BigTV English

Squid Game Season 3 Review: ‘స్క్విడ్ గేమ్ సీజన్ 3’ రివ్యూ… చివరి సీజన్ డెడ్లీ డెత్ గేమ్స్ కిక్ ఇచ్చాయా ?

Squid Game Season 3 Review: ‘స్క్విడ్ గేమ్ సీజన్ 3’ రివ్యూ… చివరి సీజన్ డెడ్లీ డెత్ గేమ్స్ కిక్ ఇచ్చాయా ?

రివ్యూ : స్క్విడ్ గేమ్ సీజన్ 3
ఓటీటీ : నెట్‌ఫ్లిక్స్
రన్‌టైమ్ : 8 ఎపిసోడ్‌లు (ఒక్కో ఎపిసోడ్ 45-60 నిమిషాలు)
దర్శకుడు : హ్వాంగ్ డాంగ్-హ్యూక్
నటీనటులు : లీ జంగ్-జే, పార్క్ హే-సూ, లీ బ్యంగ్-హన్, వి హా-జూన్, జో యూ-రీ, యిమ్ సి-వాన్, కాంగ్ ఏ-షిమ్, పార్క్ సంగ్-హూన్, గాంగ్ యూ, యాంగ్ డాంగ్-గ్యూన్ తదితరులు


Squid Game Season 3 Review : ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్న నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ చివరి సీజన్ ఈరోజు ఓటీటీలోకి అడుగు పెట్టింది. ‘స్క్విడ్ గేమ్’ మొదటి సీజన్ 2021 సెప్టెంబర్‌లో విడుదల కాగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లోనే అత్యధికంగా చూసిన సిరీస్‌లలో ఒకటిగా నిలవడంతో పాటు, 6 ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులతో సహా చాలా అవార్డులను గెలిచి చరిత్ర సృష్టించింది. గతేడాది డిసెంబర్‌లో ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 2 రిలీజ్ కాగా, దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చివరి సీజన్ ‘స్క్విడ్ గేమ్ సీజన్ 3’ వచ్చేసింది. మరి ఈ సీజన్ డెడ్లీ డెత్ గేమ్స్ తో ఫస్ట్ సీజన్ లాగే కిక్ ఇచ్చిందా, లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ
మొదటి సీజన్ లో హీరో విన్నర్ గా నిలిచి ప్రాణాలతో బయటకు వెళతాడు. రెండవ సీజన్ లో పేద వాళ్ళనే టార్గెట్ చేసి, ఇలాంటి దారుణమైన డెత్ గేమ్స్ ఆడిస్తున్న వాళ్ళ అంతు చూడాలి అనుకుంటాడు. దీంతో అనుకోకుండా మళ్ళీ అదే గేమ్ లో చిక్కుకుంటాడు. ఈసారి ప్లేయర్ 456 అక్కడున్న వాళ్ళలో కొంతమందితో కలిసి గేమ్ మేకర్స్ పై తిరుగుబాటు దాడి చేసి, ఓడిపోయాడు. సీజన్ 2 ఎండింగ్ లో జి-హున్ (లీ జంగ్-జే), మిగతా ఆటగాళ్ల భవితవ్యం అగమ్యగోచరంగా మిగిలింది. అండర్‌కవర్ ప్లేయర్‌గా కంపించిన ఫ్రంట్ మ్యాన్ (లీ బైయుంగ్-హున్) అసలు రూపాన్ని హీరో బయటపెడతాడా? జున్-హో ఆ ప్రాణాంతక ఆటలు జరిగే ద్వీపాన్ని కనుక్కుంటాడా? అనే సస్పెన్స్ తో ఎండ్ అయ్యింది.


