Romantic Comedy: లవ్ స్టోరీల పేరుతో ఓటీటీలోకి అడుగు పెడుతున్న చాలా సినిమాలలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా కన్పిస్తోంది. కానీ అది ఉన్నప్పటికీ హార్ట్ టచింగ్ స్టోరీ అన్పించే సినిమా గురించి చెప్పమంటే… బహుశా ఒక్కటి కూడా దొరకదేమో. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మాత్రం ఆ రెండూ అంశాలు కలిసి ఉన్న సినిమానే. ఈ హార్ట్ టచింగ్ రొమాంటిక్ మూవీ పేరు ‘వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్’ (Voicemails for Isabelle). చనిపోయిన చెల్లెలికి ఆమె పంపిన వాయిస్ మెసేజ్‌లు… ఒక అపరిచితుడి హృదయాన్ని ఎలా కదిలించాయి అనేది ఇందులో చూడవచ్చు. 2026లో విడుదలైన ఈ అమెరికన్ హార్ట్-టచింగ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
ఈ సినిమా ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య ఉన్న అపురూపమైన అనుబంధం, ఒంటరితనం, ఆశ్చర్యకరమైన ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. కుటుంబం, ప్రేమ గురించి మనసును టచ్ చేసే సందేశం ఇచ్చే అందమైన చిత్రం. జిల్ శాన్ ఫ్రాన్సిస్కోలో యంగ్ చెఫ్ గా పని చేస్తుంది. ఆమె తన జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయం… అంటే రోజంతా వంట చేసిన అనుభవాలు, డేటింగ్ ఫెయిల్యూర్స్, కామెడీ సన్నివేశాలు, కోపం, ఆనందం అన్నీ తన చెల్లెలు ఇసాబెల్ తో వాయిస్ మెయిల్స్ ద్వారా పంచుకుంటుంది.
ఇసాబెల్ ‘సిస్టిక్ ఫైబ్రోసిస్’ అనే డేంజరస్ వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. అయినా ఇద్దరి మధ్య ఉన్న బంధం అద్భుతం అన్నట్టే ఉంటుంది. ఒకరోజు ఇసాబెల్ వ్యాధి తీవ్రమవడంతో మరణిస్తుంది. జిల్ తన చెల్లెలు ఇక లేదన్న విషయాన్ని తట్టుకోలేకపోతుంది. చెల్లెలు చనిపోయినా, ఆమె అలవాటు మాత్రం మారదు. ఇసాబెల్ పాత ఫోన్ నెంబర్‌కు రెగ్యులర్ గా వాయిస్ మెసేజ్‌లు పంపుతూనే ఉంటుంది. తన బాధను, ఒంటరితనాన్ని, కొత్త డేటింగ్ స్టోరీలను, రొటీన్ జీవితాన్ని ఆ ఫోన్‌కు చెప్పుకుంటూ ఉంటుంది.
ఇక్కడే ఆమె లైఫ్ లో ఒక అపరిచితుడి ఎంట్రీ ఉంటుంది. ఇసాబెల్ మరణించిన తర్వాత ఆ ఫోన్ నెంబర్ టెక్సాస్‌లోని ఆస్టిన్ నగరంలో ఉండే రియల్ ఎస్టేట్ ఏజెంట్ వెస్ దగ్గరకు చేరుతుంది. జిల్ పంపే ఎమోషనల్, కామెడీ వాయిస్ మెయిల్స్ అన్నీ వెస్‌కు చేరుతాయి. మొదట్లో వెస్ ఇవి తప్పు నెంబర్‌కు వచ్చాయని భావించి జిల్‌కు చెప్పాలనుకుంటాడు. కానీ జిల్ వాయిస్‌లోని నిజాయితీ, చెల్లెలి మీద ఉన్న అపారమైన ప్రేమ అతని హృదయాన్ని కదిలిస్తాయి. ముఖం చూడకుండానే, ఆమె గురించి తెలియకుండానే వెస్ ఆమెపై ప్రేమలో పడిపోతాడు.
వెస్ జిల్‌ను కలవాలని శాన్ ఫ్రాన్సిస్కోకు వస్తాడు. అక్కడ ఆమెకు తానెవరో చెప్పకుండా స్నేహితుడిగా పరిచయమవుతాడు. నెమ్మదిగా వారిద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. జిల్ తన బాధ నుండి నెమ్మదిగా బయటపడుతూ, కొత్త ఆశలతో జీవితాన్ని చూడడం నేర్చుకుంటుంది. మరి నిక్ గురించిన నిజం ఎలా బయట పడింది ? తన వాయిస్ మెయిల్స్ విని, అపరిచితుడిగా పరిచయం అయిన ఆ వ్యక్తిని హీరోయిన్ ఏం చేసింది ? క్లైమాక్స్ లో ఇద్దరూ కలిశారా లేదా ? అనేది తెలియాలంట ఈ సినిమాను వీక్షించాల్సిందే. పెద్దలకు మాత్రమే అనేలా కొన్ని సీన్స్ ఉంటాయి జాగ్రత్త.
కామెడీ, ఎమోషన్స్, రొమాన్స్, కుటుంబ బంధాలను అద్భుతంగా మేళవించి తీసిన ఈ సినిమాకు, జోయీ డ్యూచ్ నటన, నిక్ రాబిన్సన్ సహజత్వం ప్రాణం పోస్తాయి. ఈ మూవీ ప్రస్తుతం Netflixలో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. జోయీ డ్యూచ్, నిక్ రాబిన్సన్, సియారా బ్రావో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి లేహ్ మెక్‌కెండ్రిక్ దర్శకత్వం వహించారు. జూన్ 19 నుంచి ఈ మూవీస్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : ఒక్క మెసేజ్ తో భార్య ఎఫైర్ బట్టబయలు… ఆ భర్త చేసిన పని చూస్తే బుర్రపాడు