E-Paper
Advertisement

OTT Movie: ‘ధురంధర్’ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారా ? అంతకంటే ముందు ఓటీటీలో చూడాల్సిన బ్లడీ బ్లడ్ బాత్ మూవీస్ ఇవే

OTT Movie: ‘ధురంధర్’ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్నారా ? అంతకంటే ముందు ఓటీటీలో చూడాల్సిన బ్లడీ బ్లడ్ బాత్ మూవీస్ ఇవే

OTT Movie : ఈ మధ్య రక్తపాత సన్నివేశాలు ఎంత ఎక్కువగా ఉంటే సినిమా అంత హిట్ అవుతోంది. ఈ హింసాత్మక సన్నివేశాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే దర్శకులు కూడా ఇలాంటి సినిమాలతో ప్రయోగాలు చేస్తున్నారు. రీసెంట్ గా థియేటర్లలో అడుగుపెట్టిన ‘ధురంధర్’ మూవీలో కూడా బ్లడ్ బాత్ ఎక్కువగానే ఉంది. ఈ సినిమాకూడా రికార్డ్ కలెక్షన్ల బాటలో పయనిస్తోంది. ఇలాంటి టాప్ బ్లడ్ బాత్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

‘ధురంధర్’

రణవీర్ సింగ్ సినిమా ‘ధురంధర్’ థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. అభిమానులు ఈ సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూశారు. వాళ్ళ ఎదురుచూపులకు నిన్నటితో ఫుల్ స్టాప్ పడింది. ఈ సినిమా డిసెంబర్ 5న విడిదలైంది. ఇందులో కొన్ని తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. దర్శకుడు ఆదిత్య ధార్ తీసిన ‘ధురంధర్’ లో రక్తపాతం ఎక్కువే ఉంది. ఇందులో రణ్‌వీర్‌తో పాటు, ఇందులో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ నటించారు. ఇది నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 2026 జనవరి 30 న స్ట్రీమింగ్ కి రానుంది.

‘మార్కో’

2024లో హనీఫ్ అదేని దర్శకత్వంలో వచ్చిన ‘మార్కో’ సినిమా యాక్షన్ తో నిండిపోయి అత్యంత హింసాత్మక చిత్రంగా నిలిచింది. ఉన్ని ముకుందన్ ఇందులో నటించారు. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 110 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా జియో హాట్ స్టార్, ఆహా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

‘సలార్’

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023లో వచ్చింది. అద్భుతమైన యాక్షన్ తో బ్లడ్ బాత్ కూడా తీవ్రంగా ఉంటుంది. 400 కోట్ల బడ్జెట్ చిత్రం 702 కోట్లు వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

‘యానిమల్’

సందీప్ వంగా రెడ్డి తీసిన యానిమల్ సినిమా ప్రమాదకరమైన యాక్షన్ తో వచ్చిన క్రైమ్ డ్రామా. ఇందులోని హింసాత్మక సన్నివేశాలు అందర్నీ ఆశ్చర్యపరచాయి. 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 917.82 కోట్లు వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఉంది.

‘కిల్’

దర్శకుడు నిఖిల్ భట్ చిత్రం కిల్ కూడా ఈ బ్లడ్ బాత్ జాబితాలో ఉంది, ఇందులో కూడా ప్రమాదకరమైన యాక్షన్ సీన్స్ ఉన్నాయి. రాఘవ్ జుయల్ విలన్ పాత్ర షాకింగ్ గా ఉంటుంది. 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 47.12 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’

అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ బొగ్గు మాఫియానేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో టన్నుల కొద్దీ యాక్షన్ ఉంటుంది. 9.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 35.13 కోట్లు వసూలు చేసింది. యూట్యూబ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : డబ్బు కోసం పందెం… నడక ఆపితే నరకానికి టికెట్టు… సస్పెన్స్ తో పిచ్చెక్కించే సర్వైవల్ థ్రిల్లర్

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×