Liquor prices: తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మద్యం ధరలు పెరిగాయి. క్వార్టర్‌పై రూ.10, హాఫ్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 పెంచుతూ ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ పంపింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరలు పంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర మద్యం ధరలు కూడా పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన ధరల వల్ల అమ్మకాలు తగ్గకపోవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
లిక్కర్ ధరలు పెరగడంతో మద్యం ప్రియులు కొంత గందరగోళానికి లోనవుతున్నారు. ధరలు పెరడంతో మందుబాబుల జేబులకు మరింత చిల్లు పడే అవకాశముంది. అయితే, ధరలు పెరిగినా అమ్మకాలు ఆశించిన స్థాయిలో తగ్గకపోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణలో మద్యం అమ్మకాల జోరు ఇంకా కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపతుండడంతో బీర్లకు తెగ డిమాండ్ పెరుగుతోంది.
Also Read: HPCL Jobs: డిగ్రీ ఉంటే చాలు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు.. మంచి వేతనం.. ఇంకా 3 రోజులే..?
ఎండలు దంచికొడుతుండడంతో మందుబాబులు చల్లని బీర్ తాగేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే.. అమ్మకాలు రెట్టింపు అయినట్టు సమాచారం. ముఖ్యంగా 25 నుంచి 35 ఏళ్ల యువత బీర్లు ఎక్కువగా తాగుతున్నారు. అయితే పెరిగిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకునే .. బేవరేజెస్ కంపెనీల కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరను 15 శాతం పెంచిన విషయం తెలిసిందే.
Also Read: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఆర్మీ మరో వీడియో రిలీజ్.. ఈసారి తగ్గేదేలే