Big Stories

India Vs Pakistan Highlights: వావ్.. ఏం గెలుపు .. ఏం ఆనందం.. ఇండో-పాక్ మ్యాచ్ హైలైట్స్!

ICC Men’s T20 World Cup India – Pakistan Match Highlights: టీ 20 ప్రపంచకప్ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్.. పాకిస్తాన్ చివరి ఓవర్.. వాళ్లు గెలవాలంటే 6 బంతుల్లో 18 పరుగులు చేయాలి. అర్షదీప్ బౌలింగ్. మొదటి బాల్ కి వికెట్ వచ్చింది. 5 బాల్స్ 18 పరుగులు. ఆ బంతికి సింగిల్ వచ్చింది. దాంతో సమీకరణాలు 4 బాల్స్ 17 పరుగులుగా మారాయి. అప్పుడు ఒక బాల్ వైడ్ గా వచ్చింది. దీంతో 3 బాల్స్ 16 రన్స్ గా మారింది. అప్పుడు ఒక ఫోర్ వచ్చింది. అంతే 2 బాల్స్ లో 12 పరుగులు కావాలి. అప్పుడు రెండు సిక్స్ లు కొడితే పాకిస్తాన్ గెలుస్తుంది. కానీ ఆ బాల్ ఫోర్ వెళ్లింది. అంతే చివరి బాల్ కి 8 పరుగులు చేయాలి. కానీ పాకిస్తాన్ బ్యాటర్ 2 పరుగులు మాత్రమే చేశాడు. అంతే టీమ్ ఇండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్ మ్యాచ్ లలో పాకిస్తాన్ తో తమకి తిరుగులేదని మరోసారి టీమ్ ఇండియా నిరూపించింది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన.. ఈ మ్యాచ్ కూడా చరిత్రలో నిలిచిపోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు క్రికెట్ అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోతుందని అంటున్నారు.

- Advertisement -

అసలేం జరిగింది? ఏం మాయ జరిగింది? అయిపోయింద్రా.. టీమ్ ఇండియా పరిస్థితి అని అంతా అనుకున్నారు. ఎందుకంటే మనవాళ్లు మొదట బ్యాటింగ్ చేసి.. 119 పరుగులు మాత్రమే చేశారు. ఇది ఒక ‘లో స్కోర్ గేమ్. నిజానికి ఎవరికీ నమ్మకాలు లేవు.

- Advertisement -

తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ చూసి చాలామంది ఒక దశలో టీవీలు కట్టేసి వెళ్లిపోయారు. కానీ ఎక్కడో మిణుకుమిణుకు మంటున్న ఆశతో కాసేపటి తర్వాత టీవీ పెట్టి చూస్తే.. ఒక్కసారి కళ్లు జిగేళ్ మన్నాయి. అక్కడ పాకిస్తాన్ వికెట్లు వరుసపెట్టి పడుతుంటే, మళ్లీ కళ్లార్పకుండా చూస్తూ కూర్చున్నారు. టెన్షన్..టెన్షన్..నరాలు తెగే ఉత్కంఠతో బాల్ టు బాల్ మ్యాచ్ సాగింది.

Also Read : ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ వారసుడు, అల్కరాస్ విజేత..

కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీ, బౌలర్లను వాడిన తీరు, ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్ వీటన్నింటి కారణంగా టీమ్ ఇండియా అద్భుతమైన, అనితర సాధ్యమైన, ఎవరూ ఊహించని విజయాన్ని సాధించింది. దీంతో ఒక్కసారి భారతదేశంలో కోట్లాది మంది ప్రజల సంబరాలు అంబరాన్ని అంటాయి. న్యూయార్క్ లో స్టేడియం హోరెత్తిపోయింది. భారతదేశ పతాకాలు రెపరెపలాడాయి.

టాస్ ఓడిపోయిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 6 పరుగుల తేడాతో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని అందుకుంది.

మ్యాచ్ లోకి వెళితే.. ఒక ‘లో స్కోర్ ’గేమ్ ని టీమ్ ఇండియా బౌలర్లు కాపాడిన విధానం నిజంగా అద్భుతమని చెప్పాలి. ఇది భారత బౌలర్ల విజయం. నిజానికి 120 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని పాక్ ఓపెనర్లు బాబర్ అజామ్, రిజ్వాన్ ఇద్దరూ అద్భుతంగా ప్రారంభించారు. చాలా సాధికారికంగా ఆడుతూ, సిక్స్ లు, ఫోర్లు కొడుతూ, అవసరమైనప్పుడు సింగిల్స్ తీస్తూ మ్యాచ్ ని వన్ సైడ్ చేయాలని చూశారు.

