PCB : పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా ఉంది. పురుషులు అదే సమయంలో మహిళా క్రికెటర్లు అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ పరువు అంతర్జాతీయంగా పోతోంది. మొన్న బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ పురుషుల జట్టు ( Pakistan Team) చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో గ్రూప్ స్టేజిలో నిష్క్రమించింది పాకిస్తాన్ ఉమెన్స్ జట్టు. అయితే ఇలా వరుసగా పరభవాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపైన మూడు ఫార్మాట్లకు.. వేరువేరుగా మూడు జట్లను ఎంపిక చేయాలని ఫిక్స్ అయ్యారట. అంటే టెస్టులు, వన్డేలు, టి20 లకు డిఫరెంట్ గా మూడు వివిధ జట్లు ఉంటాయన్నమాట. పాకిస్తాన్ పురుషులు, మహిళల జట్లకు ఇదే ఫార్ములా అప్లై చేసేందుకు సిద్ధమయ్యారట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు ( PCB selectors). ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గడ్డు పరిస్థితులలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ ను కాపాడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. టీమిండియా తరహాలోనే మూడు ఫార్మాట్లకు… మూడు జట్లను ఎంపిక చేసేందుకు సిద్ధమైంది. ఈ మూడు ఫార్మాట్లకు ముగ్గురు డిఫరెంట్ కెప్టెన్లను కూడా రంగంలోకి దింపేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కంకణం కట్టుకుంది. అంటే ఈ లెక్కన టెస్టులకు ఒక కెప్టెన్… వన్డేలకు మరో కెప్టెన్ ఉంటాడు. టి20 లకు మరో కెప్టెన్ ను నియామకం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అమలు చేయబోతున్న ఈ కొత్త ఫార్ములా నేపథ్యంలో బాబర్ ఆజం కు వన్డే కెప్టెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వన్డేల్లో అతన్ని కెప్టెన్ గా చేసి… వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంటు కోసం పాకిస్తాన్ జట్టును సిద్ధం చేస్తారని కూడా చర్చ జరుగుతోంది. బాబర్ ఆజం అయితేనే.. పాకిస్తాన్ సక్సెస్ అందుకుంటుందని చెబుతున్నారు.
మూడు ఫార్మాట్లకు మూడు జట్లను ఫైనల్ చేసేందుకు పాకిస్తాన్ కంకణం కట్టుకున్న నేపథ్యంలో… సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఇప్పటికే ఈ ఫార్ములాను టీమిండియా అమలు చేస్తోందని.. దాన్నే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు కాపీ కొడుతోందని ట్రోలింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ వెధవ ముఖాలకు కాపీ కొట్టడం తప్ప… సొంత ఆలోచనలు రావని ఆడుకుంటున్నారు.