BigTV English

OTT Movie : శవంతో శోభనం… అంతలోనే ప్రెగ్నెంట్… నెక్స్ట్ వచ్చే ట్విస్ట్ మెంటల్ మాస్ భయ్యా

OTT Movie : శవంతో శోభనం… అంతలోనే ప్రెగ్నెంట్… నెక్స్ట్ వచ్చే ట్విస్ట్ మెంటల్ మాస్ భయ్యా

OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలను ఏ భాషలో వచ్చినా ఆదరిస్తుంటారు ప్రేక్షకులు. ఈ సినిమాలు భాష కంటే, భయపెట్టే సీన్స్ తోనే ఎక్కువగా పాపులర్ అవుతుంటాయి. ఇప్పుడు మనం ఒక చైనీస్ 3D హారర్ థ్రిల్లర్ సినిమా గురించి చెప్పుకోబోతున్నాం. ఇది బీజింగ్‌లోని చావోనీ నెం. 81 మాన్షన్‌ ఆధారంగా తెరకెక్కింది. ఇది 1949లో చైనీస్ కమ్యూనిస్ట్ రివల్యూషన్ తర్వాత ఒక అధికారి భార్య ఆత్మహత్య చేసుకోవడంతో హాంటెడ్‌ హౌస్ గా పేరుగాంచింది. ఈ సినిమా చైనాలో 412 మిలియన్లు వసూలు చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన చైనీస్ హారర్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈసినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళ్తే

1914లో హువో రాజ కుటుంబం బీజింగ్‌లోని చావోనీ నెం. 81 మాన్షన్‌లో నివసిస్తుంది. లూ అనే ఒక ప్రాస్టిట్యూట్ సింగర్, హువో మూడో కొడుకు లియాన్కీతో ప్రేమలో పడుతుంది. వీళ్ల పెళ్లిని హువో కుటుంబం వ్యతిరేకిస్తారు. కానీ వారు పట్టుబట్టి పెళ్లి చేసుకుంటారు. షాకింగ్‌గా పెళ్లి రాత్రి లియాన్కీ చనిపోయిన తన అన్న లియాన్పింగ్ శవంతో లూ ని కలిపి, ఆమెను ఒక శవపేటికలో బంధిస్తాడు. ఆశ్చర్యకరంగా ఆమె గర్భవతి అవుతుంది. ఇది కుటుంబంలో రూమర్స్‌కి దారితీస్తుంది.

లూ డియేయు బేస్‌మెంట్‌లో బిడ్డను కని, లియాన్కీతో లేఖలు రాసుకుంటూ ఉంటుంది. కానీ అతను విదేశాల్లో చదువుతున్నాడని, తిరిగి రాడని తెలుస్తుంది. కథ ప్రెజెంట్ కి వస్తుంది. షు రువోకింగ్ అనే ఒక రచయిత్రి, తన కూతురు జావో షియావోమెంగ్‌తో ఈ మాన్షన్‌లోకి వస్తుంది. తన ప్రేమికుడు, పబ్లిషర్ జావో యిటాంగ్ తో కలిసి జీవించాలనుకుంటుంది. షు రువోకింగ్ ఈ ఇంట్లోకి రాగానే, ఆమె గతంతో సంబంధం ఉన్న ఆత్మలు బయటకు వచ్చి హాంట్ చేస్తాయి.


ఇప్పుడు షు రువోకింగ్, జావో యిటాంగ్‌తో గొడవలు పడుతుంటుంది. ఎందుకంటే అతను తన పర్సనల్ అసిస్టెంట్ లియు లీతో ఎఫైర్‌లో ఉన్నాడని అనుమానిస్తుంది. ఆమె ఈ ఇంటిలో భయంకరమైన దృశ్యాలు (రక్తంతో నిండిన బాత్‌టబ్, అద్దంలోంచి బయటకు వచ్చే చేతులు) చూస్తుంది. మొదటి కథలో లూ డియేయు బేస్‌మెంట్‌లోనే చనిపోతుంది. ఆమె ఆత్మ ఈ ఇంట్లో సంచరిస్తుంటుంది. షు రువోకింగ్ తనకు, లూకి ఉన్న సంబంధాన్ని, ఈ హాంటింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెడుతుంది. అయితే ఈ క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆ ఇంట్లో నిజంగా ఆత్మలు ఉన్నాయా ? షు రువోకింగ్ కనిపెట్టే సీక్రెట్ ఏమిటి ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ చైనీస్ హారర్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘The House That Never Dies’ 2014లో విడుదలైన చైనీస్ హారర్ థ్రిల్లర్ చిత్రం. రేమండ్ యిప్ దర్శకత్వంలో, రూబీ లిన్ (జు రుక్వింగ్), ఫ్రాన్సిస్ ఎన్జీ (జావో యిటాంగ్), టోనీ యాంగ్, మోనికా సియు-కీ మోక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2014 జూలై 18న విడుదలై, 1 గంట 30 నిమిషాల రన్‌టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ప్లెక్స్‌లో మాండరిన్ ఆడియోతో, ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.

Read Also : అబ్బాయిలను రెచ్చగొట్టి ఆ పని చేసే టీనేజర్… పని కానిస్తూ పరలోకానికి క్లయింట్… ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూడాల్సిన మూవీ

Related News

OTT Movie : ఆ అపార్ట్మెంట్ లో అందరూ అలాంటి వాళ్ళే… మహిళ మిస్సింగ్ తో లింకు.. లిఫ్ట్ లో నడిచే క్రేజీ మలయాళ మర్డర్ మిస్టరీ

OTT Movie : డ్రైనేజీ దగ్గర డెడ్ బాడీ… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… స్పైన్ చిల్లింగ్ మలయాళ మర్డర్ మిస్టరీ

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీలోకి 15 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : 20 ఏళ్ల అమ్మాయితో 60 ఏళ్ల ముసలాడు… సంయుక్త మీనన్ ను ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసుండరు భయ్యా

OTT Movie : పొరుగింటి వాడితో భార్య… మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చే భర్త… చక్కిలిగింతలు పెట్టే మలయాళ ఫ్యామిలీ డ్రామా

Big Stories

×