Friday OTT Movies: ప్రతి వారం థియేటర్లలోకి సినిమాలు రిలీజ్ కు వస్తాయో రావో తెలియదు కానీ ఓటీటీలోకి మాత్రం సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. సంక్రాంతి వస్తుందంటే సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. దాంతో పాటుగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నేడు శుక్రవారం జనవరి 10 సందర్బంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ భారీ అంచనాల నడుమ థియేటర్ల లోకి వచ్చేసింది. మొదటి షోలు పడ్డాయి. ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రెండు రోజుల గ్యాప్‌లో వరుసగా రిలీజ్ కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు పోటీపడనున్నాయి.. ఇక ఓటీటీలో కి కూడా ఈ ఒక్క రోజుకే ఏడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం..
ప్రతి వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు విడుదల అవుతాయి. అలాగే ఈ వారం కూడా ఓటీటీలో కూడా అదిరిపోయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సెలవులు రావడం, పండుగ వాతావరణంలో కుటుంబంతో మూవీని వీక్షించడం మంచి ఎక్స్‌పీరియన్స్. అందుకే ఈ సంక్రాంతికి మీకోసం సరికొత్త కంటెంట్ అందించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో వచ్చే చిత్రాలపై అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. అందరు థియేటర్లలోకి వెళ్ళలేరు. దాంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సరికొత్త కంటెంట్ తో ఉన్న సినిమాలను ప్రేక్షకులకు అందించేలా ప్లాన్ చేస్తున్నాయి.
ఈ వారం ఓటీటీలోకి వస్తున్న సినిమాల విషయానికొస్తే.. హైడ్ అండ్ సీక్ ఓటీటీకి రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లో విశ్వంత్, శిల్పా మంజునాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అదే విధంగా బాలీవుడ్ స్టార్ హీరో విక్రాంత్ మాస్సే నటించిన సబర్మతి రిపోర్ట్, విక్రమాదిత్య మోత్వానే డైరెక్షన్ లో తెరకెక్కించిన బ్లాక్ వారెంట్ అనే మరో మూవీ ఓటీటీ లోకి రానున్నాయి. ఇక ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 7 చిత్రాలు రానున్నాయి.. థియేటర్లలో గేమ్ చేంజర్, అలాగే సోనూ సూద్ ఫతే రిలీజ్ అయ్యాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతుందో చూద్దాం..
డిస్నీ+ హాట్‌స్టార్..
గూస్‌బంప్స్: ది వానిషింగ్ -జనవరి 10
జీ5..
సబర్మతి రిపోర్ట్- జనవరి 10
నెట్‌ఫ్లిక్స్…
యాడ్ విటమ్- జనవరి 10
బ్లాక్ వారెంట్ -జనవరి 10
ఆల్ఫా మేల్స్ సీజన్ 3- జనవరి 10
ఆహా..
హైడ్ అండ్ సీక్- జనవరి 10
హోయ్‌చోయ్
నిఖోజ్- సీజన్ 2-(బెంగాలీ వెబ్ సిరీస్) జనవరి 10
ఈ వారంలో కన్నా ఈరోజు రిలీజ్ అవ్వబోతున్న ఆ మూవీస్ వెరీ స్పెషల్.. ఎందుకంటే థియేటర్లలో భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్న కూడా ఓటీటీ లో పోటీగా అదిరిపోయే మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన మూవీ ని మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..