Pakistan Army Convoy Attack| పాకిస్తాన్‌లో ఒక భీకరమైన ఘటన వెలుగు చూసింది. పాకిస్తాన్ సైనికుల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది పాక్ సైనికులు మరణించగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఘటనలో 90 మంది సైనికులు చనిపోయినట్లు దాడి చేసిన బలోచ్ మిలిటెంట్లు పేర్కొన్నారు.
వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌లోని క్వెట్టా నుండి టఫ్తాన్‌కు వెళుతున్న సైనిక కాన్వాయ్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడి చేసింది. ఎనిమిది సైనిక బస్సులు వెళ్తున్న సమయంలో బలూచ్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఒక బస్సుపై ఆత్మహత్యా దాడి జరిగింది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని నోష్కి సమీపంలో జరిగిందని స్థానిక మీడియా నివేదించింది. ఈ దాడిని పాకిస్తాన్ అధికారులు కూడా ధృవీకరించారు.
Also Read: తైవాన్‌కూ ఉ క్రెయిన్ గతే.. సెమీకండక్టర్ చిప్‌లపై ట్రంప్ కన్ను
మరోవైపు, ఈ పేలుడులో 90 మంది సైనికులు మరణించినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రముఖ మీడియాకు మెయిల్ పంపింది. ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ)కు చెందిన ఫిదాయీ యూనిట్ ‘మజీద్ బ్రిగేడ్’ కొన్ని గంటల క్రితం నోష్కి సమీపంలోని పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ కాన్వాయ్‌లో ఎనిమిది బస్సులు ఉన్నాయి. పేలుడు వల్ల ఒక వాహనం పూర్తిగా నాశనమైంది. పేలుడు సంభవించిన తర్వాత బీఎల్‌ఏకు చెందిన ఫతే స్క్వాడ్ వెంటనే మరో బస్సును చుట్టుముట్టింది. దానిలో ఉన్న సైనికులను హతమార్చింది. మా విరోధుల మరణాల సంఖ్య 90కి చేరింది’’ అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తెలిపింది.
ఇటీవలే పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ప్రయాణికుల రైలును ఈ బలూచ్ మిలిటెంట్లు హైజాక్ చేసిన సంగతి తెలిసింది. మొత్తం 400 మంది ప్రయాణిస్తున్న ఈ రైలుపై దాడి చేసి, ప్రయాణికులను బందీలుగా మార్చి అనేక మంది ప్రాణాలు తీశారు. ఈ ఘటన జరిగిన కొద్ది కాలంలోనే మరో దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ ఘటనలో కేవలం ఏడుగురు సైనికులు మరణించినట్లు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
214 మంది బందీలను హతమార్చిన బలూచ్ మిలిటెంట్లు
పాకిస్తాన్‌లోని వేర్పాటువాద బలూచ్ మిలిటెంట్లు మంగళవారం ప్రయాణికుల రైలును హైజాక్ చేసిన తరువాత పాక్ జైళ్లలో ఉన్న తమ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చింది. కానీ, ప్రభుత్వం స్పందించకపోవడంతో, తమ చెరలో ఉన్న మొత్తం 214 మంది పాకిస్తాన్ పౌరులు, సైనికులను చంపినట్లు BLA ప్రకటించింది.
బలోచిస్తాన్ ప్రాంతంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ, పేదరికం అధికం. 1947లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత, బలోచ్ నాయకులు స్వతంత్ర రాష్ట్రం కోరుకున్నారు, కానీ పాకిస్తాన్ సైన్యం ఒత్తిడితో 1948లో విలీనం జరిగింది. 2000లో BLA ఏర్పడి, సహజ వనరులను కాపాడుకొని, గ్రేటర్ బలోచిస్తాన్ ఏర్పాటు చేయడం వారి లక్ష్యం. BLAని ఇప్పుడు పాకిస్తాన్, బ్రిటన్ ప్రభుత్వాలు ఉగ్రసంస్థగా గుర్తించాయి.
🚨 #BalochLiberationArmy (BLA) eliminates 90 Pakistani soldiers in another deadly attack after
This follows BLA insurgents #PakistanTrainHijack with nearly 440 passengers days ago.
BLA shocks #Pakistan Government!
Pakistan also faces a massive financial crisis. Pak in deep… pic.twitter.com/dKCk4EUnV9
— Bharggav Roy 🇮🇳 (@Bharggavroy) March 16, 2025