ప్రపంచం వ్యాప్తంగా ఎన్నో గ్రామాలు ఉన్నాయి. విశాలమైన పంట పొలాలు, మట్టితో ఏర్పాటు చేసుకున్న ఇళ్లు, పశువులు మేసే విశాలమైన గడ్డి మైదానాలు, ఆహ్లాదకర వాతావరణంతో ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మనం ప్రపంచంలోని అత్యంత ధనిక గ్రామం గురించి తెలుసుకుందాం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ఎలా అంత ధనవంతమైన గ్రామంగా ఎదిగిందంటే..
ప్రపంచంలోని అత్యంత ధనిక గ్రామం మాధాపర్
ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం మన దేశంలోనే ఉంది. గుజరాత్ కచ్ ప్రాంతంలోని మాధాపర్ గ్రామం ఈ అరుదైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్రామ ప్రజలకు 17 బ్యాంకుల్లో దాదాపు రూ. 5,000 కోట్లకు పైగా డిపాజిట్లు ఉండటం విశేషం. ఈ గ్రామంలోని ప్రతి కుటుంబం డబ్బున్న కుటుంబమే. ప్రతి ఒక్కరూ కోటీశ్వరుడే. ఈ గ్రామంలో 7,600 ఇళ్లు ఉన్నాయి. 92,000 జనాభా ఉంది. ఈ గ్రామం అన్ని గ్రామాల మాదిరిగా ఉండదు. చక్కటి రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, అత్యాధునిక పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, చక్కటి విద్యుత్ వ్యవస్థతో పాటు ఏకంగా 17 బ్యాంకులు ఉన్నాయి. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా విశాలవంతమైన భవంతులే కనిపిస్తాయి. ఇప్పుడు మాధాపర్ విలాసవంతమైన పట్టణ సౌకర్యాలతో ఆకట్టుకుంటుంది.
మాధపర్ ధనిక గ్రామంగా ఎలా ఎదిగింది?
మాధపర్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న గ్రామంగా ఎలా మారింది? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. ఇక్కడి ప్రజలే ఆ అరుదైన గుర్తింపు వచ్చేందుకు కారణమయ్యారు. ఈ ఊరి జనాభాలో దాదాపు 65% మంది NRIలు ఉన్నారు. అమెరికా, కెనడా, యుకె, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికాలో ఉంటున్నారు. దశాబ్దాల క్రితమే, పటేల్, మిస్త్రి సమాజానికి చెందిన చాలా మంది విదేశాలకు వెళ్లారు. ముఖ్యంగా ఆఫ్రికాకు వెళ్లారు. అక్కడ రియల్ ఎస్టేట్, వాణిజ్య రంగాల్లో బాగా సక్సెస్ అయ్యారు. సక్సెస్ ఫుల్ కెరీర్లను నిర్మించుకున్నారు. వారు విదేశాలలో స్థిరపడినా, పుట్టిన ఊరితో సంబంధాలను ఎప్పుడూ తెంచుకోలేదు. వారు గ్రామంలో పెట్టుబడి పెట్టడం, ఇంటికి డబ్బు పంపడం, ఇక్కడి సంక్షేమ ప్రాజెక్టులకు డబ్బులు సమకూర్చేవారు.
Read Also: 125 ఏళ్ల హర్యానీ స్వీట్ సెంటర్, హైదరాబాద్ లో ఇదో ట్రెండ్ సెట్టర్!
విదేశాల నుంచి వచ్చిన సంపద స్థానిక బ్యాంకుల్లో డిపాజిట్
విదేశాల నుంచి తమ కుటుంబ సభ్యులు పంపించన డబ్బును గ్రామస్తులు తమ ఊరిలోని బ్యాంకుల్లో దాచుకున్నారు. ఆ సంపద ఏకంగా కోట్ల రూపాయలకు చేరింది. ఇక్కడి గ్రామస్తులంతా కలిసి తమ ఊరును చక్కగా తీర్చిదిద్దుకున్నారు. ఇక్కడ లేని సౌకర్యం అంటూ లేదు. ఇప్పుడు మాధపర్ గ్రామం గుజరాత్ పేరు మాత్రమే కాదు, భారతదేశం గొప్పదనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్తుంది.
Read Also: ఇండియాలో ఇప్పటికీ ఆ రైల్వే లైన్ బ్రిటిషర్లదేనట, ఏటా రాయల్టీ కూడా కట్టించుకుంటున్నారు!