E-Paper
Advertisement

ఫ్రిడ్జ్ షెల్ఫ్‌లపై ఫాయిల్ పేపర్ వేసి చూడండి.. దుర్వాసన, జిడ్డు మరకల బాధే ఉండదు!

ఫ్రిడ్జ్ షెల్ఫ్‌లపై ఫాయిల్ పేపర్ వేసి చూడండి.. దుర్వాసన, జిడ్డు మరకల బాధే ఉండదు!
Advertisement

Refrigerator Cleaning Tips: ఇంట్లో మిగతా పనులన్నీ ఒకెత్తయితే.. ఫ్రిడ్జ్ శుభ్రం చేయడం మరో ఎత్తు. రోజూ వాడే పదార్థాలు, మిగిలిపోయిన కూరలు, పాలు, సాస్‌లు.. ఇలా ఏదో ఒకటి ఫ్రిడ్జ్‌లో దొర్లడం, ఆ మచ్చలు ఎండిపోయి అంటుకుపోవడం చూస్తూనే ఉంటాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని రోజులకే గ్లాస్ షెల్ఫ్‌లన్నీ జిడ్డుగా మారిపోతాయి. వాటిని రుద్ది రుద్ది కడగడం చాలా విసుగు తెప్పిస్తుంది. పైగా ఎంత గీకినా ఆ మూలల్లో ఉండే మురికి త్వరగా వదలదు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక క్రేజీ చిట్కా తెగ వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

జిడ్డు మరకలే అతిపెద్ద సమస్య..

ఫ్రిడ్జ్‌లో ఒలికిన ద్రవాలు లేదా ఆహార పదార్థాల అవశేషాలు అలాగే ఉండిపోవడం వల్లే అసలు సమస్య మొదలవుతుంది. ఇవి గ్లాస్ షెల్ఫ్‌లపై పొరల్లోకి, ప్లాస్టిక్ సందుల్లోకి చేరి గట్టిపడతాయి. అలా వదిలేస్తే కాలక్రమేణా అక్కడ బ్యాక్టీరియా చేరి కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. దీంతో ఫ్రిడ్జ్ తెరవగానే ఒక రకమైన చెడు వాసన వస్తుంటుంది. ప్రతిసారీ కడగటం కన్నా, అసలు మురికి షెల్ఫ్‌లకు అంటుకోకుండా చూసుకోవడమే సరైన పరిష్కారం.

ఈ ఫాయిల్ ఎలా పనిచేస్తుందంటే?

Advertisement

దీనికి ఒకే ఒక సింపుల్ అండ్ బెస్ట్ సొల్యూషన్.. అల్యూమినియం ఫాయిల్ పేపర్. మనం ఆహారాన్ని ప్యాక్ చేయడానికి వాడే ఫాయిల్ పేపర్‌ను ఫ్రిడ్జ్ షెల్ఫ్‌లపై పరచడం వల్ల ఎక్కువ సమయం ఆదా అవుతుంది. ఎలాంటి ద్రవాలు ఒలికినా అవి నేరుగా షెల్ఫ్‌పై పడకుండా ఈ ఫాయిల్ పేపర్ అడ్డుకుంటుంది. ఏదైనా మరక పడితే మొత్తం ఫ్రిడ్జ్ కడగాల్సిన పనిలేకుండా, కేవలం ఆ ఫాయిల్ పేపర్‌ను తీసి పక్కన పడేసి కొత్తది వేసుకుంటే సరిపోతుంది. ఇది సమయాన్ని, శ్రమను ఎంతగానో ఆదా చేస్తుంది.

Also Read: హైయర్ 5-స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ సగం ధరకేనా? Amazon Saleలో మతిపోయే ఆఫర్!

దుర్వాసన రాకూడదంటే..

Advertisement

సాధారణంగా ఫ్రిడ్జ్ మూలల్లో పేరుకుపోయే మురికే దుర్వాసనకు ప్రధాన కారణం. అందుకే ఫాయిల్ పేపర్ వాడటం వల్ల మురికి మూలల్లోకి వెళ్లకుండా ఆగిపోతుంది. దీంతో చెడు వాసన సమస్య చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు.. తీవ్రమైన వాసన వచ్చే చేపలు, నాన్‌వెజ్ లేదా పాత చీజ్ వంటి పదార్థాలను కూడా అల్యూమినియం ఫాయిల్‌లో బాగా కప్పి ఉంచితే.. ఆ వాసన ఫ్రిడ్జ్‌‌లోని ఇతర పదార్థాలకు వ్యాపించకుండా ఉంటుంది.

ఫాయిల్‌ను సరిగ్గా అమర్చడమెలా?

ఈ హ్యాక్ సరిగ్గా పనిచేయాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ముందుగా ఫ్రిడ్జ్‌ను శుభ్రంగా తుడిచి, తడి లేకుండా ఆరనివ్వాలి. ఆ తర్వాత షెల్ఫ్ కొలతలకు సరిపడా అల్యూమినియం ఫాయిల్‌ను కట్ చేసుకుని, గాలి బుడగలు లేకుండా సమానంగా పరచాలి. అయితే ఫ్రిడ్జ్‌లో గాలి వెళ్లే రంధ్రాలు (ఎయిర్ వెంట్లు) మూసుకుపోకుండా జాగ్రత్త పడాలి. గాలి ప్రసరణ సరిగ్గా లేకపోతే కూలింగ్ తగ్గే అవకాశం ఉంది. అలాగే ఫాయిల్ పాతబడినప్పుడు లేదా మురికిగా మారినప్పుడు దానిని వెంటనే మార్చేయాలి.

ఈ జాగ్రత్తలు కూడా తప్పనిసరి..

అల్యూమినియం ఫాయిల్ అనేది ఫ్రిడ్జ్ శుభ్రతను సులభం చేయడానికి ఒక తాత్కాలిక రక్షణ మాత్రమే. దీవలొ క్లీనింగ్ పని తగ్గుతుంది కానీ, అసలు శుభ్రం చేయాల్సిన అవసరమే ఉండదని అనుకోకూడదు. కొన్నిసార్లు ఫాయిల్ అంచుల గుండా ద్రవాలు కిందకు కారే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ఎప్పటికప్పుడు తడిగుడ్డతో తుడవడమే కాకుండా, సమయం ఉన్నప్పుడు మైల్డ్ సోప్‌తో షెల్ఫ్‌లను శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.

Also Read: మీ ఇంటి గోడలే నెట్‌వర్క్ అందిస్తే? జియో Smart Wallతో వైఫై డెడ్ జోన్లకు చెక్!

Tags

Related News

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!

జస్ట్ రూ.2,000కే 4G ఫోన్లా? UPI, టైప్-సి ఛార్జింగ్‌తో లభించే టాప్ 5 ఆప్షన్లు ఇవే!

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి ? కరెంట్ ఆదా చేసే టిప్స్!

ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? అయితే ఈ 5 సీక్రెట్ ట్రిక్స్ మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి!

హైయర్ 5-స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ సగం ధరకేనా? Amazon Saleలో మతిపోయే ఆఫర్!

మీ ఇంటి గోడలే నెట్‌వర్క్ అందిస్తే? జియో Smart Wallతో వైఫై డెడ్ జోన్లకు చెక్!

Big Stories

Advertisement
×