IPL Tickets dispute : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తాజాగా అరెస్టు అయ్యారు. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో ఆయనను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ని టికెట్ల కోసం బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో దీనిపై విజిలెన్స్ శాఖ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఇక ఈ నివేదిక ఆధారంగా HCA పై కేసు నమోదవ్వడంతో ఆసంస్త అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తాజాగా అరెస్టయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్, హెచ్సీఏ వివాదంలో ఈ మేరకు చర్యలు తీసుకుంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇటీవల సీఐడీ కేసు నమోదు చేసింది.
Also Read : Riley Meredith : వీడు మనిషా.. పశువా…. దెబ్బకు వికెట్ రెండుగా చీలిపోయింది… బౌలర్ ను చూసి వణికి పోవాల్సిందే
SRH-HCA మధ్య టికెట్ల వివాదం
గత ఐపీఎల్ సీజన్ లో SRH-HCA మధ్య టికెట్ల వివాదం నెలకొంది. మ్యాచ్ టికెట్లు కేటాయించలేదనే కారణంతో కార్పొరేట్ బాక్స్ కి HCA అధికారులు తాళాలు వేసారు. ఇక ఈ ఘటనతో సన్ రైజర్స్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు అప్పట్లో హైదరాబాద్ ని వదిలి వెళ్లిపోతామని చెప్పింది. ఇక అప్పట్లో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు పై సన్ రైజర్స్ హైదరాబాద్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక ఈ తరుణంలోనే తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ పై HCA అద్యక్షుడు ఒత్తిడి తెచ్చినట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. జగన్ మోహన్ రావ అరెస్టుతో కావ్య పాప స్కెచ్ బాగానే వేసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం విశేషం.
Also Read : Watch Video : ఇదెక్కడి బౌలింగ్ రా… బుడ్డోడు వేసిన బంతికి నడ్డి విరిగింది.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
విజిలెన్స్ కమిటీ నివేదిక.. అరెస్ట్..
సన్ రైజర్స్ హైదరాబాద్- హెచ్‌సీఏ మధ్య టికెట్ల వివాదం ఇటీవలే నెలకొన్న విషయం తెలిసిందే. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ 10 శాతం టికెట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పినప్పటికీ.. జగన్ మోహన్ రావు 20 శాతం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో తమకు అడిగిన అన్ని టికెట్లు ఇవ్వలేదంటూ వీఐపీ గ్యాలరీ కి హెచ్సీఏ ప్రతినిధులు తాళం వేశారు. ఇక హెచ్సీఏ తీరు మారకపోతే హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని హెచ్చరించింది. ఇక విజిలెన్స్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. టికెట్ల విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ పై హెచ్సీఏ ఒత్తిడి తీసుకొచ్చిందని.. 20 శాతం టికెట్లు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేసిందని విజిలెన్స్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం హైదరాబాద్ ని విడిచి వెళ్తుందని ఇటీవలే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రావు అరెస్ట్ కావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.