E-Paper
Advertisement

అమెరికాను కుదిపేసిన రియల్ సైకో స్టోరీ… తెలుగులోనే ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్

అమెరికాను కుదిపేసిన రియల్ సైకో స్టోరీ… తెలుగులోనే ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్
Advertisement

True Crime Documentary: ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీలకు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకుని, ఒక్కో ఆధారాన్ని బయటపెడుతూ కథను ముందుకు తీసుకెళ్లే ఇలాంటి సిరీస్‌లు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి. అందులోనూ ఎన్నో రోజుల పాటు పోలీసులకే మిస్టరీగా మారిన కేసు అయితే ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి ఓ సంచలన కేసే The Idaho Murders College Nightmare’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికాలో 2022లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ హత్యలు ఎలా జరిగాయి ? అసలు నిందితుడు ఎవరు ? పోలీసులకు అతడు ఎలా చిక్కాడు ? అనే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఈ డాక్యుమెంటరీ సిరీస్ సాగుతుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

2022 నవంబర్… అమెరికాలోని ఇడాహో యూనివర్సిటీకి చెందిన నలుగురు కాలేజ్ విద్యార్థులు ఒక ఇంట్లో కలిసి ఒక ఇంట్లో ఉండేవారు. కానీ ఒకరోజు రాత్రి జరిగిన సంఘటన దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. అర్థరాత్రి సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ ఇంట్లోకి చొరబడి, నిద్రలో ఉన్న నలుగురిని అత్యంత దారుణంగా హత్య చేస్తాడు.

Advertisement

షాకింగ్ విషయం ఏంటంటే… అదే ఇంట్లో ఉన్న మరో ఇద్దరు విద్యార్థినులు మాత్రం ప్రాణాలతో బయటపడతారు. దీంతో అసలు హంతకుడు ఎవరు ? ఎందుకు ఆ నలుగురినే టార్గెట్ చేశాడు ? అతనికి వాళ్లతో ఏమైనా సంబంధం ఉందా ? అనే ప్రశ్నలు ఒక్కసారిగా అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేశాయి. సోషల్ మీడియాలో వందలాది ఊహాగానాలు, థియరీలు వైరల్ అయ్యాయి. కానీ పోలీసులు మాత్రం ఒక్క ఆధారం కోసం నెలల తరబడి కష్టపడాల్సి వచ్చింది.

కేసు ముందుకు వెళ్లే కొద్దీ దర్యాప్తులో ఎన్నో ఊహించని విషయాలు బయటపడతాయి. ఆధారాలు లేకుండా కనిపించిన ఈ కేసులో చివరకు ఫోరెన్సిక్ సైన్స్, డీఎన్ఏ టెక్నాలజీ ఎంత కీలకంగా మారింది ? నిందితుడిగా గుర్తించిన బ్రయాన్ కోబెర్గర్ వరకు పోలీసులు ఎలా చేరుకున్నారు ? ప్రతి ఆధారాన్ని ఎలా కలిపారు ? అనేది ఒక్కో ఎపిసోడ్‌లో ఉత్కంఠభరితంగా చూపించారు. అయితే దర్యాప్తులో జరిగిన కీలక మలుపులు, చివరి పరిణామాలను మాత్రం ముందే చెప్పకుండా సిరీస్‌ను ఆసక్తికరంగా నడిపించారు.

తెలుగులోనే స్ట్రీమింగ్

Advertisement

ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు డబ్బింగ్‌లో కూడా అందుబాటులో ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సిరీస్‌ను ఈజీగా చూడొచ్చు. ఇందులో నిజమైన క్రైమ్ సీన్ ఫొటోలు, బాధితుల కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూలు, కేసును విచారించిన అధికారుల వివరాలు ఉండటంతో… చూస్తున్నంతసేపూ నిజమైన దర్యాప్తును దగ్గర నుంచి చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇది కేవలం ఒక హత్య కేసు గురించి మాత్రమే కాదు… చిన్న ఆధారం కూడా ఎంత పెద్ద మిస్టరీని ఛేదించగలదో చూపించే నిజమైన కథ. క్రైమ్ డాక్యుమెంటరీలు ఇష్టపడే వారికి ఈ సిరీస్ మంచి ఛాయిస్ అవుతుంది.

Read Also: పంచంలోనే తొలి సీక్రెట్ స్పై ఏజెన్సీ ఎలా పుట్టింది ? ఈ మూవీ చూస్తే షాక్ అవుతారు

Tags

Related News

డిజిటల్ యుగంలో పాత ఫ్యాషన్ క్వీన్ కష్టాలు… ఓటీటీలోకి అడుగు పెట్టిన క్లాసిక్ హిట్‌ సీక్వెల్‌

ఓటీటీ వార్ ప్రకటించిన జీ5 … తెలుగు ఆడియన్స్ కు ఎంజాయ్ పండగో

100 ఎపిసోడ్స్ హిట్… తెలుగు ఆడియన్స్ మెచ్చిన తమిళ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

చేదు గతం… కొత్త జీవితం… ఈ ప్రేమకథ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది

థియేటర్లలో ఆడియెన్స్ ను ఏడిపించిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ… ఒకరోజు ముందే ఓటీటీలోకి తెలుగులో

శ్రీనివాస మంగాపురం ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీలోకి 4 కొత్త సినిమాలు.. ఆ 2 మాత్రం మిస్ అవ్వద్దు!

Big Stories

Advertisement
×