E-Paper
Advertisement

ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ ఉన్నా.. కిష‌న్‌రెడ్డి ద్వారా ఆయ‌న ఆలోచ‌న‌లు అమ‌లు!

ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ ఉన్నా.. కిష‌న్‌రెడ్డి ద్వారా ఆయ‌న ఆలోచ‌న‌లు అమ‌లు!
Advertisement

కేసీఆర్ అందుబాటులో లేడ‌నుకుంటున్నారు అంద‌రూ. ఆయ‌న అందుబాటులో లేనిది ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే. వారి మీద కేసీఆర్‌కు కోపం. అల‌క‌. ప్ర‌తీకారేచ్చ‌. అవును.. కేసీఆర్ భాష‌లో చెప్పాలంటే ఇది నా క‌విత్వం కాదు. ఆయ‌నే అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌జ‌ల‌కు వార్నింగ్ ఇచ్చాడు. మాకు ఓటేయ‌క‌పోతే మీ ఇష్టం.. అది మీకే న‌ష్టం..! నేను ప‌రాఖ‌త్ పోయి నా ఫామ్‌హౌజ్‌లో రెస్ట్ తీసుకుంటా! అని కూడా బెదిరింపుల‌కు దిగాడు చివ‌ర‌కు. కానీ జ‌నాలు విన‌లేదు. ఓడ‌గొట్టారు. ఇంత చెప్పినా విన‌లే.. ఇగ అనుభ‌వించుండ్రి..! అని ఆడ‌నే కూర్చుని అన్నీ చూస్తున్నాడు.

ఇవ‌న్నీ పాత ముచ్చ‌ట్లే గానీ.. అస‌లు ముచ్చ‌టకు వ‌ద్దాం. పైన హెడ్డింగొక‌టి పెట్టి.. మ‌ళ్లా కేసీఆర్ పాత క‌థ‌నే చెబుతున్నాడ‌ని అనుకోవ‌ద్దు. అక్క‌డికే వ‌స్తున్నా. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ పెట్టిండు. సేమ్ మ‌ళ్లీ అవే మాటలు. కొత్త‌వేం లేవు. ముందుగా మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఇష్యూ. బీజేపీ కి గాడ్సే ఆద‌ర్శ‌మ‌నుకున్నాం.. కానీ అంత‌కు మించి తెగించారు.. ఉత్త‌ర కొరియా నియంత కిమ్‌జాంగ్‌ను కూడా ఆద‌ర్శంగా తీసుకున్నార‌ని క‌సిగా తిట్టేశాడు. ఇక నియంత అన్నాడు కాబ‌ట్టి.. హిట్ల‌ర్ టాపిక్ వ‌చ్చిన‌ట్టుంది. ఏ పోవ‌యా నేనేడ‌న్నా..! హిట్ల‌ర్ నాకు స్పూర్తి అని. మెడ‌కాయ మీద త‌ల‌కాయున్నోడు ఎవ‌డైనా అట్లంట‌డా? అని కూడా క‌సురుకున్న‌డు.

Advertisement

ఈ హిట్ల‌ర్, నియంత పాల‌న మాట‌ల‌కు బ్రేకులు వేయండ‌ని ఆయ‌న ఉద్దేశం ఉన్న‌ట్టుంది. ఇగ అస‌లు విష‌య‌మేందంటే.. ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ పండుకున్నా.. కిష‌న్‌రెడ్డి ద్వారా త‌న ఆలోచ‌న‌ల‌న్నీ అమ‌లు చేయిస్తున్న‌డంట‌…! ఇంత‌కీ ఏమా ఆలోచ‌న‌లు…? తెలంగాణ అభివృద్ది కోస‌మా? కాదు. కానే కాదట‌. తెలంగాణ అభివృద్దిని ఎట్లా అడ్డుకోవాలె..! సీఎం రేవంత్‌రెడ్డి కాళ్ల‌ల్లా క‌ట్టె ఎట్లా పెట్టాలె! అనే ఒకే ఒక్క విష‌యంలోనేన‌ట‌. అవును.. ఈ సీక్రెట్ ఆయ‌నే చెప్పిండు.

