E-Paper

వ్యూహం మార్చిన నేత! ఇండి కూటమికి రాహుల్ మార్క్ ఇంధనం..!

వ్యూహం మార్చిన నేత! ఇండి కూటమికి రాహుల్ మార్క్ ఇంధనం..!
Advertisement

రాహుల్ మారాడు. ఎన్డీయే బ‌లంగా త‌యారవుతున్న వేళ… ఇండి కూట‌మిని దానికి అనుగుణంగా ఢీ అంటే ఢీ అనే విధంగా రెడీ చేయడానికి ..త‌గ్గ‌ట్టు వ్యూహ ర‌చ‌న‌లో మార్పు చేసుకుంటున్నాడు. ఆయ‌న‌కు కూలెస్ట్ లీడ‌ర్‌గా పేరుంది. హుందా రాజకీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా చెప్పుకుంటారు. అయినా.. ఇప్ప‌టి రాజ‌కీయాల‌కు త‌గ్గ‌ట్టుగా త‌న‌ను తాను మార్చుకుంటున్నారు. దీనికి తాజా ఉదాహ‌ర‌ణే తమిళ‌నాడు రాజ‌కీయాలు.

ఆయ‌న అనూహ్యంగా తీసుకున్న స్టాండ్‌. అవును.. ఎన్డీయేకు త‌గ్గ‌ట్టుగా ఇండి కూట‌మిని మార్చ‌డానికి రాహుల్ త‌న‌దైన మార్కు ఇంధ‌నాన్నిఅందిస్తున్నారు. కొన్ని విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని ఇక భూత‌ద్దంలో పెట్టి చూసే దృక్కోణం కూడా మారింది. అప్ప‌టి పార్టీ అవ‌స‌రాలు.. త‌మ‌కు క‌లిసి వ‌చ్చే రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు.. భ‌విష్య‌త్ రాజ‌కీయ ప‌రిణామాలు.. వీట‌న్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వెనువెంట‌నే దానిక‌నుగుణంగా నిర్ణ‌యాలు తీసుకోవాల‌నే త‌న వ్యూహాన్ని అమ‌లు ప‌రిచి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచాడు రాహుల్‌.

Advertisement

అప్ప‌టి దాకా ఇండి కూట‌మిలో ఉన్న డీఎంకే దీన్ని తీవ్రంగా విమ‌ర్శించింది. ఇది మిత్ర‌ద్రోహం అన్న‌ది. ఇండి కూట‌మిని క‌కావిక‌లం చేసేందుకే ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నాడ‌ని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టాడు స్టాలిన్‌. కానీ రాహుల్ .. త‌ను అనుకున్న‌దే అమ‌లు చేశాడు. త‌ను ఏం చేస్తున్నాడో తెలుసుకుని మ‌రీ సోయిలో ఉండి నిర్ణ‌యం తీసుకోవ‌డం.. దానికి అనుగుణంగానే ఆయ‌న ముందుకు సాగ‌డం.. ఆయ‌న ధృఢ‌మైన ఆలోచ‌నా స్థాయిని ప‌ట్టించింది.

విజ‌య్ టీవీకే పార్టీ ద‌గ్గ‌ర‌కు రాహుల్ వెళ్ల‌లేదు. విజ‌యే ఒక‌టికి ప‌ది సార్లు రాహుల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. ఎన్నిక‌ల‌కు ముందు త‌న‌తో క‌లిసి పోటీ చేయాల‌ని ఆఫ‌ర్ ప్ర‌కటించాడు. విజ‌య్ .. రాహుల్‌కు ఇచ్చిన మ‌ర్యాద అంతా ఇంతా కాదు. సిద్దాంత ప‌రంగా మోడీతో ఎంత‌గా విభేదిస్తున్నాడో.. రాహుల్‌తో జ‌త‌క‌ట్టేందుకు విజ‌య్ అంత‌గా త‌హ‌త‌హ‌లాడాడు. ఇది గ్ర‌హించాడు రాహుల్. కేవ‌లం అధికారం కోసం, ప‌ద‌వుల కోసం దిగ‌జారు రాజ‌కీయాలు చేయ‌డం రాహుల్‌కు అల‌వాటు లేదు. అది ఆయన సంస్కృతిలోనే లేదు.

