E-Paper
Advertisement

11 ఏళ్లుగా చక్రాల కుర్చీలోనే చిన్నారి.. సాయం కోసం ఎదురుచూస్తున్న కన్నపేగు!

11 ఏళ్లుగా చక్రాల కుర్చీలోనే చిన్నారి.. సాయం కోసం ఎదురుచూస్తున్న కన్నపేగు!
Advertisement

Narayanpet Family: నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్ గ్రామానికి చెందిన అజయ్–సరిత దంపతులు ప్రస్తుతం మక్తల్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే విధి ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. కుమారుడు పుట్టినప్పటి నుంచే నాడీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు.

11 ఏళ్లుగా చక్రాల కుర్చీలోనే..

Advertisement

కొడుకు ఆరోగ్యం కోసం ఆ తల్లిదండ్రులు తిరగని ఆసుపత్రి లేదు, కలవని డాక్టర్ లేడు. చికిత్స కోసం ఉన్నదంతా అమ్మి లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గత 11 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన కుమారుడి బాగోగులు చూసుకోవడమే ఆ కన్నతల్లి సరిత జీవితంగా మారిపోయింది. తోటి పిల్లల్లా ఆడుకోవాలని ఆశ ఉన్నా… కాళ్లు, చేతులు అసలే సహకరించవు.

Also Read: ఘన్‌పూర్ లెదర్ పార్క్.. హామీలకే పరిమితమా?

Advertisement

ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం..

ఒకవైపు కొడుకు పరిస్థితి ఇలా ఉంటే… మరోవైపు కుటుంబ పెద్ద అజయ్‌కు కూడా 30 శాతం అంగవైకల్యం ఉంది. అయినా సరే, కుటుంబాన్ని పోషించేందుకు ఆయన మక్తల్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నారు. రోజంతా కష్టపడితే వచ్చేది 300 మాత్రమే. ఆ ఆదాయంతోనే ఇంటి ఖర్చులు, కూతురి చదువు, కొడుకు మందుల ఖర్చులు భరించలేక ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. 11 ఏళ్లుగా కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ తల్లి ఇప్పుడు సమాజం వైపు ఆశగా చూస్తోంది. దాతలు స్పందిస్తే ఓ కుటుంబ తలరాత మారుతుంది.

Tags

Related News

ఘన్‌పూర్ లెదర్ పార్క్.. హామీలకే పరిమితమా?

నాగార్జున సాగర్ గడ్డపై వరుణయాగం.. పూర్ణాహుతిలో పాల్గొన్న రేవంత్, ఉత్తమ్ దంపతులు!

నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి!

నా ప్రాణాలు కాపాడిన నాయకుడు ఇకలేరు..పెద్ది సంతాప సభలో హరీష్ రావు కన్నీళ్లు

మంత్రి పొంగులేటి స్పీచ్.. అడ్డుకున్న పాడి కౌశిక్ రెడ్డి

రెండేళ్లలో కేసీఆరే సీఎం.. నర్సంపేట కాలేజీకి పెద్ది పేరే: కేటీఆర్

మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి.. గొంతుపై తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×