E-Paper
Advertisement

ట్రెండ్‌ను మార్చేలా సోనీ కొత్త బ్రావియా టీవీలు లాంచ్.. జెమిని ఏఐ సపోర్ట్‌తో వావ్ అనిపించేలా ఫీచర్లు!

ట్రెండ్‌ను మార్చేలా సోనీ కొత్త బ్రావియా టీవీలు లాంచ్.. జెమిని ఏఐ సపోర్ట్‌తో వావ్ అనిపించేలా ఫీచర్లు!
Advertisement

Sony AI Smart TVs: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ సరికొత్త సాంకేతికతతో కూడిన ‘బ్రావియా 9II’, ‘బ్రావియా 7II’ True RGB స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త ఏఐ ప్రాసెసర్, అద్భుతమైన కలర్ అక్యూరసీ, అదిరిపోయే ఆడియో అనుభూతిని అందించేలా ఈ టీవీలను సోనీ రూపొందించింది. జూన్ 29 నుంచే ఇవి కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చాయి.

అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ:

ఈ కొత్త టీవీలలో సోనీ తమ సరికొత్త ‘ఆర్‌జీబీ బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ ప్రో’ టెక్నాలజీని ఉపయోగించింది. సాధారణ టీవీలలా కాకుండా ఇందులో రెడ్, గ్రీన్, బ్లూ కలర్ ఎల్‌ఈడీలను విడివిడిగా నియంత్రించడం వల్ల రంగులు చాలా సహజంగా, రిచ్‌గా కనిపిస్తాయి. దీనికి తోడు ‘అడ్వాన్స్‌డ్ ఏఐ కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్ఆర్’ సాంకేతికత ప్రతి సీన్‌ను రియల్ టైమ్‌లో విశ్లేషించి బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్‌లను అద్భుతంగా సర్దుబాటు చేస్తుంది. గదిలోకి ఎంత ఎండ వచ్చినా స్క్రీన్ స్పష్టంగా కనిపించడం దీని ప్రత్యేకత.

థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్:

Advertisement

ఈ టీవీల్లో ఆడియోకు సోనీ అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ‘అకౌస్టిక్ మల్టీ-ఆడియో+’ ఫీచర్ ద్వారా కేవలం టీవీ ముందు భాగం నుంచే కాకుండా.. గదిలో నలుమూలల నుంచి శబ్దం వస్తున్నట్లుగా భ్రమ కలుగుతుంది. డాల్బీ అట్మోస్, డీటీఎస్ ఎక్స్, ఐమాక్స్ ఎన్‌హ్యాన్స్‌డ్ వంటి ఫీచర్లు ఉండటం వల్ల ఇంట్లోనే థియేటర్ స్థాయి అనుభూతిని పొందొచ్చు. అలాగే ‘ఇమ్మర్సివ్ బ్లాక్ స్క్రీన్ ప్రో’ ఫీచర్ వల్ల చీకటి సీన్లలో కూడా విజువల్స్ చాలా క్లియర్‌గా కనిపిస్తాయి.

Also Read: టెక్ ప్రపంచంలో సంచలనం.. 10 ఇంచుల భారీ డిస్‌ప్లేతో Rollable Phone తెస్తున్న శాంసంగ్!

స్మార్ట్ ఫీచర్లు, గూగుల్ టీవీ సపోర్ట్:

Advertisement

ఈ బ్రావియా లైనప్ గూగుల్ టీవీ ఓఎస్‌పై రన్ అవుతుంది. దీంతో మీకు నచ్చిన సినిమాలు, షోలు అన్నీ ఒకే చోట లభిస్తాయి. త్వరలోనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ‘జెమిని’ ఏఐ సపోర్ట్‌ను కూడా అందించనున్నారు. దీనివల్ల వాయిస్ కంట్రోల్స్ మరింత స్మార్ట్‌గా మారనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్ కోర్ వంటి యాప్స్ కోసం ప్రత్యేక కాలిబ్రేషన్ మోడ్స్ దీనిలో ఉన్నాయి. టైప్-సి పోర్ట్, బ్యాక్‌లిట్ బటన్స్, ఫైండ్ మై రిమోట్ వంటి సదుపాయాలున్న రీఛార్జబుల్ రిమోట్‌ను దీనితో పాటు ఇస్తున్నారు.

ధరలు, సైజుల వివరాలు:

సోనీ బ్రావియా 9II సిరీస్‌లో 75 ఇంచుల మోడల్ బెస్ట్ బై ధర రూ.5,39,990 కాగా, 85 ఇంచుల మోడల్ ధర రూ.6,69,990గా ఉంది. అలాగే బ్రావియా 7II సిరీస్‌లో 55 ఇంచుల ధర రూ.2,21,990 నుంచి ప్రారంభమై, 85 ఇంచుల మోడల్ ధర రూ.5,29,990 వరకు ఉంది. ఈ ప్రీమియం టీవీలను దేశవ్యాప్తంగా ఉన్న సోనీ సెంటర్లు, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ స్టోర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Also Read: వారెవ్వా.. సింగిల్ ఛార్జ్‌తో 50 గంటలు నడిచే ఇయర్‌బడ్స్ తెచ్చిన వివో, ధర ఎంతంటే?

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×