Advertisement

త‌ను వ‌చ్చిన పార్టీ డీఎన్ఏనే ఫాలో అవుతూ వ‌స్తున్నాడు. ఫ‌లితాలు రాగానే.. కేవలం 5 సీట్లు గెలుచుకున్నా.. విజ‌య్‌లో అప్ప‌టి రెస్పెక్ట్ త‌గ్గ‌లేదు. అన్నా డీఎంకేతో.. అమిత్ షా ఆడ‌బోయే నెంబ‌ర్ గేమ్‌కు చెక్ పెట్టాల‌న్నా.. ఇండి కూట‌మిని మ‌రింత బ‌లోపేతం దిశ‌గా ముందుకు తీసుకుపోవాల‌న్నా.. రాహుల్ ముందున్న కింక‌ర్త‌వ్యం.. విజ‌య్‌తో జ‌త‌క‌ట్ట‌డం. అందుకే అదే చేశాడు. స్టాలిన్ ఎంత మొత్తుకున్నా విన‌లేదు.

చాలా మందికి రాహుల్ నిర్ణ‌యం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. విమ‌ర్శ‌ల పాల‌య్యాడు రాహుల్‌. అయినా, వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ ప‌రిణామం యావ‌త్ కాంగ్రెస్ శ్రేణుల‌ను కూడా నివ్వ‌ర‌ప‌రిచింది. అంతిమంగా అంతా అనుకున్నారు. రాహుల్ చేసిందే క‌రెక్ట‌ని.ఇలాంటి నిర్ణ‌యాలే ఇండి కూట‌మికి ఇంధ‌నం అవుతాయ‌ని.

ద‌క్షిణ భార‌త‌దేశంలో ఎన్డీయే క్ర‌మంగా త‌న ఉనికి కోల్పోతుండ‌గా.. కాంగ్రెస్ బ‌లం పుంజుకుంటున్న‌ది. అది రాహుల్ మార్చిన న‌యా వ్యూహానికి ద‌క్కిన ఫ‌లితంగానే అంతా చెప్పుకుంటున్నారు. దేశం కోసం, ధ‌ర్మం కోసం అని మోడీ జ‌నాల‌ను ఎలా త‌న వైపు తిప్పుకున్నాడో.. రాహుల్ త‌ను న‌మ్మిన సిద్దాంతాన్ని ఎప్పుడూ వ‌ద‌ల్లేదు. ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా త‌న వాయిస్‌లో మార్పులేదు. త్యాగాల రాజ‌కీయాల వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న రాహుల్‌.. మోడీని ఎదుర్కొని.. ఇండి కూట‌మిని అధికారం దిశ‌గా అడుగులు వేయించాల‌నుకున్నాడే త‌ప్ప‌.. దిగాజారుడు రాజ‌కీయాల జోలికి పోలేదేనాడు. హుందాత‌నం వీడ‌లేదేనాడు.

కానీ మారిన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆయ‌న త‌న పంథా మార్చాడు. శ‌త్రువు బ‌లంగా మారి.. బ‌ల‌హీనంగా మారే స్థితికి వ‌చ్చే ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్నాడు. ఇనుము బాగా వేడెక్కిన త‌రువాత వేసే దెబ్బ‌లా.. రాహుల్ స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాలే తీసుకుంటున్నాడు. అంద‌రూ ఇదే అనుకుంటున్నారు.

Related News

క‌విత‌పై దండ‌యాత్ర‌.. ! మ‌రింత దూకుడుగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆమెపై దాడి!

జెన్‌-జీ మెచ్చిన నేత రాహుల్‌! మ‌రి మోడీపై ఎందుకా వ్య‌తిరేక‌త‌!?

కేటీఆర్ ఆయువు ప‌ట్టు మీద ప‌డింది దెబ్బ‌! సిరిసిల్లా చౌర‌స్తాలో రామ‌న్న గాలి తీసేసిన‌ క‌విత‌..!

దేశం కోసం.. దేశ స‌మైక్య‌త కోసం.. దేశ ద్రోహం..! ఎవ‌రి వాద‌న రైటు..! ఎవ‌రు క‌రెక్టు..?

వ‌రి విచ్చ‌ల‌విడిగా వేసుకోండి..! బీఆరెస్ స్టాండ్ ఏమిటీ? రైతుల‌ను రెచ్చ‌గొట్టేందుకేనా?

పండుగ‌లా రైతుభ‌రోసా.. బ‌హిరంగ స‌భ పెట్టిమ‌రీ నిధుల‌ విడుద‌ల!

కిష‌న్‌రెడ్డి మ‌హారాష్ట్ర టూర్.. రేవంత్‌కు భ‌య‌ప‌డ్డారా? తుమ్మిడిహ‌ట్టిపై తాడోపేడో తేల్చేందుకా?

Big Stories

×