మూడవ సీజన్ లో… 60 మంది మిగిలిన ప్లేయర్లతో (జో యూ-రీ, యిమ్ సి-వాన్, పార్క్ సంగ్-హూన్, కాంగ్ ఏ-షిమ్) కలిసి, గి-హున్ 45.6 బిలియన్ వోన్ బహుమతి కోసం మరింత భయంకరమైన డెత్ గేమ్స్ లో ప్రాణాలకు తెగించి పోరాడతాడు. ఫ్రంట్ మ్యాన్ (లీ బ్యంగ్-హన్) VIPలతో కలిసి గేమ్‌ను కంట్రోల్ చేస్తాడు, అయితే డిటెక్టివ్ హ్వాంగ్ జున్-హో (వి హా-జూన్) ఈ ఐలాండ్‌ను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. మరి చివరికి ఆ ఫ్రంట్ మ్యాన్ ఎవరో తెలిసిందా? సిరీస్ లో ఈసారి ఎలాంటి డెడ్లీ గేమ్స్ పెట్టారు ? డిటెక్టివ్ ఆ ఐలాండ్ ను కనిపెట్టగలిగాడా? క్లైమాక్స్ ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ
చివరి సీజన్ లో ఉన్న కొన్ని కొత్త గేమ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. హైడ్ అండ్ సీక్, జంప్ రోప్, స్కై స్క్విడ్ గేమ్ వంటి గేమ్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తాయి. కానీ డైరెక్టర్ ఇందులో డెడ్లీ గేమ్స్ కంటే ఎక్కువగా సెంటిమెంట్, ఎమోషన్స్ కు ప్రాధాన్యతను ఇచ్చాడు. Kim Ji‑yong సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్, Jung Jae-il హాంటింగ్ స్కోర్ భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. సామాజిక అసమానతలు, డెమోక్రసీ వంటి అంశాల గురించి ఆలోచింపజేసేలా చేస్తుంది ఈ సిరీస్. గేమ్‌లలో ప్లేయర్లు తీసుకునే హానెస్ట్ నిర్ణయాలు మానవ స్వభావంపై లోతైన ప్రశ్నలను లేవనెత్తుతాయి. గి-హున్ చేసే అడ్వెంచర్స్, ఫ్రంట్ మ్యాన్ రివిలేషన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ, థ్రిల్ ఇస్తే, జున్-హో ఇన్వెస్టిగేషన్, సిరీస్ ముగింపు ఎమోషనల్‌గా సంతృప్తికరంగా ఉంది. అయితే ఇది కొంతమందికి ఓపెన్-ఎండెడ్‌గా అనిపించవచ్చు.

మొదటి మూడు ఎపిసోడ్‌లు సీజన్ 2 సీన్స్ ను రీక్యాప్ చేస్తూ కొంత నెమ్మదిగా సాగుతాయి. కొత్త ప్లేయర్ల బ్యాక్‌స్టోరీలు కొన్నిసార్లు డిస్‌కనెక్టెడ్‌గా అనిపిస్తాయి. సీజన్ 1, 2లోని రిపీటీటివ్ థీమ్స్ వల్ల ఫ్రెష్ నెస్, ఇంపాక్ట్ తగ్గినట్టు అన్పిస్తుంది. యిమ్ సి-వాన్ (సంగ్-వూ), పార్క్ హే-సూ (చోయ్) వంటి కొన్ని పాత్రలకు స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళ రోల్స్ అసంపూర్ణంగా అనిపిస్తాయి. కొన్ని గేమ్ రూల్స్… ముఖ్యంగా ఒక VIP సంబంధిత సబ్‌ప్లాట్ లాజిక్ లెస్ గా అన్పిస్తుంది.

నటీనటులు
లీ జంగ్-జే గి-హున్‌గా అద్భుతమైన నటనతో మెరిసాడు. ఆయన పాత్రలో గిల్ట్, హోప్ మధ్య సంఘర్షణను హార్ట్ టచింగ్ గా చిత్రీకరించాడు దర్శకుడు. జో యూ-రీ (జున్-హీ), కాంగ్ ఏ-షిమ్ (గ్యూమ్-జా) వంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ తమ నటనతో ఎమోషనల్ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా జున్-హీ బేబీ స్టోరీలైన్ హైలైట్. లీ బ్యంగ్-హన్ ఫ్రంట్ మ్యాన్‌గా తన రోల్ లో ఆకట్టుకున్నాడు.

ప్లస్ పాయింట్స్
నటీనటుల యాక్టింగ్
గేమ్ డిజైన్
విజువల్స్
క్లైమాక్స్

మైనస్ పాయింట్స్
సన్నివేశాల సాగదీత
లాజిక్ లెస్ సీన్స్
అండర్‌డెవలప్డ్ క్యారెక్టర్స్

చివరగా
‘స్క్విడ్ గేమ్’ సీజన్ 3 సిరీస్‌కు ఒక పవర్ ఫుల్, ఎమోషనల్‌ ఎండింగ్. అయితే సీజన్ 1 రేంజ్ బ్లడ్ బాత్ ను ఎక్స్పెక్ట్ చేసే వారికి మాత్రం డ్రామా ఎక్కువ, డెత్ గేమ్స్ థ్రిల్ తక్కువ అన్పించే ఛాన్స్ ఉంది. కాకపోతే సీజన్ 2 కంటే ఇదే బెటర్.

Squid Game Season 3 Rating : 2.5/5

Related News

Bakasura Restaurant Movie Review : బకాసుర రెస్టారెంట్ రివ్యూ : హాఫ్ బేక్డ్ మూవీ

Coolie First Review: కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ.. హైప్ ని మ్యాచ్ చేస్తుందా?

Arebia Kadali Review: అరేబియ కడలి రివ్యూ.. తండేల్‌కి తక్కువే ?

SU from SO Telugu Review : ‘సు ఫ్రొం సో’ రివ్యూ’ రివ్యూ… ఇది ఊహించని కామెడీ

Mayasabha Review : మయసభ రివ్యూ 

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Big Stories

×