Devika And Danny OTT Review: దేవిక అండ్ డానీ సిరీస్ రివ్యూ.. ఎప్పుడూ సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ.. అటు ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది రీతూ వర్మ. అయితే ఈసారి కాస్త భిన్నంగా ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తన తొలి వెబ్ సిరీస్ ‘ దేవిక అండ్ డానీ’ సిరీస్ తో నిన్న (June 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం జియో హాట్స్టార్ (Jio hot Star) వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. రొటీన్ కి కాస్త భిన్నంగా ఉండే పాత్రలు చేయడంలో ఆసక్తి చూపించే ఈమె ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తో అందరినీ ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను మెప్పించిందా.. ? దేవిక తొలి ప్రయత్నంలో సక్సెస్ అందుకుందా? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
నటీనటులు సాంకేతిక నిపుణులు..
రీతూ వర్మ, సూర్య వశిష్ట, సుబ్బరాజు, సోనియా సింగ్, కోవై సరళ, శివ కందుకూరి తదితరులు కీలకపాత్రలు పోషించారు.
నిర్మాత : సుధాకర్ చాగంటి
దర్శకుడు : బి.కిషోర్
సంగీత దర్శకుడు : జై క్రిష్
సినిమాటోగ్రాఫర్ : వెంకట్ సీ దిలీప్
ఎడిటర్ : కార్తికేయ రోహిణి
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ : జియో హాట్ స్టార్
కథ:
ఆంధ్రప్రదేశ్ రామపురానికి చెందిన దేవికా నందన్ (రీతూ వర్మ) చాలా అమాయకురాలు. ఒక పాఠశాలలో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. తండ్రి మాట జవదాటని దేవిక.. తండ్రి కోరిక మేరకు జగన్నాథం అలియాస్ జగ్గీ(సుబ్బరాజు)తో పెళ్లికి సిద్ధమవుతుంది. అదే సమయంలో ఊహించని విధంగా ఆమెకు డానీ ( సూర్య వశిష్ట) పరిచయం అవుతారు. తక్కువ సమయంలోనే ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడుతుంది. అయితే ఈ పరిచయంలో డానీ ని ఇష్టపడుతుంది దేవిక. ఒకవైపు తండ్రి చూసిన సంబంధం.. మరొకవైపు తాను ఇష్టపడిన అబ్బాయి.. ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనే సందిగ్ధంలో పడిన దేవికకు మరో ట్విస్ట్ ఎదురవుతుంది. డానీ మనిషి కాదు ఒక ఆత్మ అని తెలిశాక ఆమె జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ ఆత్మ చెప్పిన ఒక పని చేసేందుకు దేవిక కూడా అంగీకరిస్తుంది. ఆ ప్రయాణంలో దేవికకు ఎదురైనా సవాల్ ఏంటి? ఆమెకు సహకరించిన సుబ్బు (శివ కందుకూరి) ఎవరు? డానీ అప్పజెప్పిన పని దేవిక సవ్యంగా పూర్తి చేస్తుందా? డానీ దేవికకు మాత్రమే కనిపించడానికి గల కారణం ఏంటి? అసలు డానీ గతమేంటి? ఆయన ఆత్మగా ఎలా మారారు? ఆత్మతో ప్రయాణం చివరికి పెళ్లి వరకు వెళ్లిందా? తన తండ్రిని ఎలా ఒప్పించింది? ఇలా తదితర ఆసక్తికర థ్రిల్లింగ్ అంశాలతో ఈ సిరీస్ ను చాలా అద్భుతంగా తరికెక్కించారు.
విశ్లేషణ..
ఏదైనా కొత్తదనం కోరుకునే వారికి, కంఫర్ట్ జోన్ కి పరిమితమయ్యే వారికి ఈ వెబ్ సిరీస్ బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. అటు రీతు వర్మ ఇటు సూర్య వశిష్ట ఇద్దరు కూడా తమ అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించారు. ఆకర్షణీయమైన మలుపులు, లోతైన భావోద్వేగ అన్వేషణలను కోల్పోయినప్పటికీ.. చక్కటి ప్రదర్శన.. వారాంతంలో రిలాక్స్డ్ గా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్
దేవిక అండ్ డానీ సిరీస్ క్లీన్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ వెబ్ సిరీస్ గా నిలిచింది..
ముఖ్యంగా థియేటర్లలో కాకుండా ఓటీటీ లోకి తీసుకొచ్చి ఒకరకంగా నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు.
రీతూ వర్మ ఇటు వశిష్ట ఎవరికి వారు చాలా అద్భుతంగా నటించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను మెప్పించింది.
సుబ్బరాజు పాత్ర కొద్దిసేపు అయినా హాస్యంతో మంచి ఉపశమనం కలిగిస్తాడు.
మైనస్
కథ ఊహించినట్టు ఉండడం..
బలమైన భావోద్వేగాలు లోపించడం..
లాజిక్ కోరుకునే వారికి పెద్దగా వర్క్ అవుట్ అవ్వదు.
రేటింగ్ : 2.75/5
ALSO READ:Raviteja: రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న రవితేజ ‘వెంకీ’.. ఎప్పుడంటే?