IND vs AUS 4th Test Day 2: టీమ్ ఇండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Autralia) మధ్య నాలుగో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయింది. భారీ స్కోర్ చేసి కంగారులో ఆల్ అవుట్ అయ్యారు. ఏకంగా 474 పరుగులు చేసి… చాప చుట్టింది ఆస్ట్రేలియా టీం. నిన్న మ్యాచ్ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు.. టీమిండియా బౌలర్ల పై ఆధిపత్యం చెలాయించింది ఆస్ట్రేలియా. ఈ తరుణంలోనే ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయడం జరిగింది.
Also Read: Sanju Samson: IPL 2025 కంటే ముందే సంజూ భారీ త్యాగం..షాక్ లో రాజస్థాన్ !
దాదాపు 122 ఓవర్లు వాడిన ఆస్ట్రేలియా… 474 పరుగులు చేసింది. ఇక ఇందులో ఆస్ట్రేలియా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఆస్ట్రేలియా కొత్త ఓపెనర్ సామ్ కాన్సాస్ 65 బంతుల్లోనే 60 పరుగులు చేసి దుమ్ము లేపాడు. టి20 మ్యాచ్ ఆడినట్లు ఆడాడు సామ్. ఇక అతనితోపాటు ఓపెనింగ్ కు దిగిన కవాజా 57 పరుగులు చేశాడు. 121 బంతులు ఆడి… ఇండియా బౌలర్లను ఇబ్బంది పెట్టాడు.. ఇక లబుషేన్ కూడా 145 బంతుల్లో 72 పరుగులు చేసి… ఆస్ట్రేలియాను ఆదుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్ కుదిగిన మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఏకంగా 140 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఆ తర్వాత వచ్చిన హెడ్ డక్ అవుట్ అయ్యాడు. గత మూడు మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన హెడ్ ను జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah )
బోల్తా కొట్టించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏకంగా 49 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు మంచి స్కోర్ అందించాడు. ఇలా అందరూ రాణించడంతో 122.4 ఓవర్లలో 474 పరుగులు చేసి పది వికెట్లు నష్టపోయింది ఆస్ట్రేలియా.
Also Read: Khalistan Supporters: బాక్సింగ్ డే టెస్టులో కలకలం.. మ్యాచ్ అడ్డుకునేందుకు ఖలిస్థానీల కుట్రలు?
ఇక టీమ్ ఇండియా బౌలర్ల విషయానికి వస్తే… ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah ) అద్భుతంగా మరోసారి రాణించాడు. ఆయన బౌలింగ్ లో ఏ విధంగా నాలుగు వికెట్లు పడ్డాయి. అలాగే ఆకాష్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు. అయితే మహమ్మద్ సిరాజ్ తో పాటు…. నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ కూడా తీయలేకపోయారు.
ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ అయితే… దారుణంగానే విఫలం అయ్యాడని చెప్పవచ్చును. ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది టీమిండియా… ఆది నుంచే వికెట్లు కోల్పోవడం ప్రారంభించింది. మొన్నటి వరకు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇవాళ… ఓపెనర్ గా వచ్చాడు. ఇక ఓపెనర్ గా మరోసారి కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమయ్యాడు. 3 పరుగులే చేసి..కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో ప్రస్తుతం 23 పరుగులు చేసిన టీమిండియా వికెట్ నష్టపోయింది.