BigTV English

Watch Video: క్రికెట్ లో మరో విషాదం.. సిక్స్ కొట్టాడు.. గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు

Watch Video: క్రికెట్ లో మరో విషాదం.. సిక్స్ కొట్టాడు.. గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు

Watch Video:   క్రికెట్ లో అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. క్రికెట్ ప్లేయర్లకు గాయాలు కావడం… లేదా మ్యాచ్ లు చూసే ప్రేక్షకులకు కూడా అప్పుడప్పుడు చిన్నపాటి దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంతేకాదు అప్పట్లో ఆస్ట్రేలియా ఆటగాడు బౌన్సర్ దెబ్బకు కుప్పకూలి చనిపోయిన సంగతి తెలిసిందే. హెల్మెట్ ఉన్నప్పటికీ బంతి బలంగా తాకడంతో… దాదాపు నెలరోజుల పాటు చికిత్స పొంది మరణించాడు. అయితే ఇప్పుడు అలాంటి సంఘటనే మరోటి జరిగింది.


Also Read: Morkel vs Arshdeep : గ్రౌండ్ లోనే WWE ఆడుతున్న ప్లేయర్లు.. మోర్కల్ పై అర్ష్ దీప్ దాడి.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

గుండెపోటుతో కుప్పకూలిన క్రికెటర్


క్రికెట్ ఆడుతూ ప్లేయర్లు దెబ్బలు తగిలించుకోవడం కామనే. ఇలాంటి నేపథ్యంలో ఓ క్రికెటర్ గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ లో యువకుడు క్రికెట్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో క్రికెట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఫిరోజ్ పూర్ లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. కొంతమంది ప్రవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ను చాలా గ్రాండ్గా నిర్వహించారు. సాధారణ బంతికాకుండా అంతర్జాతీయ క్రికెట్లో ఆడే లాంటి బంతులే… వినియోగించారు.

హెల్మెట్లు అలాగే క్రికెట్ కిట్లు అన్ని సూచనలు తీసుకొని క్రికెట్ ఆడారు. ఈ నేపథ్యంలోనే హర్జీత్ సింగ్ అనే యువకుడు.. ఈ టోర్నమెంట్లో… భారీ సిక్సర్ బాదాడు. అయితే సిక్స్ కొట్టిన తర్వాత బంతిని చూస్తూ అలా ముందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా గ్రౌండ్ లోనే కుప్పకూలాడు హర్జీత్ సింగ్ అనే యువకుడు. అయితే అతడు సిక్స్ కొట్టిన తర్వాత గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కుప్పకూలాడు. అనంతరం ఆ సంఘటన చూసి.. అక్కడే ఉన్న ప్లేయర్లు, స్థానికులు షాక్ అయ్యారు.

వెంటనే అతన్ని.. కాపాడే ప్రయత్నం కూడా చేశారు. కానీ గ్రౌండ్ లోనే గుండెపోటు విపరీతంగా రావడంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ గ్రౌండ్లోనే తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి ప్లేయర్ లందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా… గుండెపోటు వచ్చిన
హర్జీత్ సింగ్ ఏకంగా 49 పరుగులు చేశాడు. కానీ సిక్స్ కొట్టి మరణించడం జరిగింది.

రంగంలోకి దిగిన పోలీసులు

హర్జీత్ సింగ్ ( Harjeet Singh ) అనే యువకుడు.. గుండెపోటుతో మరణించడంతో… రంగంలోకి పోలీసులు దిగారు. ఈ సంఘటన పై కేసు బుక్ చేసుకొని ఆరా తీస్తున్నారు. వీడియో ఎవరు తీశారు…? బౌలింగ్ ఎవరు వేశారు? టోర్నమెంట్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: Venkatesh – Dhoni : బాత్రూం వెళ్లి 2 నిమిషాల్లో ధోని గుండు తీసుకున్నాడు.. విక్టరీ వెంకటేష్ సంచలన కామెంట్స్ !

 

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×