OTT Movie : ఇండిపెండెంట్ సినిమాలు సింప్లిసిటీ, ఎమోషనల్ డెప్త్, రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. అయితే దీనికి యూత్ ఫుల్ కంటెంట్ తోడైతే ఆ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కు పండగే పండగ. అలాంటి అదిరిపోయే మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఆ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాలను తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ’28 Hotel Rooms’. మాట్ రాస్ దర్శకత్వంలో, సిల్వర్‌వుడ్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ 2012న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2012 నవంబర్ 9న లిమిటెడ్ గా రిలీజ్ అయింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ట్యూబీ, ప్లెక్స్, ఫండాంగో ఎట్ హోమ్ అనే ఓటీటీలలో అందుబాటులో ఉంది. ఇందులో క్రిస్ మెస్సినా (నావలిస్ట్), మారిన్ ఐర్లాండ్ (అకౌంటెంట్), రాబర్ట్ డీమర్, అన్నే హెచ్. విల్సన్ (మైనర్ రోల్స్) ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌లో కల్ట్ స్టేటస్ సాధించింది.
స్టోరీలోకి వెళ్తే…
మూవీ స్టోరీ నావలిస్ట్ (క్రిస్ మెస్సినా), కార్పొరేట్ అకౌంటెంట్ (మారిన్ ఐర్లాండ్) మధ్య జరిగే అఫైర్ చుట్టూ తిరుగుతుంది. సినిమాలో వీళ్లకు పేర్లేమీ ఉండవు. కథ ఒక సింపుల్, స్టీమీ వన్-నైట్ స్టాండ్‌తో మొదలవుతుంది. ఇద్దరూ బిజినెస్ ట్రిప్‌లో ఒక హోటల్ బార్‌లో కలుస్తారు. ఆమె వెస్ట్ కోస్ట్ నుండి వచ్చిన వివాహిత మహిళ, అతను న్యూయార్క్ నుండి వచ్చిన నావలిస్ట్. అతనికి గర్ల్‌ఫ్రెండ్ ఉంటుంది.
ఫస్ట్ మీటింగ్ తరువాత ఆమె అతన్ని మళ్లీ కాంటాక్ట్ చేయనని చెబుతుంది. వారి మధ్య ఉన్న తీవ్రమైన ఆకర్షణ వారిని ఒకే నగరంలో ఉన్నప్పుడల్లా హోటల్ రూమ్‌లలో కలుస్తూనే ఉంటారు. సినిమా 28 విభిన్న హోటల్ రూమ్‌లలో జరిగే కథతో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ప్రతి సీన్ ఒక రూమ్ నంబర్‌తో ఉంటుంది. ఇదంతా దాదాపు ఒక దశాబ్ద కాలంలో జరుగుతుంది. సినిమాలో వాళ్ళ రిలేషన్‌షిప్ డీప్ ఎమోషనల్ కనెక్షన్‌గా మారడం చూడొచ్చు. లేట్-నైట్ చాట్, జోక్స్, వాదనలు… వాట్ నాట్ అన్నీ నడుస్తాయి ఇద్దరి మధ్య. చివరికి ఆమె తన భర్తను వదిలిపెట్టడం గురించి, అతను తన గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చేయడం గురించి మాట్లాడతారు.
Read Also : సినిమా ఛాన్స్ కోసం డైరెక్టర్ తో భార్య రాసలీలలు… ఆ భర్త ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్
క్లైమాక్స్ ఒక బిటర్‌స్వీట్ నోట్‌తో ముగుస్తుంది. ఇంతకీ క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది? హీరోయిన్ తన బిడ్డను వదిలేసి ప్రియుడి దగ్గరకు వెళ్లిందా? అతను తన గర్ల్ ఫ్రెండ్ ను ఏం చేశాడు? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. సినిమాలో పక్కా ఏ రేటింగ్ సీన్స్ గట్టిగా ఉంటాయి. కాబట్టి చూసేటప్పుడు ఫ్యామిలీ, పిల్లలు లేకుండా జాగ్రత్త పడండి. అలాగే ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్.