BigTV English

Coolie Collections : రజినీ ‘కూలీ ‘ రికార్డుల మోత.. ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షం..!

Coolie Collections : రజినీ ‘కూలీ ‘ రికార్డుల మోత.. ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షం..!

Coolie Collections : తమిళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కూలీ.. ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. రజనీకాంత్ కెరీర్ లో ఇది భారీ యాక్షన్ సినిమా.. భారీగా బిజినెస్ జరిగింది. తెలుగు వెర్షన్ కు రజినీకాంత్ కెరీర్లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరగడం విశేషంగా చెప్పుకోవాలి.. ఈ మూవీకి 46.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.47 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘కూలీ’ పై మంచి హైప్ ఉంది.. పాజిటివ్ టాక్ ని అందుకున్న ఏ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేర్ చేసేలా కలెక్షన్స్ ని కూడా రాబట్టుతుంది. ఇండియాలో మాత్రమే కాదు అటు ఓవర్సీస్ లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది. అమెరికాలో కలెక్షన్ల జోరు ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం..


అమెరికాలో ‘కూలీ ‘ వసూళ్ల సునామీ.. 

తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాయి. అటు తలైవా రజనీకాంత్ కు తెలుగులో మాత్రమే కాదు అమెరికాలో కూడా అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఈ చిత్రం ప్రీమియర్స్ ఏకంగా 3.04 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు.


Also Read: ‘వార్ 2’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే..?

లోకీకి అరుదైన రికార్డ్.. 

డైరెక్టర్ లోకేష్ కనకరాజు డైరెక్షన్ పై ఫారిన్లో మంచి రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదు. తమిళ సినిమాల్లో హయ్యెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ అని చిత్ర యూనిట్ తెలిపింది. రజినీ మేనియాతో బాక్సాఫీస్ ఊగిపోతుందని..ఇది కంటిన్యూ అయితే మాత్రం మంచి వసూళ్లను రాబడుతుంది.. ఇప్పటికే ఇండియాలో పలు ఏరియాలో ఏ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసేలా వసూళ్లను సాధించింది. మొదటి రోజే వందకోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది. ఏది ఏమైనా కూడా ఈ మూవీ తో రజనీకాంత్ మరో రికార్డ్ ని బ్రేక్ చేశాడు. అటు నాగర్జున కూడా ఈ సినిమా మంచి హిట్ ని అందించింది. ఇండియాలో వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో మరి కొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది.. ఈ మూవీకి తమిళనాట మంచి రెస్పాన్స్ దక్కింది. అక్కడే కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.ఈ మూవీ తర్వాత లోకి తెలుగు హీరోతో సినిమా చెయ్యనున్నారని ఇండస్ట్రీలో వార్త చక్కర్లు కొడుతుంది.

Related News

Film industry: అలా చేస్తేనే ఛాన్స్.. ఇండస్ట్రీ దిగజారుతోందంటూ హీరోయిన్ కామెంట్స్!

Dhruv Vikram: ధ్రువ్ విక్రమ్ మామూలోడు కాదయ్యో.. ఏకంగా ముగ్గురితో రొమాన్స్!

Film industry: హిట్ కొట్టినా.. ఈ డైరెక్టర్స్ ని పట్టించుకోవడం లేదా..కారణం?

Pooja Hegde: కూలీ డిజాస్టర్ టాక్.. పూజా హెగ్డే ఐరెన్ లెగ్ అంటూ ట్రోలింగ్ ?

Vishwambara update : బాస్ బర్తడే కి టీజర్ ఫిక్స్, ఈసారైనా జాగ్రత్త పడ్డారా?

Big Stories

×