Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అనుభవించే బాధ నాకు ప్రత్యేకంగా తెలుసునని అన్నారు. తన తండ్రి కూడా గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారని మంత్రి రామ్మోహన్ నాయుడు ఎమోషనల్‌కు గురయ్యారు.
అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాదం స్థలాన్ని పరిశీలించాను. గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వీలైనంత వరకు సహాయక చర్యలు గుజరాత్ ప్రభుత్వం వెంటనే చేపట్టింది. పౌర విమాన యానా శాఖ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. మా శాఖ ఈ ఘటన పై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మెడికల్, ఫోరెన్సిక్, టీమ్‌లతో పాటు ఐదుగురితో AIB బృందాలను ఏర్పాటు చేశాం’ అని ఆయన చెప్పారు.
ALSO READ: Plane Crash: చివరి క్షణంలో పైలట్ నుంచి ఆ కాల్.. రామ్మోహన్ నాయుడు సంచలన ప్రెస్ మీట్
గడిచిన రెండు రోజులు భారంగా గడిచింది. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అనుభవించే బాధ నాకు ప్రత్యేకంగా తెలుసు. బాధితుల కుటుంబాల బాధ నాకు తెలుసు. నా తండ్రి కూడా గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. బ్లాక్ బాక్స్ ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాం. అందులో ఉన్న సమాచారం కీలకంగా మారనుంది. బ్లాక్ బాక్స్‌లో ఉన్న సమాచారం రానున్న రోజుల్లో విలువైంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో కమిటీ వేశాం. హోంశాఖ కార్యదర్శి, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, గుజరాత్ అధికారులు, పోలీసు కమిషనర్ అహ్మదాబాద్, స్పెషల్ డైరెక్టర్ ఐబీని కమిటీలో నియమించాం’ అని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
3 నెలల్లో కమిటీ విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తుంది. భద్రత ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపట్టాం. ప్రమాదం తెలిసిన వెంటనే బోయింగ్ 787 సిరీస్ కు చెందిన విమానాలను పరిశీలించాల్సిందిగా DGCA కు ఉత్తర్వులు ఇచ్చాం. బోయింగ్ విమానాలు దేశంలో మొత్తం 34 ఉన్నాయి. 8 ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేశాం. డీఎన్ఏ టెస్టులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే టెస్టులు పూర్తి కానున్నాయి. 24 గంటల్లోనే ప్రధాని మోదీ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. హై లెవెల్ కమిటీతో సోమవారం భేటి అవుతాను. అహ్మదాబాద్ విమానం ప్రమాదానికి సంబంధించి గడిచిన 48 గంటల నుంచి ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తున్నాం’ అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.