BigTV English
Advertisement

Champai Soren: ఝార్ఖండ్ రాజకీయాల్లో కలకలం.. ఎమ్మెల్యేలతో బిజేపీలోకి చంపై సోరేన్!!

Champai Soren: ఝార్ఖండ్ రాజకీయాల్లో కలకలం.. ఎమ్మెల్యేలతో బిజేపీలోకి చంపై సోరేన్!!

Champai Soren| దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ రాజకీయ లబ్ది కోసం పార్టీలు మారుతుంటారు. ఏళ్ల తరబడి తాము నోటికొచ్చినట్లు తిట్టిన ప్రత్యర్థి పార్టీలోనే ఒక్కసారిగా చేరిపోతుంటారు. ఉదయం ఒక పార్టీ కండువా సాయంత్రం మరో పార్టీ కండువా వేసుకోవడంలో నేటి రాజకీయ నాయకులు ఆరితేరిపోయారు. ఇదే కోవలో ఇప్పుడు ఝార్ఖండ్ రాజకీయాలు జరుగుతున్నాయి.


ఝూర్ఖండ్ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని కూలాదోయాలని కేంద్రంలోని బిజేపీ పావులు కదుపుతున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఝూర్ఖండ్ మాజీ ముఖ్య మంత్రి చంపై సొరేన్ పార్టీ మారే పనిలో ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ చంపై సొరేన్ ఇవన్నీ పుకార్లు మాత్రమే నని నిన్నటి దాకా చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా తనతో ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకొని ఆదివారం ఢిల్లీకి బయలుదేరారు.

ప్రస్తుతం ఝార్ఖండ్ ప్రభుత్వం మంత్రి పదవిలో ఉన్న చంపై సొరేన్ బిజేపీలో చేరడమంటే ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు పదవి గండం పొంచి ఉన్నట్లే లెక్క. బిజేపీకి సన్నిహితంగా ఉన్న మాజీ జెఎంఎం ఎమ్మెల్యే లాబిన్ హెమ్‌బ్రామ్.. కూడా చంపై సొరేన్ వెంట ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారని తెలిసింది. హేమంత్ సొరేన్ భూ కుంభకోణం కేసులో ఫిబ్రవరి 2న జైలుకెళ్లినప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. చంపై సొరేన్ ని సిఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అలా 2024 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపై సొరేన్ జూలై 2024లో హేమంత్ సొరేన్ తిరిగి జైలు నుంచి విడుదల కాగా.. సిఎం పదవికి రాజీనామా చేసి.. హేమంత్ సొరేన్ దారి ఇచ్చారు. కానీ స్థానిక మీడియా కథనాల ప్రకారం.. చంపై సొరేన్ ను ముఖ్యమంత్రిగానే కొనసాగాలనే ఆశఉండడంతో ఆయన తన ఆశను తీర్చుకోవడానికే బిజేపీతో చేతులు కలుపుతున్నారని విశ్లేషకుల అభిప్రాయం.


ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చంపై సొరేన్.. అంతకు ముందు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బిహార్ సమైక్య రాష్ట్రంలో పనిచేశారు. ఆయన ఏకంగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో విజయం సాధించారు. 2005 నుంచి 2024 వరకు సెరాయ్ కెల్లా నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు సోదరుడి వరుసైన చంపై ముఖ్యమంత్రిగా అయిదు నెలల పాలనను ఇటీవల బిజేపీ నేతలు ప్రశంసించారు. అయితే ఆయన రాజీనామా చేయడం అన్యాయమని పార్టీలో కొందరు వాదించారు.

Also Read: కోల్ కతా వైద్యురాలి హత్యపై రాజకీయ దుమారం.. నిందితుడిని ప్రభుత్వం కాపాడుతోందా?..

అయితే ఇప్పుడు చంపై సొరేన్ బిజేపీలోకి జంప్ చేస్తే.. ఆయనకు తిరిగి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా? అనే అనుమానాలపై స్పష్టత రాలేదు. అదే జరిగితే ఝార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం వచ్చినట్లే.  ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ కు చెందిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ లో చీలక పడినట్లే.

Also Read: ‘మా ఆవిడ నన్ను కొడుతోంది.. నేను జైల్లో ఉంటా?’.. ఇంటి నుంచి పారిపోయిన భర్త!

Related News

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Big Stories

×