E-Paper
Advertisement

జియో దుమ్మురేపే ఆఫర్.. రూ.299కే 4G స్మార్ట్ ఫోన్.. 6 నెలల పాటు ఫ్రీ కాల్స్, డేటా!

జియో దుమ్మురేపే ఆఫర్.. రూ.299కే 4G స్మార్ట్ ఫోన్.. 6 నెలల పాటు ఫ్రీ కాల్స్, డేటా!
Advertisement

Jio 4G Phone Offer: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒక ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికీ 2జీ నెట్‌వర్క్‌లోనే ఉండిపోయిన కోట్ల మంది ప్రజలను 4జీ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా జియోభారత్ (JioBharat) ఫోన్లపై ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది. రూ.1,499కే జియో భారత్ ఫోన్ ను అందించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా 6 నెలల పాటు ఉచితంగా కాల్స్, డేటా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు పేర్కొంది. తక్కువ ఖర్చుతోనే హెచ్‌డీ కాల్స్, వినోదం, డిజిటల్ చెల్లింపుల సేవలను పొందాలనుకునే పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు దీనిని గోల్డెన్ ఛాన్స్ గా అభివర్ణించింది.

రూ.299కే స్మార్ట్ ఫోన్ ఎలా..?

ఈ ప్రత్యేక ఆఫర్ కింద జియోభారత్ 4జీ ఫోన్‌ను రూ. 1,499లకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ధరలోనే 6 నెలల ఉచిత రీఛార్జ్ ప్రయోజనాలను జియో అందిస్తోంది. సాధారణంగా 2జీ ఫోన్ ఉపయోగించే ఒక వినియోగదారుడు ప్రతినెలా రీఛార్జ్ కోసం రూ. 199 చొప్పున, ఆరు నెలలకు సుమారు రూ. 1,200 వరకు ఖర్చు చేస్తారు. ఆ లెక్కన చూస్తే రూ. 1,499 మొత్తంలో రీఛార్జ్ ఖర్చు తీసివేస్తే జియోభారత్ 4జీ హ్యాండ్‌సెట్ అసలు ధర కేవలం రూ. 299 మాత్రమే పడుతుందని కంపెనీ స్పష్టం చేసింది. 2జీ నుంచి 4జీకి మారాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశమని పేర్కొంది.

Advertisement

అపరిమిత కాల్స్.. నెలకు 14GB డేటా

ఈ వార్షికోత్సవ ప్యాకేజీతో వచ్చే ఆరు నెలల ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతి నెలా 14 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఫ్రీగా కాల్స్ చేసుకునేందుకు హెచ్‌డీ వాయిస్ కాలింగ్ సదుపాయం అందిస్తోంది. అయితే ఆఫర్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలు, షరతులు సైతం ఉన్నట్లు జియో పేర్కొంది. ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

ఫోన్‌లోనే ఎంటర్టైన్‌మెంట్!

Advertisement

జియోభారత్ ఫోన్లు కేవలం కాల్స్ కే పరిమితం కాకుండా ఎంటర్టైన్‌మెంట్ డివైజ్‌గానూ పనిచేయనున్నాయి. ఇందులో జియో టీవీ (JioTV) ద్వారా 500 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెళ్లను చూడవచ్చు. దీనికి తోడు జియో హాట్‌స్టార్ (JioHotstar) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా రావడం వల్ల క్రికెట్ మ్యాచ్‌లు, సినిమాలు, ప్రత్యేక షోలను వీక్షించే అవకాశం యూజర్లకు లభిస్తుంది.

యూపీఐ పేమెంట్స్ సౌకర్యం

ఈ ఫోన్లలో ‘జియోపే’ (JioPay) ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా పేమెంట్స్ జరిగినప్పుడు వ్యాపారులకు తెలిసేలా శబ్దం ఇచ్చే ‘సౌండ్ బాక్స్’ (Sound Box) ఫీచర్ కూడా ఇందులో ఉంది. మరోవైపు కుటుంబ సభ్యుల భద్రత కోసం ‘జియో సేఫ్టీ షీల్డ్’ ద్వారా సేఫ్ కాలింగ్, ఒకరి స్థానాన్ని మరొకరు తెలుసుకునే లొకేషన్ మానిటరింగ్ టూల్స్ వంటి ఆధునిక ఫీచర్లను జియో అందిస్తోంది.

Also Read: USB 2.0 vs USB 3.0.. రెండింటి మధ్య తేడాలేంటి? మీ అవసరాలకు ఏది బెటర్?

ఆ మోడళ్లపైనే ఆఫర్?

ఈ 10వ వార్షికోత్సవ ఆఫర్ ఏ ఏ జియోభారత్ మోడళ్లకు వర్తిస్తుందో కంపెనీ ఇంకా అధికారికంగా తెలుపలేదు. అయినప్పటికీ జియో వెల్లడించిన 2.4 అంగుళాల డిస్‌ప్లే, 2,000mAh బ్యాటరీ, 4జీ కనెక్టివిటీ వంటి స్పెసిఫికేషన్లను బట్టి ఇది ‘జియోభారత్ బి1’ (JioBharat B1) లేదా ‘జియోభారత్ బి2’ (JioBharat B2) మోడళ్లకు వర్తించే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. మెుత్తం మీద 2జీ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫీచర్ ఫోన్లకు మారాలనుకునే వారికి ఈ జియోభారత్ ఆఫర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.

Also Read: జియో రూ.499 ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో ఫ్యామిలీ మెుత్తానికి.. అపరిమిత 5G డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీలు!

Tags

Related News

ఎయిర్ ప్యూరిఫైయర్‌లో ‘హెపా ఫిల్టర్’ లేకపోతే.. ఎంత డబ్బు పెట్టి కొన్నా వేస్టే!

మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ నిజమేనా? కేంద్రం క్లారిటీ, సుప్రీంకోర్టు కీలక సూచనలు!

USB 2.0 vs USB 3.0.. రెండింటి మధ్య తేడాలేంటి? మీ అవసరాలకు ఏది బెటర్?

ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో లైవ్ టీవీ ఛానల్స్.. ఇదెలా సాధ్యం అంటే?

కొత్త ఫోన్ కొనే ముందు..ఈ విషయాలు తెలియకపోతే డబ్బులు వేస్ట్!

జియో రూ.499 ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో ఫ్యామిలీ మెుత్తానికి.. అపరిమిత 5G డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీలు!

46dB నాయిస్ క్యాన్సిలేషన్, గ్లాస్ & టైటానియం లుక్స్.. Nothing Headphone 1 Pro ఫీచర్లు ఇవే!

Big Stories

Advertisement
×