BigTV English

Aadhaar Fraud Exam: పోలీస్ ఉద్యోగ పరీక్షల్లో భారీ స్కామ్.. ఆధార్ కార్డ్‌తో గుట్టు రట్టు

Aadhaar Fraud Exam: పోలీస్ ఉద్యోగ పరీక్షల్లో భారీ స్కామ్.. ఆధార్ కార్డ్‌తో గుట్టు రట్టు

Aadhaar Fraud Exam| పోలీస్ ఉద్యోగ అర్హత పరీక్షల్లో భారీ స్కామ్ జరిగింది. అసలు అభ్యర్థికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాశాడు. ఇలాంటి ఫ్రాడ్ కేసులు ప్రస్తుతానికి పదుల సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆధార్ కార్డు మార్పిడితో జరిగిన ఈ స్కామ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మధ్యప్రదేశ్‌లో నియామక పరీక్షల నిర్వహణ మరోసారి తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. 2023 ఎంపీ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలో కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది.


మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ గుర్తుందిగా.. అందులో చిరంజీవికి బదులు ఒక డాక్టర్.. అభ్యర్థి రూపంలో వెళ్లి పరీక్ష రాస్తాడు. ఇప్పుడు మధ్య ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనలే జరిగినట్లు తెలిసింది. నకిలీ అభ్యర్థులు, అంటే “సాల్వర్లు”, అసలు దరఖాస్తుదారుల స్థానంలో పరీక్ష రాసి, అన్ని దశలను విజయవంతంగా దాటి, పోలీసు శాఖలో చేరే సమయంలో ఈ మోసం బయటపడింది.

జాతీయ మీడియ సంస్థ ఇండియా టుడే చేసిన దర్యాప్తు ప్రకారం.. ఈ నకిలీ కెండిడేట్ల స్కామ్ ఒక జిల్లాకు మాత్రమే పరిమితం కాదు, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో మధ్యప్రదేశ్ ఉద్యోగుల ఎంపిక మండలి (MPESB) నిర్వహించిన మొత్తం నియామక ప్రక్రియపై అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. మూడు జిల్లాల్లో కనీసం ఒక డజను మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఇందులో దరఖాస్తు చేసిన అభ్యర్థులతో పాటు వారి స్థానంలో పరీక్ష రాసిన నకిలీ అభ్యర్థులు ఉన్నారు.


మధ్యప్రదేశ్ లో 2023 ఆగస్టు 12 నుండి సెప్టెంబరు 12 వరకు జరిగిన ఈ నియామక పరీక్షలో 7,090 పోస్టుల కోసం 7 లక్షల మంది అభ్యర్థులు పాల్గొన్నారు. రాత పరీక్ష ఫలితాలు మార్చి 2024లో విడుదలయ్యాయి, ఆ తర్వాత శారీరక పరీక్షలు పూర్తి చేసి మార్చి 2025లో తుది ఎంపిక జరిగింది. కానీ ఉద్యోగంలో చేరే సమయంలో గుర్తింపు ధృవీకరణ ప్రక్రియలో అధికారులకు అనుమానం కలిగింది. ఉదాహరణకు, మొరెనాకు చెందిన రామ్ రూప్ గుర్జర్ ఉద్యోగంలో చేరడానికి అలిరాజ్‌పూర్‌లోని ఎస్పీ కార్యాలయంలో వెళ్లినప్పుడు .. అతని ఆధార్ కార్డు తారుమారైనట్లు అధికారులకు అనుమానం కలిగింది. అతని అడ్మిట్ కార్డు ఫోటో అతని ప్రస్తుత రూపంతో సరిపోల లేదు.

దీంతో పాటు ఫింగర్‌ప్రింట్ విశ్లేషణలో పరీక్ష రాసిన వ్యక్తి గుర్జర్ కాదని, వేరొకరని తేలింది. విచారణలో.. బీహార్‌కు చెందిన అమరేంద్ర సింగ్ అనే వ్యక్తి రూ. 1 లక్ష తీసుకొని గుర్జర్ స్థానంలో పరీక్ష రాశాడని ఒప్పుకున్నాడు. పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఇలాంటి సంఘటనలు మొరెనా, షియోపూర్ వంటి ఇతర జిల్లాల్లోనూ బయటపడ్డాయి. మొరెనాలో రాధా చరణ్, దినేష్ సింగ్‌లు కూడా ఆధార్ బయోమెట్రిక్ డేటాను తారుమారు చేసి మోసం చేశారు.

షియోపూర్ జిల్లాలో ఏడుగురిని అరెస్టు చేశారు. ఇందులో సోను రావత్, సంతోష్ రావత్, అమన్ సింగ్ వంటి ఎంపికైన అభ్యర్థులతో పాటు వారి స్థానంలో పరీక్షలు రాసిన సాల్వర్లు కూడా ఉన్నారు. ఇది చాలా పెద్ద స్కామ్.. ఎందుకంటే ఆధార్ కార్డ్ లో బయోమెట్రిక్ మార్పులు చేయడానికి ఆధార్ ఏజెంట్లు కూడా వారిని సహకరించారు. పోలీసులు ఆధార్ ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ మోసం ఒక సంస్థాగత పద్ధతిలో జరిగినట్లు దర్యాప్తులో తేలింది. సాల్వర్లు ముందుగా డబ్బు చెల్లించి పాస్ కావాలనుకునే అభ్యర్థులను గుర్తించేవారు. ఆ తర్వాత, ఆధార్ సిస్టమ్‌లో బయోమెట్రిక్ డేటాను మార్చి, వేలిముద్రలు, ముఖ డేటాను స్వాప్ చేసేవారు. సాల్వర్లు పరీక్షలు, శారీరక పరీక్షలు రాసేవారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత, అసలు అభ్యర్థుల బయోమెట్రిక్ డేటాను పునరుద్ధరించేవారు. కానీ చివరి ధృవీకరణ దశలో బయోమెట్రిక్ అసమానతలు అనుకోకుండా వెలుగులోకి రావడంతో ఈ స్కామ్ బయటపడింది.

Also Read: 4 ఏళ్లుగా యువతిని ప్రేమించిన యువకుడు.. ఇంట్లో ఆమె గురించి రహస్య డాక్యుమెంట్స్ చూసి..

ప్రభుత్వం ఈ విషయంలో రహస్య దర్యాప్తు ప్రారంభించింది. గతంలో కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో రెండు దశాబ్దాల పాటు వ్యాపం స్కామ్ జరిగింది. ఈ స్కామ్ లో కూడా నకిలీ అభ్యర్థులను ఉపయోగించి పరీక్షల్లో మోసాలు జరిగాయి.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×