కిష‌న్‌రెడ్డికి .. ఫామ్‌హౌజ్ నుంచి ఫోన్ వ‌స్త‌ద‌ట‌. కేసీఆర్‌.. లైన్లోకి వ‌స్తాడు. ఇవాళ నువ్వు ఢిల్లీ పోవాల్నోయ్‌! ఎందుకే! అరే నువ్వెంత హౌ..గాడివున్న‌వ్ బై! అరే.. సార్ మ‌ల్లా తిట్ట‌వ‌డ్తివి! స‌రే, తియ్ అల‌వాటైంది. నీకు కూడా తిట్లువ‌డుడు అల‌వాటే క‌దా! అస‌లు ముచ్చట చెప్పుర్రి! అదే నువ్ ఢిల్లీ పోవాలె! ఆ పోయి.., అదే వ‌యా.. గా ర‌వేంత్‌రెడ్డి మొన్న మూడు రోజుల కింద ఢిల్లీల ఎవ‌లెవ‌ల్ని క‌లిసిండో తెలుసా? నాకెందుకు తెలుస్త‌ది సార్‌! అందుకే నిన్ను.. ! స‌రే స‌రే తిట్ట‌కుర్రి.. తెలుసుకుంట‌.. ! ఆడ ఎవ‌లెవ‌ల్ని క‌లిసిండో.. వాళ్లంద‌రినీ నువ్ కూడా క‌ల‌వాలె! నేనెందుకు క‌ల‌వాలె? అరే చెప్పేదాక కూడా ఓపిక లేకపాయె.. అందుకే నిన్ను.. ! అంద‌రినీ క‌లిసి.. ఏమేం కావాల‌ని సీఎం కోరిండో.. అవ‌న్నీ ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా మీరు చెయ్యొద్ద‌ని చెప్పాలె! ఇంకా! ఆ పేప‌ర్లు ఆళ్ల కాడ్నుంచి గుంజుకుని ఆడ్నే ఉన్న డ‌స్ట్‌బిన్‌ల ప‌డేసి రావాలె! అర్థ‌మైంది ఇగ చాలు నే వొయ్యెస్తా! ఆగు ఆగు నాకు నీ మీద న‌మ్మ‌కం లేదు గానీ.. గా డ‌స్ట్‌బిన్ ఫోటో ఒక‌టి మ‌న సంతుగానికి పంపు! ఫోన్ క‌ట్ అయింది! ఇదీ ముచ్చ‌ట‌.

Advertisement

మ‌రీ  సుతారం కాక‌పోతే.. ఇంత డిటైల్డ్‌గా సీఎం చెప్పిండా..? అన‌కండి. ఆయ‌న ఇంచుమించు ఇదే జ‌రుగుతుంద‌న్నాడు. నేనే దానికి మ‌సాల ద‌ట్టించి..ఇలా వండినాన‌న్న‌మాట‌. ఇగ ఇద్ద‌రూ క‌ల‌గ‌లిసి త‌న‌ను ఎడాపెడా తుక్కుతుక్కు తిడుతిండ్రు అని మీడియా ముందు త‌న బాధ చెప్పుకున్నాడు సీఎం. ఇంత‌క‌న్నా పెద్ద ముచ్చ‌ట్లేం లేవు ఇయ్యాళ‌.

Related News

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

ఇది మా అసెంబ్లీ.. మాక్‌ అసెంబ్లీ.. ! బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ ఫుల్ కామెడీ…! సీరియస్ రచ్చ ఇలా నవ్వుల పాలు..

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!

లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

బీఆర్‌ఎస్‌ సర్వేలో రేవంత్ సర్కార్‌కు పాస్‌ మార్కులు.. ! పాలనపై అసంతృప్తి లేదు.. సంతృప్తీ లేదు..

సభా సమరంలో ఓడినా.. ఇలా సబ్జెక్టుతో కొడతాం! కరెంటు కష్టాలపై సర్కార్‌ను నిలదీసిన బీఆరెస్‌!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

Big Stories

Advertisement
×