IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 Tournament ) విజేతగా టీమిండియా ( Team India ) నిలిచిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన చాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ( Team India ) గ్రాండ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు పైన ( New Zealand ) 25 సంవత్సరాల తర్వాత ప్రతి కారం తీర్చుకుంది టీమిండియా. న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా…. ఛాంపియన్ గా నిలవడం జరిగింది. అయితే… టీమిండియా ఛాంపియన్ గా నిలిచిన నేపథ్యంలో.. ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. దేశంలోని చాలామంది క్రికెట్ అభిమానులు రోడ్లపైకి ఎక్కి రాత్రిపూట… రచ్చ రచ్చ చేశారు. టపాసులు పేల్చుతూ నాన హంగామా చేశారు అభిమానులు.
Also Read: Ind vs nz: కోహ్లీ, రోహిత్ దాండియా….చిన్న పిల్లాడిలా సునీల్ గవాస్కర్ స్టెప్పులు !
ఇందులో భాగంగానే హైదరాబాదులో ( Hyderabad ) కూడా సంబరాలు భారీగానే చేసుకున్నారు టీమిండియా అభిమానులు. రోడ్లపైకి ఎక్కి డాన్సులు కూడా చేశారు. ఈ తరుణంలోనే హైదరాబాద్ పోలీసులు ( Hyderabad Police ) ఓవరాక్షన్ చేశారు. టీమిండియా అభిమానుల పైన లాఠీచార్జ్ ( Laththi charge) కూడా చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ సంఘటన దిల్సుఖ్నగర్లో చోటుచేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమిండియా విజయం సాధించిన తరుణంలో…. దిల్ సుఖ్ నగర్ లో ( Dilsukhnagar ) టీమిండియా అభిమానులందరూ రోడ్లపైకి వచ్చి చిందులు వేశారు.
ఇండియా గెలిచిందని సంబరాలు చేసుకున్నారు. అయితే… ఇది గమనించిన దిల్ సుఖ్ నగర్ పోలీసులు… రంగంలోకి దిగారు. రోడ్లపై సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ పైన లాఠీచార్జి కూడా చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై సభ్య సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీమిండియా గెలిస్తే సంబరాలు కూడా చేసుకోవద్దు ? అంటూ ప్రశ్నిస్తోంది. సంబరాలు చేసుకుంటే లాఠీచార్జ్ ( Laththi charge) చేస్తారా అని కూడా హైదరాబాద్ పోలీసులపై… జనాలు ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి పోలీసులు దీనిపై భిన్నంగా సమాధానం చెబుతున్నారు.
టీమిండియా అభిమానుల సంబరాల కారణంగా… దిల్ సుఖ్ నగర్ లో ( Dilsukhnagar ) ట్రాఫిక్ జామ్ అయిందని చెబుతున్నారు. అందుకే టీమిండియా అభిమానులను చెదరగొట్టినట్లు వెల్లడించారు పోలీసులు. ఇది ఇలా ఉండగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ తర్వాత… టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని… జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా స్పందించారు. తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం చేయకూడదని కోరారు. వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తాను రిటైర్ కావడం లేదని క్లారిటీ ఇచ్చారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ). వన్డేలు అలాగే టెస్టుల్లో కొనసాగుతానని ప్రకటించాడు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా… ప్రైజ్ మనీ ఎంతంటే ?
భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో నిన్న రాత్రి యువత రచ్చ
హైదరాబాద్-దిల్సుఖ్నగర్లో రోడ్లపైకి వచ్చి సంబరాలు
భారీగా ట్రాఫిక్ జామ్
లాఠీఛార్జ్ చేసి యువకులను చెదరగొట్టిన పోలీసులు https://t.co/E61DN5Vm61 pic.twitter.com/qoiPDBragS
— BIG TV Breaking News (@bigtvtelugu) March 10, 2025