E-Paper
Advertisement

సత్తుపల్లి టూ ఖమ్మం ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు!

సత్తుపల్లి టూ ఖమ్మం ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు!
Advertisement

Bus Services: స్వేచ్చ బ్యూరో: సత్తుపల్లి నుంచి ఖమ్మం ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం డీలక్స్‌ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్‌ చార్జీతో ప్రయాణించే అవకాశం కల్పించినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం నుంచి సత్తుపల్లి–ఖమ్మం రూట్‌లో తిరిగే డీలక్స్‌ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్‌ చార్జీ చెల్లించి ప్రయాణించవచ్చని ఒక ప్రకటనలో వెల్లడించారు. సత్తుపల్లి నుంచి ఖమ్మంకు ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక బస్సు తిరిగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

10 డీలక్స్‌ బస్సులు..

సత్తుపల్లి–ఖమ్మం రూట్‌లో మొత్తం 99 ట్రిప్పులు నడుస్తున్నాయని, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు డీలక్స్‌ బస్సుల్లో సత్తుపల్లి–ఖమ్మం చార్జీ రూ.130గా ఉండగా, బుధవారం నుంచి రూ.120గా నిర్ణయించినట్లు వివరించారు. ఈ రూట్‌లో మొత్తం 10 డీలక్స్‌ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా సత్తుపల్లి–విజయవాడ రూట్‌లో ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సత్తుపల్లి–అశ్వారావుపేట రూట్‌లో ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు అదనంగా ఆరు ట్రిప్పులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, ప్రయాణికుల సౌకర్యార్థం సత్తుపల్లి–అంకంపాలెం రూట్‌లో సాయంత్రం 6 గంటలకు అదనంగా ఒక ట్రిప్పు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.

Advertisement

Also read: కొత్త ఫోన్ కొనే ముందు..ఈ విషయాలు తెలియకపోతే డబ్బులు వేస్ట్!

నూతనంగా ఒక బస్సు సర్వీసు..

సత్తుపల్లి నుంచి ఏలూరుకు రెండు అదనపు సర్వీసులు నడుపుతున్నట్లు వివరించారు. అలాగే సత్తుపల్లి–అంకంపాలెం–ములకలపల్లి–పొగళ్లపల్లి–బూర్గంపాడు మీదుగా భద్రాచలానికి నూతనంగా ఒక పల్లె వెలుగు బస్సు సర్వీసు ప్రారంభించినట్లు తెలిపారు. సత్తుపల్లి నుంచి లంకపల్లి, నీలాద్రి మీదుగా కొత్తగూడెంకు నూతన సర్వీసును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు రూట్లలో అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంటూ, ప్రయాణికులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణతో పాటు అసిస్టెంట్ మేనేజర్ జి. రజిత పాల్గొన్నారు.

Advertisement

Also read: జియో రూ.499 ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో ఫ్యామిలీ మెుత్తానికి.. అపరిమిత 5G డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీలు!

Tags

Related News

సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి జోరుగా పాదయాత్ర!

మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం దందా.. మిల్లు యజమానిపై కేసు నమోదు!

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్!

నేను, బండి సంజయ్ కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్లమే: సీఎం రేవంత్!

తెలంగాణలో అమిత్ షా పర్యటనకు డేట్ ఫిక్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు.. వర్క్ ఫర్ విలేజ్ కోసం పనిచేయండి: మంత్రి సీతక్క!

రేవంత్‌రెడ్డి లాంటి సీఎం ఉండడం మన ఖర్మ: తలసాని శ్రీనివాస్ యాదవ్

Big Stories

Advertisement
×