E-Paper
Advertisement

ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు
Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan:  పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England) మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మొన్న ఆగస్టు 19వ తేదీన ప్రారంభమైన తొలి టెస్ట్ ఫలితం రెండున్నర రోజుల్లోనే తేలిపోయింది.. పాకిస్తాన్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో… ఈ టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 103 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. మొదటి, రెండో ఇన్నింగ్స్ లలో పాకిస్తాన్ బ్యాటర్లు ఎవరు కూడా సరిగ్గా ఆడలేదు. దీంతో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ త్వరగా ఆలౌట్ కావడానికి కారణం మ‌హ్మ‌ద్ రిజ్వాన్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. టెయిలెండర్స్ ను డీల్ చేస్తూ, స‌రిగ్గా స్ట్రైకింగ్ తీసుకోలేక‌ పాకిస్తాన్ తొందరగా ఆలౌట్ అయిందని, దానికి రిజ్వాన్ (Mohammad Rizwan) కార‌ణమంటూ ట్రోల్స్ వ‌స్తున్నాయి.

సింగిల్స్ తీసి ఇవ్వ‌డానికి సిగ్గులేదా ? పాకిస్తాన్ ను ముంచేసింది రిజ్వానే

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ ముగిసిన నేపథ్యంలో మహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ విధానంపై నాజర్ హుస్సేన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 46 టెస్టులు ఆడిన అనుభవం మహమ్మద్ రిజ్వాన్ కు ఉన్నప్పటికీ… తెలివిగా బ్యాటింగ్ చేయలేదని ఫైర్ అయ్యారు. తొమ్మిదో నెంబర్ లో బ్యాటింగ్ చేసిన టెయిలెండర్ కు స్ట్రైకింగ్ ఇవ్వకుండా…వ్యవహరించాల్సిన మహమ్మద్ రిజ్వాన్… తొలి బంతికే సింగిల్ తీసి పాకిస్తాన్ ఓటమికి కారణమయ్యాడని మండిపడ్డారు. బ్యాటింగ్ బాధ్య‌త‌ల‌ను టెయిలెండర్స్ కు అప్ప‌గించి, మహమ్మద్ రిజ్వాన్ చేతులు దులుపుకున్నాడ‌ని సీరియ‌స్ అయ్యారు.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

అసలు మహమ్మద్ రిజ్వాన్ పై ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు

ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టు సందర్భంగా సెకండ్ ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 135 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అయితే ఈ రెండో ఇన్నింగ్స్ లో మహమ్మద్ రిజ్వాన్ ఒక్కడే 39 బంతుల్లో 41 పరుగులు సాధించాడు. మిగిలిన ప్లేయర్లు అందరూ త్వరగా నే అవుట్ అయ్యారు. అయితే ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన మహమ్మద్ రిజ్వాన్, టెయిలెండర్స్ ను సరిగ్గా డీల్ చేయలేకపోయాడు. వికెట్లు పడుతున్న క్రమంలో ఎవరైనా టెయిలెండర్స్ కు స్ట్రైకింగ్ ఇవ్వకుండా… చివరి బంతికి సింగిల్ తీసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ కు వచ్చి… పరుగులు తీస్తారు. ప్రతి ఒక్క బ్యాటర్ ఇలాగే టెయిలెండర్స్ వికెట్స్ కాపాడుకుంటూ ఇన్నింగ్స్ ముందుకు తీసుకువెళ్తారు.

Advertisement

కానీ ఈ ఇన్నింగ్స్ లో రిజ్వాన్ అలా చేయలేదు. చివరి బంతికి సింగిల్ తీసుకోలేదు. అదే సమయంలో ఓవర్ తొలి బంతికే సింగిల్ తీసి టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్పగించి వికెట్స్ త్వరగా పడేలా తెలివి తక్కువ పని చేశాడు. 9వ వికెట్ కు వచ్చిన ఖుర్రమ్ షాజాద్ ( Khurram Shahzad ) విషయంలో ఇదే జరిగింది. ఓవర్ లో మొదటి బంతికే సింగిల్ తీసి.. రాబిన్ సన్ బౌలింగును ఖుర్రమ్ షాజాద్ ఎదుర్కునేలా రిజ్వాన్ చేశాడు. దీంతో ఖుర్రమ్ షాజాద్ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. అలా వరుసగా వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో పాకిస్తాన్ ఓడిపోయింది. అందుకే నాజర్ హుస్సేన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టేలెండర్లను సరిగా డీలింగ్ చేయలేక మహమ్మద్ రిజ్వాన్ విఫలమయ్యాడని మండిపడ్డారు. సీనియారిటీని మర్చిపోయి దద్దమ్మ లాగా వ్యవహరించాలని ఫైర్ అయ్యారు.

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

 

 

 

Related News

ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఘోర ఓట‌మి…చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు అంటూ త‌న్వీర్ సీరియ‌స్‌

పాకిస్తాన్ జ‌ట్టును చూస్తే అస‌హ్యం వేస్తోంది..మీ కంటే, ఉగాండా బెట‌ర్‌

కోహ్లీ కంటే గొప్పోడ‌నే బాబ‌ర్ ఆజంపై బుర‌ద జ‌ల్లుతున్నారు..DKపై త‌న్వీర్ ఫైర్‌

నాకు కెప్టెన్సీ ఇవ్వండి..లేకపోతే వేలంలో వదిలేయండి.. CSKకు సంజు వార్నింగ్ ?

40 కోట్ల టాకాల న‌ష్టం…బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ర‌ద్దు

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై పాకిస్తాన్ ను దెబ్బ‌కొట్టిన కోహ్లీ…RCB ప్లేయ‌ర్ వాడుకుని మ‌రీ

పాకిస్తాన్ ఓ బికారి దేశం…లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించిన ఇంగ్లాండ్

Big Stories

Advertisement
×