E-Paper
Advertisement

జైలు నుంచి వచ్చిందే తమ్ముడి బెండ్ తీయడానికి.. రిహాబ్‌లో అన్నదమ్ముల మాస్ హంగామా… ఓటీటీలోకి ఇంటెన్స్ డ్రామా

జైలు నుంచి వచ్చిందే తమ్ముడి బెండ్ తీయడానికి.. రిహాబ్‌లో అన్నదమ్ముల మాస్ హంగామా… ఓటీటీలోకి ఇంటెన్స్ డ్రామా
Advertisement

Emotional English Drama: జైలు నుంచి బయటకు వచ్చాక ఎవరైనా ముందుగా ఇంటికి వెళ్లాలనే కోరుకుంటారు. కానీ ఓ యువకుడి ముందున్న దారి ఇంటికి వెళ్లడం కాదు. డ్రగ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌ లోకి వెళ్లడం. అక్కడ అతడికి ఎదురయ్యేది తనలాంటి సమస్యలతో పోరాడుతున్న తమ్ముడే. మత్తు పదార్థాల నుంచి బయటపడేందుకు ఇద్దరు అన్నదమ్ములు కలిసి చేసే పోరాటమే ‘యూనియన్ కౌంటీ’ (Union County). మరి ఈ ఇంగ్షీషు మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలియాలంటే ముందు కథలోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కోడి పార్సన్స్ మాదకద్రవ్యాల సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తి. కోర్టు ఆదేశాలతో అతడు డ్రగ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌ లో చేరాల్సి వస్తుంది. ఒహియోలో ఓపియాయిడ్ సంక్షోభం తీవ్రంగా ఉన్న ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కోడి పార్సన్స్ కి అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం దొరుకుతుంది. అదే సమయంలో అతడి జీవితంలో మరో కీలకమైన వ్యక్తి కూడా అదే ప్రోగ్రామ్‌ లో ఉంటాడు. అతనెవరో కాదు సోదరుడు జాక్. ఇద్దరి మధ్య రక్త సంబంధం కంటే బలమైన అనుబంధం ఉన్నప్పటికీ, డ్రగ్స్ వాళ్ల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి.

Advertisement

కోడి గతంలో జాక్‌ కు హెరాయిన్ పరిచయం చేసినందుకు బాధ పడుతూ ఉంటాడు. ఆ విషయం అతడిలో అపరాధ భావనను మరింత పెంచుతుంది. రిహాబ్‌ లోకి వచ్చిన తర్వాత వీళ్లిద్దరికీ తమ గతాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. డ్రగ్స్ వల్ల కోల్పోయిన కుటుంబ బంధాలు, నమ్మకం, వ్యక్తిగత జీవితాన్ని తిరిగి సంపాదించుకోవడం అంత సులభం కాదు. కౌన్సిలర్ యానెట్ సహాయంతో ఇద్దరూ తమ సమస్యలను అర్థం చేసుకోవడానికి, వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ జరిగే సమావేశాలు, ఇతర రిహాబ్ సభ్యులతో ఏర్పడే పరిచయాలు, తమ గతాన్ని బయట పెట్టాల్సిన పరిస్థితులు కోడి, జాక్ ఇద్దరికీ కొత్త అనుభవాన్ని ఇస్తాయి.

క్రమంగా వాళ్లు తమ తప్పులను అంగీకరించడం మొదలుపెడతారు. కుటుంబాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే ముందుగా తమ జీవితాలను మార్చుకోవాల్సిందేనని అర్థం చేసుకుంటారు. అయితే మత్తు నుంచి బయటపడటం అంత సులభం కాదు. పాత అలవాట్లు, గత జ్ఞాపకాలు, కుటుంబంతో దెబ్బతిన్న సంబంధాలు పదేపదే వాళ్లను వెనక్కి లాగుతుంటాయి. మరి కోడి, జాక్ నిజంగా ఆ కష్టం నుంచి బయటపడగలిగారా ? గతంలో చేసిన తప్పుల ప్రభావం నుంచి బయటపడి కుటుంబాన్ని తిరిగి పొందగలిగారా ? వాళ్ల రిహాబ్ ప్రయాణం చివరకు ఎలాంటి మార్పుకు దారి తీసిందనేదే సినిమా అసలు కథ.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు ?

Advertisement

విల్ పౌల్టర్, నోహ్ సెంటినియో, ఎలిస్ కిబ్లర్ తదితరులు నటించిన ఈ ఇంగ్లిష్ డ్రామాకు ఆడమ్ మీక్స్ దర్శకత్వం వహించారు. ‘యూనియన్ కౌంటీ’ 2026లోనే విడుదలైంది. అక్టోబర్ 2 నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా ఇంగ్షీషులోనే ఉంది.

Read Also: ఒకేసారి ఇద్దరు డాన్లతో గ్యాంబ్లర్‌ గడబిడ… తల్లి సెంటిమెంట్ తో ఆకట్టుకుంటున్న డార్క్ కన్నడ కామెడీ గ్యాంగ్‌స్టర్ డ్రామా

Related News

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

24 ఏళ్లకే తండ్రి బాధ్యతలు తలపై పడితే… డైలీ సీరియల్ లెవెల్ గందరగోళం… క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

పాడుబడిన పిచ్చాసుపత్రిలో సెక్యూరిటీ మిస్సింగ్… తీరా చూస్తే స్పైన్ చిల్లింగ్ విజువల్స్

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్వతారోహణ… గుండె జారిపోయే అడ్వెంచర్

కోడలు రాకతో అత్తింట్లో మొదలయ్యే చావుల పరంపర… ఓటీటీలోకి డెడ్లీ హారర్ మూవీ

స్వేచ్ఛ కోసం జూ యానిమల్స్ చేసిన సాహసం… ఫన్నీ జంగిల్ జాతర

Big Stories

Advertisement
×