E-Paper
Advertisement

షాకింగ్.. భారత్‌లో మళ్లీ పెరిగిన Vivo X300 FE ధర.. ఏకంగా రూ.10,000 పెంపు!

షాకింగ్.. భారత్‌లో మళ్లీ పెరిగిన Vivo X300 FE ధర.. ఏకంగా రూ.10,000 పెంపు!
Advertisement

Vivo X300 FE Price Hike: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వీవో తమ ప్రీమియం మోడల్ ‘వీవో X300 FE’ ప్రియులకు ఊహించని షాక్ ఇచ్చింది. భారత్‌లో ఈ ఫోన్ ధరను కంపెనీ మరోసారి పెంచింది. ఫోన్ లాంచ్ అయిన కొన్ని నెలల వ్యవధిలోనే ఇలా ధర పెరగడం ఇది రెండోసారి. గ్లోబల్ మార్కెట్‌లో ర్యామ్, ఇతర స్పేర్ పార్ట్స్ కొరత తీవ్రమవ్వడం వల్ల తయారీ వ్యయం పెరిగి, ఆ భారాన్ని కంపెనీలు కస్టమర్లపై వేస్తున్నాయి.

మొత్తంగా రూ.10,000 పెంపు:

Vivo X300 FE భారత మార్కెట్‌లో 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో మొదట రూ.79,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, కొన్ని రోజుల క్రితమే దీని ధరను రూ.7,000 పెంచి రూ.86,999కి చేర్చారు. ఇప్పుడు తాజాగా మరో రూ.3,000 పెంచడంతో.. ఈ ఫోన్ లాంచ్ ధర కంటే మొత్తంగా రూ.10,000 ప్రియం అయిపోయింది.

Advertisement

Also Read: iPhone Ultra లుక్ లీక్.. ఈ కలర్స్ చూస్తేనే యాపిల్ ప్లాన్ ఏంటో అర్థమైపోతుంది!

కొత్త ధరలు ఇవే:

ధర పెంపు తర్వాత Vivo X300 FE ఫోన్ 12GB+256GB మోడల్ ధర రూ.89,999కి చేరగా.. టాప్‌ఎండ్ వేరియంట్ అయిన 12GB+512GB మోడల్ ధర ఏకంగా రూ.99,999కి పెరిగింది. కొనేవారికి కాస్త ఊరటనిచ్చేందుకు కంపెనీ తక్కువ ధరలో 8GB+256GB కొత్త వేరియంట్‌ను రూ.84,999 ధరకు తీసుకొచ్చింది. పెరిగిన ధరల వల్ల ప్రీమియం విభాగంలో ఈ ఫోన్ మరింత ఖరీదైనదిగా మారింది.

కొనుగోలుదారులపై భారం:

Advertisement

స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ ప్రస్తుతం మెమరీ చిప్స్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేవలం వీవో మాత్రమే కాకుండా ఇతర బ్రాండ్లు కూడా తమ ఫోన్ల ధరలను పెంచే పనిలో ఉన్నాయి. అయితే, రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.10,000 ధర పెరగడం వల్ల ఈ ఫోన్ కొనాలనుకునే వారికి ఇప్పుడు గట్టి జేబుల కోత తప్పడం లేదు. పెరిగిన ధరల నేపథ్యంలో వినియోగదారులు ఈ ఫోన్ వైపు మొగ్గు చూపుతారా లేదా అనేది వేచి చూడాలి.

Also Read: రూ.20 వేలలోపు బెస్ట్ కెమెరా, బ్యాటరీ ఫోన్ కావాలా? Amazon Freedom Saleలో బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

Tags

Related News

హోటళ్లలో Wi-Fi వాడుతున్నారా? అయితే.. మీ వీడియోలు బయటకొస్తాయ్!

బ్యాచిలర్స్,చిన్న ఫ్యామిలీలకు బెస్ట్..కేన్‌స్టార్ ఫ్రిజ్ పై భారీ డిస్కౌంట్

iPhone Ultra లుక్ లీక్.. ఈ కలర్స్ చూస్తేనే యాపిల్ ప్లాన్ ఏంటో అర్థమైపోతుంది!

మైక్రోవేవ్ ఓవెన్లలపై భారీ డిస్కౌంట్లు..ఆఫర్ పోతే రాదు వెంటనే కొనేయండి

రూ.20 వేలలోపు బెస్ట్ కెమెరా, బ్యాటరీ ఫోన్ కావాలా? Amazon Freedom Saleలో బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

టెలికాం గేమ్‌ ఛేంజర్స్.. అసలు Local, STD, PCO అంటే ఏంటి? 1990’s జ్ఞాపకాలు!

హోటళ్లు-పబ్లిక్ ప్రాంతాల్లో వైఫై వినియోగం.. సైబర్‌ దాడులపై మైక్రోసాఫ్ట్ వార్నింగ్, తస్మాత్ జాగ్రత్త అంటూ..

Big Stories

Advertisement
×