BigTV English
Advertisement

Sonia Gandhi on PM Modi: ప్రధాని మోదీపై సోనియా కామెంట్స్.. ఓడినా, ఏమాత్రం మారలేదు..

Sonia Gandhi on PM Modi: ప్రధాని మోదీపై సోనియా కామెంట్స్.. ఓడినా, ఏమాత్రం మారలేదు..

Sonia Gandhi on PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ. ఎన్నికల్లో మోదీ నైతికంగా ఓడిపోయినా ఓటర్ల తీర్పును ఆయన అర్థం చేసుకున్నట్లు ఏ మాత్రం కనిపించడం లేదన్నారు. ఈ మేరకు శనివారం ఓ పత్రికకు ఆమె వ్యాసం రాశారు. అందులో కీలక విషయాలు వెల్లడించారు.


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా, నైతికంగా ఓడిపోయారని విమర్శించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. అదేమీ జరగలేనట్టుగానే కొనసాగుతున్నారని మనసు లోని మాట బయటపెట్టారు. ఎన్నికల ప్రచారంలో తనకు తాను దైవత్వాన్ని ఆపాదించుకున్న ఆయన, ఓటర్ల తీర్పును అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని రాసుకొచ్చారు.

ఇందుకు కారణాలను వివరించారు సోనియాగాంధీ. లోక్‌సభ స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుందామని చెప్పి నప్పటికీ ఏ మాత్రం వినలేదన్నారు. ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం ప్రకారం ఉప సభాపతి పదవిని విపక్షంలోని ఒకరికి ఇవ్వాలని అడిగామన్నారు. ఆ అభ్యర్థనకు ప్రభుత్వం ఏ మాత్రం అంగీకరించలేదన్నారు.


పార్లమెంటు పనితీరుకు ఉభయ పక్షాల మధ్య సమతౌల్యానికి విపక్షం ముమ్మాటికీ కట్టుబడి ఉందన్నారు సోనియా. ఏకాభిప్రాయానికి విలువల గురించి గొప్పగా చెప్పే ఆయనే.. ఘర్షణకు విలువ ఇవ్వడానికి కొనసాగిస్తున్నారని రాసుకొచ్చారు. ఇక్కడా కూడా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఎమర్జెన్సీ ప్రస్తావన తెచ్చారని దుయ్యబట్టారు కాంగ్రెస్ అధినేత్రి.

ఎమర్జెన్సీపై ప్రజలు 1977లో విస్పష్టమైన తీర్పు ఇచ్చారని, దాన్ని అందరూ ఆమోదించారని గుర్తు చేశారు సోనియాగాంధీ. కొత్తగా రూపొందిన నేర న్యాయ చట్టాలను ప్రస్తుతానికి పక్కన పెట్టి పార్లమెంటరీ సమీక్ష నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఆ చట్టాలను ఆమోదించే సమయంలో ఉభయసభల నుంచి దాదాపు  146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు. పరీక్షా పే చర్చ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని మోదీ, నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై ఎందుకు సెలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు.

ALSO READ:  నీట్‌ పీజీ నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం కాంగ్రెస్ దూకుడు చూస్తుంటే.. ఈసారి ప్రధాని నరేంద్రమోదీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేర నే సంకేతాలు ఇచ్చినట్టైంది. ఇప్పటికే నీట్ వ్యవహారం ఉభయసభలను కుదిపేస్తోంది. ఎన్నికల తర్వాత నుంచే కాంగ్రెస్ తమతమ అస్త్రాలకు పదును పెట్టినట్టు కనిపిస్తోంది.

Related News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Big Stories

×