Also Read: Harbhajan Singh: పాక్ మాజీకి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హర్భజన్

మూడు ఓవర్లు గడిచాయి. వికెట్లు పడటం లేదు. ఓపెనర్స్ ఇద్దరూ సునాయాసంగా రన్స్ తీస్తున్నారు. అర్షదీప్, సిరాజ్ తేలిపోయారు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. టీమ్ ఇండియా ప్రధాన అస్త్రం బూమ్రాకి బాల్ ఇచ్చాడు. అప్పటికే తన మొదటి ఓవర్ లో రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్ ని లాంగ్ ఆన్ లో శివమ్ దుబె వదిలేశాడు.

అవేవీ మనసులో పెట్టుకోకుండా బూమ్రా 4వ ఓవర్ ప్రారంభించాడు. అంతవరకు లేని స్లిప్ లోకి ఫీల్డర్ గా సూర్యకుమార్ ని తీసుకొచ్చాడు. మరి రోహిత్ శర్మ ఏం చెప్పాడో తెలీదు. బూమ్రా బాల్స్ అలాగే వేశాడు. సరిగ్గా నాలుగో బంతిని బాబర్ అజామ్ (13) స్లిప్ లోకి ఆడాడు. అంతే సూర్య అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. అంతే భారత శిబిరంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అలా రోహిత్ కెప్టెన్సీ, బూమ్రా బౌలింగ్ తో టీమ్ ఇండియాకు గొప్ప బ్రేక్ దొరికింది.

అలా 1 వికెట్ నష్టానికి 26 పరుగులతో పాకిస్తాన్ ముందడుగు వేసింది. మళ్లీ అక్కడ నుంచి 10 ఓవర్ వరకు మళ్లీ వికెట్ పడలేదు. ఓపెనర్ రిజ్వాన్ క్రీజులో సెటిల్ అయిపోయాడు. కాన్ఫిడెంట్ గా షాట్లు కొడుతున్నాడు. శివమ్ దుబె వదిలేసిన క్యాచ్ కాస్ట్ లీగా మారుతుందా? అని అందరికీ అనిపించింది. అప్పటికి స్కోరు 57 పరుగులతో లక్ష్యం వైపు పాక్ దూసుకెళుతోంది.

Also Read : స్వైటెక్‌కి ఫ్రెంచ్ సింగిల్స్ టైటిల్, నాదల్ బాటలో

ఎందుకంటే 10 ఓవర్లలో 57 పరుగులు చేస్తే, మరో 10 ఓవర్లలో మరో 62 చేయడం చాలా ఈజీ కదాని అంతా అనుకున్నారు. వికెట్లు చేతిలో ఉన్నాయి. బూమ్రా ఇచ్చిన బ్రేక్ తర్వాత మళ్లీ రాలేదు. ఆ సమయంలో అక్షర్ పటేల్ బౌలింగ్ వచ్చాడు. తను వేసిన బంతికి ఉస్మాన్ ఖాన్ (13) వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంతే ఒక్కసారి టీమ్ ఇండియాలో చలనం వచ్చింది. మళ్లీ అలర్ట్ అయ్యారు.

కానీ రిజ్వాన్ పాతుకుపోయాడు. అతనికి సపోర్ట్ గా ఫకర్ జమాన్ వచ్చాడు. అయితే అతన్ని హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. 13 పరుగులు చేసి తను నిరాశగా క్రీజు వదిలాడు. 14 ఓవర్లు గడిచాయి. పాక్ స్కోరు 80 పరుగులతో ఉంది. ఇంకా 36 బాల్స్ ఉన్నాయి. విజయానికి 40 పరుగుల దూరంలో ఉంది. అటు వైపు రిజ్వాన్ నాటౌట్ గా ఉన్నాడు.

దీంతో మళ్లీ రోహిత్ శర్మలో కెప్టెన్ మేల్కొన్నాడు. తన ప్రధానాస్త్రం బూమ్రాని దించాడు. తనేం చేశాడంటే రిజ్వాన్ బలహీనతలపై పదేపదే బాల్స్ వేశాడు. అలా ఒకసారి ఆఫ్ సైడ్ పై పడిన బంతి, ఇన్ స్వింగ్ అయి రిజ్వాన్ వికెట్ ని గిరాటేసింది. అంతే స్టేడియం హోరెత్తిపోయింది. టీవీలు కట్టీసిన వాళ్లందరూ మళ్లీ ఆన్ చేశారు.

