Lahiru Udara Catch Controversy: టీమిండియా వర్సెస్ శ్రీలంక ( Team India vs. Sri Lanka) మధ్య ప్రస్తుతం గాలే వేదికగా (Galle International Stadium, Galle) మొదటి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో టీమిండియా గెలుపు దిశగా దూసుకు వెళ్తోంది. మరో ఆరు వికెట్లు తీస్తే, శ్రీలంకపై టీమిండియా గెలవడం గ్యారెంటీ. ఇలాంటి నేపథ్యంలో శ్రీలంక ఓపెనర్ లహిరు ఉదారా ( Lahiru Udara) క్యాచ్ ఔట్ వివాదంగా మారింది. అతడిది నాటౌట్ అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయినప్పటికీ టీమిండియాకు అంపైర్లు అమ్ముడు పోయారని.. ఈ క్రమంలోనే లంక జట్టుకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. నాటౌట్ అయినప్పటికీ, ఔట్ గా ప్రకటించారని ఫైర్ అవుతున్నారు శ్రీలంక అభిమానులు.
గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇందులో నాలుగో రోజు ముగిసే సమయానికి 34 ఓవర్లు ఆడిన శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు సాధించింది. మరో 288 పరుగులు సాధిస్తే, టీమిండియా పై శ్రీలంక గెలిచే అవకాశాలు ఉన్నాయి. అటు 6 వికెట్లు పడగొడితే టీమిండియా గెలుస్తుంది. ఇలాంటి క్రమంలో శ్రీలంక ఓపెనర్ లహిరు ఉదారా (Lahiru Udara Catch Controversy) క్యాచ్ అవుట్ వివాదంగా మారింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ సందర్భంగా 22వ ఓవర్ ను మానవ్ సుతార్ సంధించాడు.
ఈ క్రమంలోనే బంతి బ్యాట్ ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకొని గల్లీ దిశగా వెళ్ళింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ధ్రువ్ జురెల్ చాలా వేగంగా స్పందించి.. క్యాచ్ అందుకున్నాడు. క్యాచ్ క్లీన్ గా పట్టాడా ? లేదా అనే అనుమానంతో ఆన్ ఫీల్డ్ అంపైర్లు దీన్ని థర్డ్ అంపైర్ సమీక్షకు పంపారు. విభిన్న కోణాలలో రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ రవీంద్ర విమలసిరి… ఔట్ గా ప్రకటించారు. ధ్రువ్ జురెల్ వేళ్ళు బంతి కిందనే ఉన్నాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై శ్రీలంక అభిమానులు సీరియస్ అవుతున్నారు. లహిరు ఉదారా అసలు ఔట్ కాలేదని, బంతి నేలకు తగిలిందని చెబుతున్నారు.
శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో గిల్ సేన విజయం వైపు దూసుకు వెళ్తోంది. టీమిండియా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి 462 పరుగులు సాధించింది. ఇందులో సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 193 పరుగులు రాబట్టింది. అటు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 84 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. అంటే మరో 6 వికెట్లు పడగొడితే టీమిండియా విక్టరీ ఖాయం.
Another very controversial decision by the TV umpire, and SL have lost their fourth in a highly unlikely chase of 372. Lahiru Udara the dismissed batter and SL captain Dhananjaya de Silva were in disbelief with the decision.
Russell Arnold and Harsha Bhogle are at a very civil…
— M SatyaKam (@satyakam92) August 18, 2026