E-Paper
Advertisement

ఫామ్ హౌస్ లో రాత్రయితే విన్పించే వింత శబ్దాలు… పీడకలలా వెంటాడే హర్రర్ మూవీ

ఫామ్ హౌస్ లో రాత్రయితే విన్పించే వింత శబ్దాలు… పీడకలలా వెంటాడే హర్రర్ మూవీ
Advertisement

Horror Movie : హారర్ సినిమాలు చాలా వస్తుంటాయి. కానీ నిజంగా భయపెట్టే సినిమాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెపుకోబోయే సినిమా అలాంటిదే. భయంతో ప్రేక్షకుడిని వణికించే సినిమాలు మీకు ఇష్టమైతే ‘The Dark and the Wicked’ మీకోసమే. 2020లో విడుదలైన ఈ అమెరికన్ సూపర్‌నేచురల్ సైకాలజికల్ హారర్ చిత్రానికి బ్రయాన్ బెర్టినో దర్శకత్వం వహించారు. మారిన్ ఐర్లాండ్, మైకేల్ అబాట్ జూనియర్, జాండర్ బెర్క్లీ ప్రధాన పాత్రల్లో నటించారు. విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు Rotten Tomatoesలో 91% క్రిటిక్స్ స్కోర్ లభించింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే?

The Dark and the Wicked 2020లో విడుదలైంది. ప్రస్తుతం భారత్‌లో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ స్ట్రీమింగ్ కావడం లేదు. అయితే కొన్ని దేశాల్లో AMC+, Prime Video వంటి ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో భారతీయ ఓటీటీల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. మీరు దీనిని Google Play Store ద్వారా డిజిటల్‌గా అద్దెకు తీసుకోవచ్చు లేదా కొనుగోలు చేసి చూడవచ్చు.

కథలోకి వెళ్తే…

Advertisement

టెక్సాస్‌లోని ఒక మారుమూల గొర్రెల ఫామ్‌హౌస్‌లో ఉండే ఒక వృద్ధుడు చావుబతుకుల మధ్య మంచాన పడతాడు. అతని పరిస్థితి విషమించడంతో, నగరంలో ఉండే అతని కూతురు లూయిస్, కొడుకు మైఖేల్ తమ తల్లికి తోడుగా ఉండటానికి ఇంటికి వస్తారు. అయితే, అక్కడికి రాగానే వారికి వాతావరణం చాలా వింతగా, భయానకంగా అనిపిస్తుంది. వారి తల్లి (వర్జీనియా) వారిని అక్కడికి రావద్దని, వెంటనే వెళ్ళిపోమని చెప్తుంది. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని వారు భావిస్తారు.

పిల్లలు వచ్చిన మొదటి రోజే, ఆ ఇంట్లో ఏదో కంటికి కనిపించని దుష్టశక్తి ఉన్నట్లు వారికి అర్థమవుతుంది. ఆ రాత్రి తల్లి ఇంట్లో ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుంటుంది. తల్లి చనిపోయాక, కోమాలో ఉన్న తండ్రిని చూసుకుంటూ ఆ తోబుట్టువులు ఇద్దరూ ఆ ఇంట్లోనే ఉండిపోతారు. ఆ సమయం నుండి ఆ దుష్టశక్తి వీరిని మానసికంగా పీడించడం మొదలుపెడుతుంది. చివరికి వాళ్ళు ఆ దుష్ట శక్తి నుంచి బయట పడతారా ? అది ఎందుకు వీళ్ళను వెంటాడుతోంది ? అనే విషయాలతో కథ వణుకు పుట్టిస్తుంది.

Advertisement

Read Also : లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా తెలుగు సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే

Related News

అర్జునుడిని మించిన విలుకాడు.. అయినా జీవితమంతా అవమానాలే… ఓటీటీలోకి తెలుగులోనే కర్ణుడి కథ

ఇదెక్కడి ఉన్మాదంరా అయ్యా… పెళ్ళాన్ని చంపిందని షార్క్ పై పగబట్టే సైకో

ఒక హత్య… వంద అనుమానాలు… క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గ్యారంటీ

డబ్బుల కోసమే బాయ్ ఫ్రెండ్ తో ప్రేమ డ్రామా… నాగ దుర్గ తమిళ మూవీ తెలుగు స్ట్రీమింగ్ షురూ

ఒక ప్రయాణం… రెండు ప్రేమకథలు… ప్రతి కుటుంబం చూడాల్సిన రోడ్ ట్రిప్ డ్రామా

తల్లికి పెళ్లి చేయాలనుకునే పెళ్లీడుకొచ్చిన కొడుకు… విజయ్ ఆంటోని ఫ్యామిలీ డ్రామా తెలుగులో

కుస్తీ పోటీల్లో ఇరగదీసే భార్య… ఇంట్లోనే స్ట్రగులయ్యే భర్త… తమిళ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు తెలుగులోనే

చెక్క వంతెన దాటితే చావు మూడినట్టే… క్లైమాక్స్‌తో పిచ్చెక్కించిన మలయాళం కల్ట్ మూవీ తెలుగులో

Big Stories

Advertisement
×