Also Read : కొహ్లీ రికార్డుని దాటేసిన.. బాబర్ అజామ్

మ్యాచ్ ఒక్కసారి పాకిస్తాన్ వైపు నుంచి ఇండియావైపు మొగ్గు చూపింది. అంతే కెప్టెన్ రోహిత్ శర్మ దొరికిన పట్టుని వదల్లేదు. క్లోజ్ ఫీల్డింగ్ పెట్టి, షాట్లు కొట్టకుండా బౌలింగ్ చేయించాడు. సింగిల్స్ రాకుండా చూశాడు. మొత్తం ఫీల్డర్లలో 6 గురు వికెట్ చుట్టూనే ఉన్నారంటే, పాక్ బ్యాటర్లను ఎంత అష్టదిగ్భందం చేశాడో చూడండి.

ఈ పరిస్థితుల్లో పాక్ బ్యాటర్లు రన్స్ తీయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. షాదబ్ ఖాన్ (4), ఇఫ్తికర్ అహ్మద్ (5), ఇలా త్వరత్వరగా అవుట్ అయిపోయారు. చివరికి విజయానికి 6 పరుగుల దూరంలో పాకిస్తాన్ ఆగిపోయింది. 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా మరో అనితర సాధ్యమైన విజయాన్ని అందుకుంది. ఇది పాక్-ఇండియా మధ్య జరిగిన 16 మ్యాచ్ ల్లో టీమ్ ఇండియాకి 15వ విజయం.

ఇక టీమ్ ఇండియా బౌలింగులో బూమ్రా 3, హార్దిక్ పాండ్యా 2, అర్షదీప్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాకి ఓపెనర్లుగా మళ్లీ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ వచ్చారు. ఈ కాంబినేషన్ ఎందుకో వర్కవుట్ కాలేదు. ఇద్దరు సీనియర్ బ్యాటర్లు వెంటవెంటనే అయిపోతే, మిగిలిన వారిపై ప్రెజర్ పడుతోంది. ఆ తర్వాత జట్టులో సీనియర్స్ లేక, వికెట్లు కాపాడుకుంటూ మ్యాచ్ ని ముందుకు తీసుకువెళ్లేవారే కరువయ్యారు. అందుకే 19 ఓవర్లకే టీమ్ ఇండియా ఆలౌట్ అయిపోయింది.

Also Read : ధోనీ రికార్డ్ బ్రేక్.. సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ

అయితే టీమ్ ఇండియా బ్యాటింగ్ ప్రారంభించాక ఎప్పటిలాగే విరాట్ కొహ్లీ (4) వెంటనే అయిపోయాడు. తర్వాత రోహిత్ శర్మ కాపాడతాడని అనుకుంటే తను ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి 13 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు.

పవర్ ప్లే లో 2.4 ఓవర్లలోనే 2 కీలకమైన వికెట్లు పడిపోవడంతో పంత్ కి సపోర్ట్ గా ప్రమోషన్ పై ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ వచ్చాడు. తను ఆ పరిస్థితుల్లో నిజం చెప్పాలంటే న్యాయం చేశాడు. ఒక సిక్స్, 2 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఇక రిషబ్ పంత్ కి వరుసగా 4 లైఫ్స్ వచ్చాయి. అవి లేకపోతే టీమ్ ఇండియా ఈ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. మొత్తానికి పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తనదే టీమ్ ఇండియాలో హయ్యస్ట్ స్కోరు అని చెప్పాలి.

Also Read: SA vs BAN Highlights T20 World Cup 2024: దక్షిణాఫ్రికా ‘మహరాజ్’.. బంగ్లాదేశ్ పై గెలిపించిన మనవాడు

అద్భుతాలు చేస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ (7), శివమ్ దుబె (3), రవీంద్ర జడేజా (0) డిఫెన్స్ షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. అది దురద్రష్టం అని చెప్పాలి. ఇక చివర్లో అర్షదీప్ సింగ్ (9) రన్ అవుట్ అయిపోయాడు. రెండు, ఏవో సిక్స్ లు కొడతాడనుకున్న హార్దిక్ పాండ్యా (7) లాంగ్ ఆన్ లో దొరికి పోయాడు. చివర్లో సిరాజ్ (7) నాటౌట్ గా నిలిచాడు. ఎట్టకేలకు 19 ఓవర్లలో 119 పరుగులకి ఆలౌట్ అయిపోయింది.

పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగు చేశారు. పిచ్ పరిస్థితులకు తగినట్టుగా మంచి లైన్ అండ్ లెంగ్త్ వేసి వరసపెట్టి వికెట్లు తీశారు. ఒక్కొక్క ఓవర్ లో అయితే వరుస బంతుల్లో రెండేసి వికెట్లు వచ్చాయి. అయితే వారికన్నా బ్రహ్మాండంగా టీమ్ ఇండియా బౌలింగు ఉండటంతో విజయం సాధ్యమైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News