Amazon Great Indian Festival 2026: పండుగల సందడి మొదలైంది.. షాపింగ్ ప్రియులకు అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ‘అర్లీ డీల్స్’ అందుబాటులోకి వచ్చేశాయి. అంటే.. అసలు సేల్ మొదలయ్యే వరకు ఆగాల్సిన అవసరం లేకుండానే ఇప్పటి నుంచే పలు ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ సహా వివిధ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను సొంతం చేసుకోవచ్చు.
ఈ ముందస్తు సేల్‌లో బడ్జెట్ నుంచి ప్రీమియం ఫోన్ల వరకు మంచి డిస్కౌంట్లు ఉన్నాయి.OnePlus N6x మోడల్ బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.18,499కే లభిస్తోంది. అలాగే iQOO Z10 Lite 5G ఫోన్ రూ.15,999కి, iQOO Neo 10 రూ.41,999కి అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ప్రియుల కోసం Lava Bold N2 కేవలం రూ. 8,729కే రెడీగా ఉంది.
ఇంటిని సినిమా థియేటర్‌లా మార్చాలనుకునే వారికి ఇది సరైన సమయం. శాంంసంగ్ 55 అంగుళాల మిని ఎల్‌ఈడీ 4కే విజన్ ఏఐ టీవీ రూ.53,900కే లభిస్తోంది. టీసీఎల్ 55 అంగుళాల క్యూడీ-మిని ఎల్‌ఈడీ టీవీ రూ.62,990కి, అలాగే ఎల్జీ 55 అంగుళాల ఏఐ వెబ్‌ఓఎస్ టీవీని రూ.45,990కే సొంతం చేసుకోవచ్చు.
Also Read: జస్ట్ రూ.6 వేలకే అమెజాన్ బెస్ట్ సెల్లింగ్ టాబ్లెట్.. ప్రైమ్ యూజర్లకు గోల్డెన్ ఛాన్స్ భయ్యా!
గాడ్జెట్ ప్రేమికులకు కూడా మంచి డీల్స్ ఉన్నాయి. OnePlus Watch 2Rని రూ.9,999కి కొనుగోలు చేయవచ్చు. A18 Pro చిప్‌తో వచ్చే యాపిల్ 2026 మ్యాక్‌బుక్ నియో 13 ల్యాప్‌టాప్ రూ.71,990కి లభిస్తోంది. అలాగే నిత్యం సంగీతాన్ని ఆస్వాదించే వారి కోసం మార్షల్ ఆక్టన్ 3 స్పీకర్లు రూ.27,999 కే అందుబాటులో ఉన్నాయి.
ఇంటి అవసరాల విషయానికి వస్తే శాంసంగ్ 653 లీటర్ల స్మార్ట్ రిఫ్రిజిరేటర్ రూ.82,990కి, బాష్ 8 కేజీల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ రూ.31,490కే దొరుకుతున్నాయి. వీటితో పాటు కిచెన్ ప్రొడక్ట్స్‌పై 60 శాతం వరకు, రోజువారీ సరుకులపై 50 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు.
ఎస్‌బీఐ కార్డ్స్ వాడే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్ ద్వారా ప్రైమ్ యూజర్లకు 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ ఉంది. అమెజాన్ పే లేటర్ ద్వారా వడ్డీ లేని ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
Also Read: MP3 పాటల్లోనూ HD సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు.. రూపాయి ఖర్చు లేని 5 ట్రిక్స్ ఇవే!