E-Paper
Advertisement

BCCI Reward: టీమిండియాకు రూ.131 కోట్లు ప్ర‌క‌టించిన బీసీసీఐ..ఐసీసీ కంటే 5 రెట్లు ఎక్కువ‌

BCCI Reward: టీమిండియాకు రూ.131 కోట్లు ప్ర‌క‌టించిన బీసీసీఐ..ఐసీసీ కంటే 5 రెట్లు ఎక్కువ‌
Advertisement

BCCI Reward: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) గెలుచుకున్న టీమిండియాకు బంపర్ ఆఫర్ తగిలింది. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్ అయిన టీమిండియాకు భారీ నజరానా ( BCCI Reward ) ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. టీమిండియా కు ఏకంగా రూ.131 కోట్ల భారీ ప్రైజ్ మనీ ( Prize Money) ప్రకటించింది బీసీసీఐ ( BCCI). ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్, కోచింగ్ బృందానికి కూడా ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. వరుసగా రెండు సార్లు, మొత్తం మూడు సార్లు ట్రోఫీని అందించినందుకు టీమిండియా క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలిపింది బీసీసీఐ. ఇదే ఊపుతో ముందుకు కొనసాగాలని పేర్కొంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచినందుకు ఐసీసీ ద్వారా టీమిండియాకు కేవ‌లం రూ.27.48 కోట్లు ద‌క్కాయి. అంటే ఐసీసీ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ ఫ్రైజ్ మ‌నీ బీసీసీఐ అందించింది.

Also Read: IND VS NZ Final: అహ్మ‌దాబాద్ మ‌ట్టిని నుదిటన రాసుకున్న సూర్య కుమార్, రోహిత్ శర్మను మించి సెల‌బ్రేష‌న్స్‌

టీమిండియాకు క‌ళ్లు చెదిరే న‌జ‌రానా ప్ర‌క‌టించిన బీసీసీఐ

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. 2007, 2024 టోర్నమెంటులో విజేతగా నిలిచిన టీమిండియా… ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ సేన ఆధ్వర్యంలో మరో టైటిల్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు చెప్పింది బీసీసీఐ. అంతేకాకుండా 131 కోట్లు నజరానా ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇదే ఊపుతో ముందుకు వెళ్లాలని పేర్కొంది.

వరల్డ్ కప్ ఆడిన టీమిండియా ప్లేయర్లు మొత్తం 15 మంది. బిసిసిఐ ప్రకటించిన ఈ 131 కోట్లలో ఒక్కో ప్లేయర్ కు 6 కోట్ల చొప్పున వస్తాయి. 41 కోట్లు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మిగిలిన స్టాప్, సిబ్బందికి వెళ్తాయి. 2024 సమయంలో రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టి20 వరల్డ్ కప్ గెలిచింది టీం ఇండియా. అప్పుడు టీమ్ ఇండియాకు 125 కోట్లు ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇప్పుడు ఆరు కోట్లు అదనంగా ప్రకటించి, టీమిండియా కు శుభవార్త చెప్పింది బిసిసిఐ.

ఐసీసీ కంటే ఐదు రేట్లు ఎక్కువగానే నజరానా

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీం ఇండియా గెలిచిన నేపథ్యంలో ఐసిసి మూడు మిలియన్ డాలర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే 27.48 కోట్లు టీమిండియా కు ఐసీసీ నుంచి దక్కాయి. అయితే తాజాగా ఐసీసీ కంటే ఐదు రేట్లు ఎక్కువగానే బీసీసీఐ 131 కోట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇది ఇలా ఉండగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగింది. ఈ సందర్భంగా వార్ వన్ సైడ్ అన్నట్లుగానే ఈ మ్యాచ్ కొనసాగింది. న్యూజిలాండ్ పై 96 పరుగులు తేడాతో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ఛాంపియన్ అయింది ఇండియా.

 

Also Read: IND VS NZ Final: ముచ్చ‌ట‌గా మూడోసారి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విశ్వ విజేత‌గా టీమిండియా, ఫ్రైజ్ మ‌నీ ఎన్ని కోట్లంటే

 

Related News

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

Big Stories

Advertisement
×