాలనే కోరిక ఉండేది అలా కేవలం 9 ఏళ్ళ వయసులోనే ఉంటే 1936లో రాజమండ్రి కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా సినీ టోన్ నిర్మించే సంపూర్ణ రామాయణం అనే పౌరాణిక చిత్తంలో బాల సీత అనే పాటలు నటించింది.అందుకు ఆమెకు 300 రూపాయల పారితోషికం ముట్టడం విశేషం. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో  ఇండస్ట్రీలో పుష్పవల్లి పేరు మారు మ్రోగిపోయింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలెట్టిన  పుష్పవల్లి వయసు పెరగడంతో సెకండ్ హీరోయిన్ గా ఫుల్ బిజీ అయిపోయింది.

1930 నుండి 1960 వరకు దాదాపు 30 ఏళ్ల పాటు

Advertisement

అలా 1942లో పి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన బాలనాగమ్మ ఆమె కెరీర్ ని మలుపు తిప్పిందనే చెప్పాలి. అలా 1930 నుండి 1960 వరకు దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగింది.అలా ఆమె కెరీర్ లో దాదాపు 40 పైగా సినిమాలో నటించింది అయితే ఎంత స్టార్డమ్ తెచ్చుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా  ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఒడిదొడుకులకి  లోనయిందనే  చెప్పాలి ముఖ్యంగా కెరియర్ ఫీక్స్  లో ఉన్నప్పుడు రంగా చారి అనే వ్యక్తితో వివాహం చేసుకొని బాబ్జీ ,రామ అనే పిల్లలకు జన్మనిచ్చింది అయితే పెళ్లైన కొత్తలోనే ఆ బందం కాస్తా బీటలు వారడం మొదలెట్టింది.ఒకరికొకరు అర్థం చేసుకోలేకపోవడంతో ఎంతో కాలం నిలవలేదు ఆ బందం. దీంతో మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నించింది సరిగ్గా అదే సమయంలో పుష్పవల్లి జీవితంలోకి ఎంట్రీ  ఇచ్చాడు జెమినీ గణేషన్.

పెళ్లి అయి ఆరుగురు పిల్లలు ఉన్నప్పటికీ

Advertisement

ఏదో ఒక షూటింగ్ సమయంలో పరిచయం జెమినీ గణేషన్ తో ప్రేమలో పడింది పుష్పవల్లి. అయితే అప్పటికే జెమినీ గణేషన్ కి  పెళ్లి అయి ఆరుగురు పిల్లలు ఉన్నప్పటికీ పుష్పవల్లి అదేమీ పట్టించుకోకుండా జెమిని గణేషన్ తో  ప్రేమాయణం నడపడం గమనార్హం.అతడికి పెళ్లి అయిందని తెలిసినప్పటికీ అందర్నీ ఎదిరించి జెమినీ గణేషన్ తో సహజ సహజీవనం ప్రారంభించింది.వీరికి పుట్టిన పిల్లలే రేఖా,రాదా.రేఖ అంటే  ఎవరో కాదు బాలీవుడ్ లో  ఎవర్ గ్రీన్ బ్యూటీగా రాణించిన  భాను రేఖ. పుష్పవల్లి  జెమినీ గణేష్ ని ఎంత ప్రేమించినా ఆమెకు సమాజంలో మాత్రం తన భార్య స్థానాన్ని ఇవ్వలేకపోయాడు.ఇదే ఒకరకంగా పుష్పవల్లిని  బాగా కుంగ తీసింది అని చెప్పాలి. ఇది చాలా అన్నట్టు ఆ తర్వాత జెమినీ గణేషన్ ఆ తర్వాత సావిత్రిని పెళ్లి చేసుకుని పుష్పవల్లిని మరింత కుంగ తీశాడు .

రంగులరాట్నంతోనే బాలనటిగా పరిచయమైన రేఖ

తాను నమ్మిన జెమినీ గణేషన్ తనని కాదని ఇంకొక్కని పెళ్లి చేసుకోవడంతో మానసిక గురై ఒంటరితనాన్ని అనుభవించింది. అయితే అదే సమయంలో ఇప్పటి ప్రముఖ నిర్మాతతో రిలేషన్ లో ఉందన్న వార్తలు కూడా వినిపించాయి ఇలా ఒకపక్క ప్రేమించడం వ్యక్తి దూరమవ్వడం,మరోపక్క సమాజంలో అనుమానాలు ఎదుర్కొంటూ తీవ్ర ఇబ్బందులకు గురైన పుష్పవల్లి మళ్లీ తన కుమార్తెల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడింది. వారికి మంచి లైఫ్ ఇవ్వాలని సినిమాలలో హీరోయిన్లుగా చేయాలని ప్రొడ్యూసర్లు స్టూడియో చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగింది ఒకప్పటి మహానటి అలా తిరగడం నిజంగా బాధాకరం. అయితే ఆమె కష్టాలు వృధాగా పోలేదు . బి.యన్.రెడ్డి నిర్మించిన రంగులరాట్నంతోనే బాలనటిగా పరిచయమైంది రేఖ.

also read:టాలీవుడ్‌లో రూ.1300 కోట్ల జూదం.. ఆ ఆరు సినిమాలు తేడా కొడితే అంతే సంగతులా?

పుష్పవల్లి ఎందరికో ఆదర్శం

ఆ తర్వాత కుటుంబ పరిస్థితిల వల్ల  రేఖ చదవమానేసి పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. అలా పుష్పవల్లి  తన కూతుర్ని హీరోయిన్ గా చేయలన్న లక్ష్యంతో  తీసుకొని ముంబైకి వెళ్ళిపోయింది అక్కడ రేఖకు ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ తన తల్లి ఇచ్చిన ధైర్యంతో  స్టార్ అయిపోయింది.చివరి రోజుల్లో రేఖ తన తల్లిని బాగా చూసుకున్నప్పటికి , ప్రేమించిన భర్త దూరం అవడం,మానసిక ఒత్తిళ్ళకు లోనయి, వయసు మీద పడటంతో  పుష్పవల్లి పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్ళిపోయింది.అలా కోమాలోనే జీవితంతో పోరాడిన పుష్పవల్లి చివరికి 1994లో కోమాలోనే కన్నుమూసింది.ఏది ఏమైనా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎక్కడా అధైర్య పడకుండా జీవితాన్ని సాగించిన పుష్పవల్లి ఎందరికో ఆదర్శం అనే చెప్పాలి.

Related News

‘వారణాసి’ సీక్వెల్‌పై రాజమౌళి క్లియర్ కట్ స్టేట్‌మెంట్…క్లారిటీ వచ్చేసిందిగా !

ఆమె నా పెదవులు కొరకలేదు బాబోయ్ .. అంటున్న బాలీవుడ్ స్టార్ !

టాలీవుడ్‌లో రూ.1100 కోట్ల జూదం.. ఆ ఆరు సినిమాలు తేడా కొడితే అంతే సంగతులా?

కయాదు లోహర్‌తో సూర్య రొమాన్స్….డైరెక్టర్ ఎవరో తెలుసా ?

యూట్యూబ్‌ ని షేక్ చేస్తున్న తెలుగు సాంగ్స్ ఇవే….అగ్ర స్థానం ఆహీరోదే !

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో షురూ.. ‘శివుని త్రిశూలం… డీఎన్‌ఏ రూపం’.. ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పీక్స్‌!

జాన్వీ కపూర్ దక్షిణాదిలోనే స్థిరపడనుందా.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ!

Big Stories

×