E-Paper
Advertisement

మళ్లీ మొదలైన రచ్చ… నలుగురు ఫ్రెండ్స్ లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్ ట్విస్టులతో సీజన్ 2 స్ట్రీమింగ్ షురూ

మళ్లీ మొదలైన రచ్చ… నలుగురు ఫ్రెండ్స్ లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్ ట్విస్టులతో సీజన్ 2 స్ట్రీమింగ్ షురూ
Advertisement

Comedy Series OTT : నలుగురు ఫ్రెండ్స్… వాళ్లకంటూ ఒక్కొక్కరికి ఓ లైఫ్… ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు అంటూ ప్రతి ఒక్కరి దగ్గరా ఓ సమస్య. మగాడంటే ఎలా ఉండాలి అనే పాత ఆలోచనలను పక్కన పెట్టి కొత్తగా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఈ నలుగురు ఇప్పుడు మరోసారి తమ సమస్యలతో తిరిగొచ్చారు. మొదటి సీజన్‌ లో సంబంధాలు, ప్రేమ విషయంలో తడబడిన ఈ ఫ్రెండ్స్‌ కు రెండో సీజన్‌ లో ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. కామెడీతో పాటు రిలేషన్‌షిప్ డ్రామాను కలిపిన ఈ ఇటాలియన్ సిరీస్‌ పేరే ‘Real Men Season 2’. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్‌ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

మొదటి సీజన్‌ లో మగతనం గురించి తమకున్న పాత అభిప్రాయాలను మార్చుకోవడానికి ప్రయత్నించిన మాటియా, మాసిమో, రికార్డో, లూయిజీ మరోసారి తమ జీవితాల్లో కొత్త సమస్యలతో ముందుకు వస్తారు. నలుగురూ స్నేహితులే అయినా, ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. ప్రేమ, భార్యాభర్తల సంబంధాలు, ఉద్యోగం, కుటుంబం… ఇలా ప్రతి విషయంలోనూ వాళ్లకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి.

Advertisement

కొత్త సీజన్ లో వీళ్లకు తమలో చాలా మార్పు వచ్చిందని అనిపిస్తుంది. ముఖ్యంగా టాక్సిక్ మాస్క్యులినిటీ నుంచి బయటపడ్డామని, మహిళలను అర్థం చేసుకోవడం నేర్చుకున్నామని భావిస్తారు. కానీ నిజ జీవితంలో ఆ మార్పును అమలు చేయడం అంత సులభం కాదు. కొత్త పరిస్థితి ఎదురైన ప్రతిసారి వాళ్ల పాత అలవాట్లు, పాత ఆలోచనలు మళ్లీ బయటకు వస్తుంటాయి.

మాటియా, మాసిమో, రికార్డో, లూయిజీ జీవితాల్లో ఈసారి సంబంధాలకు సంబంధించిన సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. గత సీజన్‌లో ఏర్పడిన బంధాలు కొత్త దశలోకి వెళ్లడంతో ప్రతి ఒక్కరి ముందూ కొత్త ప్రశ్నలు నిలుస్తాయి. కొందరి జీవితాల్లో కొత్త వ్యక్తులు వస్తారు. మరికొందరి పాత సంబంధాలు మళ్లీ సమస్యగా మారతాయి.ముఖ్యంగా పురుషుడు తన భాగస్వామితో ఎలా ప్రవర్తించాలి, కుటుంబ బాధ్యతలను ఎలా పంచుకోవాలి, తన భావాలను బయటకు చెప్పడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అనే విషయాలను సిరీస్ లో కామెడీగా చూపించారు. వీళ్ల నలుగురి మధ్య ఉన్న స్నేహం మాత్రం కథకు ప్రధాన బలం.

Advertisement

ఒకరి సమస్యలో మరొకరు తలదూర్చడం, సలహాలు ఇవ్వడం, చివరికి అదే సలహాను తామే పాటించలేకపోవడం వంటి పరిస్థితులు నవ్వు తెప్పిస్తాయి. రెండో సీజన్‌లో వీళ్ల నలుగురి జీవితాలు పూర్తిగా వేర్వేరు దారుల్లోకి వెళ్లినా, స్నేహం మాత్రం అలాగే ఉంటుంది. కొత్త ఉద్యోగాలు, పాత ప్రేమలు, కొత్త సంబంధాలు, కుటుంబంలో వచ్చే మార్పులతో ఒక్కొక్కరి జీవితం మరోసారి గందరగోళంగా మారుతుంది. ఈసారి తాము నిజంగా మారిపోయామని నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.

మగతనం అంటే కఠినంగా ఉండటం మాత్రమే కాదని, మన భావాలను అర్థం చేసుకోవడం, భాగస్వామిని గౌరవించడం, కుటుంబంతో బాధ్యతలను పంచుకోవడం కూడా అందులో భాగమేననే విషయాన్ని కామెడీతో చూపించే ప్రయత్నం ఈ సీజన్‌లో కనిపిస్తుంది. ఈ నలుగురు ఫ్రెండ్స్ మరోసారి తమ జీవితాలను ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు ? పాత సమస్యలు వాళ్లను మళ్లీ ఎక్కడికి తీసుకెళ్లాయి ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ను చూడొచ్చు.

Also Read : ప్రేమ పేరుతో మెంటలెక్కించే పనులు… ఎక్స్ రీఎంట్రీతో బుర్రపాడు ట్విస్ట్… ఈ లవ్ ట్రయాంగిల్ చూస్తే బుర్రపాడు

ఏ ఓటీటీలో ఉందంటే ?

ఈ సిరీస్ లో మౌరిజియో లాస్త్రికో మాటియాగా, మత్తేయో మార్తారి మాసిమోగా, ఫ్రాన్సెస్కో మోంటానారి రికార్డోగా, పియెట్రో సెర్మోంటి లూయిజీగా నటించారు. వీరితో పాటు థోనీ, సారా ఫెల్బర్‌బామ్, లౌరా అడ్రియాని, అలీస్ లుపరెల్లి తదితరులు నటించారు. మాటేయో ఒలియోట్టో, మిలెనా కోకొజ్జా దర్శకత్వం వహించారు. రెండో సీజన్ 2026 అక్టోబర్ 7న Netflixలో విడుదలైంది. ఈ సిరీస్ ఇటాలియన్ భాషలో అందుబాటులో ఉంది.

Tags

Related News

ప్రేమ పేరుతో మెంటలెక్కించే పనులు… ఎక్స్ రీఎంట్రీతో బుర్రపాడు ట్విస్ట్… ఈ లవ్ ట్రయాంగిల్ చూస్తే బుర్రపాడు

నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే స్పెషల్ టీమ్… కంటెంట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా… డెడ్లీ క్రైమ్స్ తో సీజన్ 9 స్ట్రీమింగ్ షురూ

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×