BigTV English

OTT Movie : పిల్లల కోసం డాక్టర్ని కలిస్తే సీన్ మొత్తం రివర్స్… పేరుకు మాత్రమే భర్త, పిల్లలు మరొకరితో

OTT Movie : పిల్లల కోసం డాక్టర్ని కలిస్తే సీన్ మొత్తం రివర్స్… పేరుకు మాత్రమే భర్త, పిల్లలు మరొకరితో

OTT Movie : బాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియాలోనే చాలా పాపులర్. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలకు మన ప్రేక్షకులు ఎప్పటినుంచో మంచి అభిమానులుగా ఉన్నారు. ఇండియాలోనే కాకుండా ఈ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. అక్షయ్ కుమార్, కరీనాకపూర్ జంటగా నటించిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ బాలీవుడ్ మూవీ పేరు ‘గుడ్ న్యూజ్’ (Good Newws). 2019 లో రిలీజ్ అయిన ఈ మూవీకి రాజ్ మెహతా దర్శకత్వం వహించారు. దీనిని ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ నిర్మించింది. ఇందులో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, దిల్జిత్ దోసాంజ్, కియారా అద్వానీ నటించారు.  ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్‌ ప్రయత్నంతో ఇద్దరు జంటల చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 27 డిసెంబర్ 2019న థియేటర్లలో విడుదలైంది. 2019లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ₹3.18 బిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

వరుణ్, దీప్తి ప్రొఫెషనల్ గా మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడి ఉంటారు. చాలా సంవత్సరాలు అవుతున్నా వీళ్లకు సంతానం మాత్రం ఉండదు. ఎంతగా ప్రయత్నించినా పిల్లలు పుట్టకపోవడంతో చివరికి ఒక డాక్టర్ని సంప్రదిస్తారు. అయితే ఆ డాక్టర్ పిల్లలు పుట్టే అవకాశం కొంతవరకు ఉందని, సైన్స్ పరంగా ఇది సాధ్యమవుతుందని చెప్పి వాళ్లను కూడాఒక ప్రయోగానికి ఒప్పిస్తాడు. వాళ్లకు కూడా సంతానం లేకపోవడంతో ఈ ప్రయోగానికి ఒప్పుకుంటారు. స్త్రీ లో ఉండే అండాన్ని, పురుషుల శుక్రకణానికి బయట ప్రాణం పోసి స్త్రీ గర్భంలోకి పంపిస్తారు. అలా ఈ ప్రయోగం కూడా సక్సెస్ అవుతుంది. ఒకసారి డాక్టర్లు ఈ జంటని అర్జెంటుగా కలవమని చెప్తారు. ఈ ప్రయోగంలో డాక్టర్లు ఒక తప్పు చేసి ఉంటారు. సంతానం కోసం మరొక జంట హనీ, మౌనిక జంట ఇలాగే డాక్టర్లను సంప్రదించి ఉంటారు. పొరపాటున భర్తల స్పెర్మ్ మారిపోతుంది. ఆ తర్వాత ఈ విషయం తెలిసి వరుణ్ బాధపడతాడు. అబార్షన్ కూడా చేయించుకోమంటాడు. అయితే దీప్తి అందుకు ఒప్పుకోదు. చివరికి ఈ జంట పిల్లల్ని కంటారా? ఆ పిల్లల్ని తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారా? ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘గుడ్ న్యూజ్’ (Good Newws) అనే ఈ మూవీని చూడండి.

Related News

OTT Movie : 33 సంవత్సరాల టైమ్ ట్రావెల్ … తమ్ముడికోసం అన్న షాకింగ్ రిస్క్ … ఫ్యామిలీతో చూసేయచ్చు

OTT Movie : భార్య కంటికి చిక్కే భర్త లవ్ లెటర్… ఆమె ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : సొంత కూతురితో ఆ పని కోసం అబ్బాయిని వెతికే తండ్రి… మైండ్ బెండింగ్ మలయాళ స్టోరీ

Virgin Boys: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన వర్జిన్ బాయ్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా తీసి.. ఫుల్ కామెడీ భయ్యా!

Big Stories

×