Bomb threat: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుపై ( Indian Premier League 2025 Tournament )…. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా యుద్ధం ఎఫెక్ట్ పడేలా స్పష్టంగా కనిపిస్తోంది. క్రికెట్ మ్యాచ్ ఎక్కడ జరిగిన కూడా స్టేడియంలో బాంబులు అంటూ నిన్నటి నుంచి జోరుగా ప్రచారం అందుకుంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో బుధవారం రోజున మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా కూడా ఈడెన్ గార్డెన్స్ లో బాంబు ఉందని బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులంతా హై అలెర్ట్ ప్రకటించారు. ఈ సంఘటన మరువక ముందే మరో స్టేడియానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
Also Read: SRH Political Leaders : SRH టీమ్ లో నారా లోకేష్, బండి సంజయ్.. అంపైర్ గా RGV
సవాయి మాన్ సింగ్ స్టేడియంలో బాంబు?
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మరో స్టేడియానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. జైపూర్ లో ఉన్న సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు తెరపైకి వచ్చాయి. ఈనెల 16వ తేదీన జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో జైపూర్ సిటీలో హై అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు ఆడబోయే స్టేడియంలోనే బాంబులు ఉన్నాయని బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
జైపూర్ నగరాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా సవాయ్ మాన్సింగ్ స్టేడియం చుట్టుపక్కల భారీగా పోలీసులు మొహరించి… అందరిని చెక్ చేస్తున్నారు. సవాయ్ మాన్సింగ్ స్టేడియం లోపల అలాగే బయట బాంబు స్క్వార్డులు గాలిస్తున్నాయి. ఈ స్టేడియం లోపల ఉన్న వారిని పంపించి అలాగే చుట్టుపక్కల ఉన్న వారిని ఖాళీ చేయించాలని జైపూర్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈనెల 16వ తేదీన జరగబోయే రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కూడా రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదమని భావిస్తే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ విషయంలో దిగి రావాల్సి ఉంటుంది.
అదే రోజున ముంబై వేదికగా లేదా సౌత్ ఇండియా లోని ఏ స్టేడియం అయినా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. భద్రతాపరంగా చూసుకున్నట్లయితే ముంబై లేదా హైదరాబాదులో ఈ మ్యాచ్ జరిగే ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ… మ్యాచ్ జరుపుకోండి అని మోడీ ప్రభుత్వం ఆదేశిస్తే… అదే వేదిక 16వ తేదీన మ్యాచ్ జరుగుతుంది. ఇక పంజాబ్ వేదికగా జరిగే ప్రతి మ్యాచ్ కూడా… అక్కడ జరగబోదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ కు దగ్గరగా బార్డర్లో ఉన్న స్టేడియాలలో మ్యాచ్లు నిర్వహించకూడదని కూడా తెలుస్తోంది. అదే సమయంలో గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని కూడా పేల్చేస్తామని పాకిస్తాన్ నుంచి వార్నింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2025 నిర్వహణ పైన నీలి నీడలు కమ్ముకున్నాయి.
Also Read: Gandhi Ji with Kohli : RCB 18 ఏళ్ల కల నెరవేర్చిన గాంధీజీ.. సంబరాల్లో విరాట్ కోహ్లీ!
జైపూర్లో హై అలర్ట్..
సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి బాంబు బెదిరింపులు
భారీగా మోహరించిన పోలీసులు
స్టేడియం చుట్టుపక్కల ఉన్న వారిని ఖాళీ చేయించిన పోలీసులు
సవాయ్ మాన్సింగ్ స్టేడియం లోపల, వెలుపల బాంబు స్క్వాడ్ విస్తృత తనిఖీలు pic.twitter.com/4CVqK0E6YK
— BIG TV Breaking News (@bigtvtelugu) May 8, 2025