E-Paper
Advertisement

పాకిస్తాన్ కుక్క‌ల‌కు కూడా ఐపీఎల్ లో ఎంట్రీ లేదు..అమీర్ కు హ‌ర్భ‌జ‌న్ స్ట్రాంగ్ కౌంట‌ర్

పాకిస్తాన్ కుక్క‌ల‌కు కూడా ఐపీఎల్ లో ఎంట్రీ లేదు..అమీర్ కు హ‌ర్భ‌జ‌న్ స్ట్రాంగ్ కౌంట‌ర్
Advertisement

Harbhajan Singh On Mohammad Amir IPL Entry: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చాలా విజయవంతంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 19 సంవత్సరాలుగా ఈ మెగా టోర్నమెంట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెటర్లు కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ బీసీసీఐ కఠిన నిర్ణయాల నేపథ్యంలో వాళ్లకు ఎలాంటి అనుమతులు లేవు. 2008 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇలాంటి క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2027 టోర్నమెంట్లో తాను ఆడుతానని మహమ్మద్ అమీర్ సంచలన ప్రకటన చేశారు.

దీనికి హర్భజన్ సింగ్ (Harbhajan Singh) తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. పాకిస్తాన్ కుక్కలకు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో అవకాశం లేదని తేల్చి చెప్పారు. అలాంటిది మహమ్మద్ అమీర్ (Mohammad Amir ) వస్తే గేట్లు ఓపెన్ చేసి పెడతామా ? అంటూ ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ వాళ్లకు ఇండియాలో అడుగుపెట్టే హక్కే లేదని తేల్చి చెప్పారు హర్భజన్ సింగ్. రెండు రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత హర్భజన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్న మహమ్మద్ అమీర్.. ఐపీఎల్ ఆడే ఛాన్స్ ?

Advertisement

పాకిస్తాన్ దేశంలో పుట్టి పెరిగిన మహమ్మద్ అమీర్.. తాజాగా బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నారు. తన భార్య బ్రిటన్ దేశానికి సంబంధించిన లేడీ. అక్కడ ప్రముఖ లాయర్ కూడా. ఈ క్రమంలోనే చాలా సంవత్సరాలుగా బ్రిటిష్ పౌరసత్వం కోసం మహమ్మద్ అమీర్ వేచి చూశాడు. గత రెండు నెలల కిందటే అతనికి బ్రిటిష్ పౌరసత్వం కూడా దక్కింది. ఈ క్రమంలో ది 100 లీగ్ టోర్నమెంట్ కూడా ఇంగ్లాండ్లో ఆడుతున్నాడు మహమ్మద్ అమీర్. ఈ టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే తాను ఐపీఎల్ ఆడేందుకు ఆలోచన చేస్తున్నానని వెల్లడించారు. పాకిస్తాన్ దేశంతో తనకు సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో… బీసీసీ రూల్స్ ప్రకారం ఐపిఎల్ ఆడే హక్కులు తాను పూర్తిగా కలిగి ఉన్నానని ప్రకటించారు. 2027 ఐపీఎల్ కోసం దరఖాస్తు కూడా చేసుకుంటానని మహమ్మద్ అమీర్ స్పష్టం చేశారు. అంతేకాదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అవకాశం వస్తేనే ఆడతానని వెల్లడించారు.

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

మహమ్మద్ అమీర్ కు హర్భజన్ సింగ్ కౌంటర్

Advertisement

ఐపీఎల్ ఆడతానని ప్రకటించిన మహమ్మద్ అమీర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హర్భజన్ సింగ్. పాకిస్తాన్ కుక్కలకు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అవకాశం ఇవ్వబోమని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నువ్వు ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీ టోర్నమెంట్లో భాగమైనట్లుగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది అంటూ ఫైర్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మెగా వేలం జాబితాలో చోటు దాకడం కూడా నీకు పెద్ద విషయం అంటూ కౌంటర్ ఇచ్చారు. అలాంటిది ఐపిఎల్ లో ఆడతానని ఎలా ప్రకటిస్తావు అంటూ ప్రశ్నించారు.

పాకిస్తాన్ లో పుట్టిన ఎవరికి ఇండియాలో అడుగుపెట్టే హక్కు లేదని హెచ్చరించారు. దీంతో హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే దీనిపై పాకిస్తాన్ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. బీసీసీ రూల్స్ ప్రకారం పాకిస్తాన్ తో అమీర్ కు ఎలాంటి సంబంధాలు లేవని.. ఈ క్రమంలో ఐపిఎల్ ఆడే హక్కులు కలిగి ఉన్నాడని పేర్కొంటున్నారు. మీరు కావాలంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో విదేశీ ప్లేయర్ గా బరిలోకి దిగుతాడని కౌంటర్ ఇస్తున్నారు.

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

 

Related News

అబ్దుల్లా షఫీక్ పాకిస్తాన్ సింహం…మావోడి ముందు గిల్ దేనికి ప‌నికిరాడు

మ‌హ్మ‌ద్ అమీర్ లాగానే, పాకిస్తాన్ దేశాన్ని వ‌దిలేస్తోన్న‌ ఖుష్దిల్ షా

పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

బాబ‌ర్ ఆజంకు నెంబ‌ర్ 1 ర్యాంక్ ఇవ్వాల్సిందే…లేక‌పోతే ICCని రోడ్డుకు ఇడ్చుతా!

ఎన్ని రోజులైనా వాళ్లే, నా కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు…డేవిడ్ వార్న‌ర్ సంచ‌ల‌నం?

టీమిండియా బౌల‌ర్ల‌కు న‌రకం చూపించ‌డం నాకు ఎంతో ఇష్టం

Big Stories

Advertisement
×