Samantha Subham OTT:ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నిర్మాతగా మారి ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం శుభం(Subham). మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు నిర్మాతగా తొలి అడుగు వేసిన సమంతాకు మంచి విజయాన్ని అందించింది ఈ సినిమా. ఈ సినిమాలో హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలు పోషించగా సినిమా బండి దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హార్రర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.
ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన శుభం మూవీ..
ఇకపోతే ఇన్ని రోజులు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రియులను కూడా అలరించడానికి సిద్ధమయ్యింది . అందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ వేదికగా జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు చిత్ర బృందం తాజాగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ విషయం తెలిసి అటు ఓటీటీ ప్రియులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
also read:Squid Game Season 3:వామ్మో.. ఆ ఆటలేంది బాబోయ్.. ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది చూశారా?
శుభం మూవీ స్టోరీ..
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. భీమునిపట్నంకి చెందిన శ్రీను కేబుల్ టీవీ నెట్వర్క్ ను నడుపుతూ.. తన స్నేహితులతో సరదాగా గడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతడికి డిష్ కుమార్ రూపంలో వ్యాపార పోటీ ఎదురవుతుంది. ఇక అదే సమయంలో శ్రీనుకి పెళ్లి జరుగుతుంది. ఇక పెళ్లి తర్వాత కొత్త జీవితం మొదలుపెట్టిన శ్రీనుకి మొదటి రాత్రి వింత అనుభవం ఎదురవుతుంది. టీవీలో ‘జన్మజన్మల బంధం’ సీరియల్ చూస్తున్నప్పుడు ఆయన భార్య శ్రీవల్లి ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. అటు శ్రీను స్నేహితుల భార్యలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. రాత్రి 9 అయితే చాలు ఆత్మలు ఆవహించినట్టుగా ప్రవర్తిస్తూ.. సీరియల్ ఆపేస్తే ఆఖరికి భర్తలపై దాడులకు దిగుతూ ఉంటారు. సీరియల్ అయిపోయాక మళ్ళీ మామూలు మనుషులు అయిపోతారు. ఈ విషయం బయట పెడితే పరువు పోతుందని భయపడిన ఆ ముగ్గురు స్నేహితులు.. మొదట ఎవరికీ చెప్పరు. కానీ ఊళ్లో అందరి ఇళ్లల్లో కూడా ఇదే జరుగుతుందని తెలిసి షాక్ అవుతారు. ఇక అసలు ఈ జన్మజన్మల బంధం సీరియల్ కి, ఈ ఆత్మలకి సంబంధం ఏమిటి? ఈ సమస్యకు పరిష్కారం కోసం మాయ మాత శ్రీ సమంతాను ఎందుకు ఆశ్రయిస్తారు? ఆత్మల నుండి ఆ ఊరి మహిళలకు ఆమె విముక్తి కలిగించిందా? అన్నదే ఈ సినిమా కథ. అధ్యంతం ఆకట్టుకుంటూ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది ఈ సినిమా. చిన్న సినిమానే అయినా మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అటు నిర్మాతకు కూడా మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు ఓటీటీ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
This June 13th, katha aarambham on JioHotstar 💫
Chacchina choodalsindhe 👀 #SubhamOnJioHotstar #Subham @Samanthaprabhu2 @TralalaPictures #JioHotstar pic.twitter.com/If7zN9utiY
— JioHotstar Telugu (@JioHotstarTel_) June 1, 2025