E-Paper
Advertisement

రూ.20 వేలలోపు బెస్ట్ కెమెరా, బ్యాటరీ ఫోన్ కావాలా? Amazon Freedom Saleలో బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

రూ.20 వేలలోపు బెస్ట్ కెమెరా, బ్యాటరీ ఫోన్ కావాలా? Amazon Freedom Saleలో బెస్ట్ ఆప్షన్స్ ఇవే!
Advertisement

Amazon Freedom Sale 2026: ఎక్కువ డబ్బులు పెట్టొద్దు.. అలా అని ఫోన్ పనితీరులో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు. ప్రస్తుతం మనలో చాలామంది కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు ఆలోచించే మెయిన్ పాయింట్ ఇదే. ఎందుకంటే.. రూ.20,000 బడ్జెట్ అంటే సామాన్యుడికి భారమే. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026’ గ్రాండ్‌గా మొదలైపోయింది. ఇప్పుడీ సేల్‌లో ఏ ఫోన్ ఎంత ధరకు అందుబాటులో ఉంది? ఏ మోడల్‌లో ఏ స్పెషల్ ఫీచర్ ఉందో తెలుసుకుందాం రండి..

Samsung Galaxy M17 5G

శాంసంగ్ నుంచి తక్కువ ధరలో మంచి ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని ప్రారంభ ధర రూ.16,999గా ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు షేక్ కాకుండా ఫొటోలు తీసేందుకు ఓఐఎస్ సపోర్ట్ ఇచ్చారు. ఫోన్ కిందపడినా పగలకుండా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ ఉంది. ఆరేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ చెప్పడం దీని ప్రత్యేకత.

Samsung Galaxy M36 5G

Advertisement

కొంచెం ప్రీమియమ్ లుక్, మెరుగైన ఫీచర్లు కోరుకునే వారు దీన్ని పరిశీలించవచ్చు. సేల్‌లో దీని ధర రూ.19,999గా ఉంది. చాలా స్లిమ్‌గా ఉండే ఈ ఫోన్‌లో గూగుల్ జెమిని ఏఐ ఫీచర్లు, నైట్ టైమ్‌లో కూడా అద్భుతమైన ఫొటోలు తీసే కెమెరా సిస్టమ్ ఉన్నాయి. రోజూవారీ వాడకానికి, గేమింగ్‌కు ఇది చాలా బాగుంటుంది.

Also Read: రూ.13,000 బడ్జెట్‌లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌కేక్‌లా అమ్ముడవుతున్న Moto G06 Power!

OnePlus N6x

Advertisement

వన్‌ప్లస్ లవర్స్ కోసం రూ.18,999 ధరలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీని ప్రధాన ఆకర్షణ 7000mAh భారీ బ్యాటరీ. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు హ్యాపీగా వాడేయవచ్చు. ఫోన్ వేడెక్కకుండా పెద్ద కూలింగ్ సిస్టమ్, సున్నితమైన స్క్రీనింగ్ కోసం 120Hz డిస్‌ప్లే ఇచ్చారు. బాడీ కూడా చాలా గట్టిగా, రఫ్‌గా వాడినా తట్టుకునేలా ఉంటుంది.

Realme Narzo 90x 5G

గేమింగ్, ఎక్కువసేపు ఫోన్ వాడే వారి కోసం రియల్‌మీ ఈ ఫోన్‌ను రూ.19,498కి తెచ్చింది. ఇందులో కూడా 7000mAh బ్యాటరీతో పాటు త్వరగా ఛార్జ్ అయ్యేలా 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 144Hz డిస్‌ప్లే వల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. పాటలు వినడానికి, వీడియోలు చూడటానికి దీని స్పీకర్లు మంచి సౌండ్ ఇస్తాయి.

Realme Narzo 100 Lite 5G

ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా, కొన్ని సంవత్సరాల పాటు స్మూత్‌గా నడవాలనుకుంటే ఇది మంచి ఎంపిక. దీని ప్రారంభ ధర రూ.17,499. ఇందులో 7000mAh టైటాన్ బ్యాటరీ, వేగవంతమైన ప్రొసెసర్, కళ్లకు శ్రమ తగ్గించే స్క్రీన్ డిజైన్ ఉన్నాయి. నాలుగు ఏళ్లపాటు ఫోన్ స్లో కాకుండా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

Also Read: 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సరికొత్త Moto G Max.. లాంచ్ ఎప్పుడంటే?

Tags

Related News

iPhone Ultra లుక్ లీక్.. ఈ కలర్స్ చూస్తేనే యాపిల్ ప్లాన్ ఏంటో అర్థమైపోతుంది!

మైక్రోవేవ్ ఓవెన్లలపై భారీ డిస్కౌంట్లు..ఆఫర్ పోతే రాదు వెంటనే కొనేయండి

టెలికాం గేమ్‌ ఛేంజర్స్.. అసలు Local, STD, PCO అంటే ఏంటి? 1990’s జ్ఞాపకాలు!

హోటళ్లు-పబ్లిక్ ప్రాంతాల్లో వైఫై వినియోగం.. సైబర్‌ దాడులపై మైక్రోసాఫ్ట్ వార్నింగ్, తస్మాత్ జాగ్రత్త అంటూ..

వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా రూ.249, రూ.250 ప్లాన్స్ లాంచ్.. నిజంగా అదిరిపోయాయ్!

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. రేట్లు ఇలా తగ్గించేశారేంటీ!

రూ.13,000 బడ్జెట్‌లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌కేక్‌లా అమ్ముడవుతున్న Moto G06 Power!

Big Stories

Advertisement
×