E-Paper
Advertisement

U19 Asia Cup 2025: పాకిస్తాన్ పరువు తీసిన ఆయుష్ మాత్రే, మ‌రోసారి షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండానే

U19 Asia Cup 2025: పాకిస్తాన్ పరువు తీసిన ఆయుష్ మాత్రే, మ‌రోసారి షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండానే
Advertisement

U19 Asia Cup 2025:  అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( ACC Mens U19 Asia Cup 2025 ) భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య  ( India U19 vs Pakistan U19 )  మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో మరోసారి టీమిండియా టాస్ ఓడిపోయింది. అటు టాస్ గెలిచిన పాకిస్తాన్ అండర్ 19 జట్టు, మొదట బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా జట్టు బ్యాటింగ్ కు దిగింది. అయితే టాస్ వేసిన క్రమంలో మరోసారి పాకిస్తాన్ కు అవమానం ఎదురయింది. టాస్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ఆయుష్ మాత్రే వచ్చేసాడు. సూర్య కుమార్ యాదవ్ తరహా లోనే, బిసిసిఐ ఆదేశాల మేరకు షేక్ హ్యాండ్‌ ఇవ్వకుండా వచ్చాడు ఆయుష్ మాత్రే. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. ఇది చూసిన ఇండియన్ ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఆయుష్ మాత్రే ( Ayush Matre), పాకిస్తాన్ కు తగిన శాస్తి చేశాడని అంటున్నారు ఫ్యాన్స్.

Also Read: T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

టాస్ ఓడిన టీమిండియా…ఎలా చూడాలంటే ?

Advertisement

అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేస్తోంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ ప్రసారాలు సోనీ లివ్‌, సోనీ స్పోర్ట్స్ లో చూడవచ్చు. అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ఏ లో పాకిస్తాన్ అలాగే టీమిండియా జట్లు ఉండటంతో ఇవాళ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాయింట్ల పట్టికలో కూడా ఈ రెండు జట్లు టాప్ లో ఉన్నాయి. ఇవాళ గెలిచిన జట్టు సెమీఫైనల్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య ఏప్రిల్ లో జరిగిన యుద్ధ వాతావరణం నేపథ్యంలో తెరపైకి షేక్ హ్యాండ్ వివాదం వచ్చింది. అందుకే రెండు మ్యాచ్ ల‌ మధ్య మ్యాచ్ జరిగితే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లేదు ఇరు జ‌ట్ల కెప్టెన్లు.

 

ఇండియా U19 వ‌ర్సెస్ పాకిస్తాన్ U19 జ‌ట్ల వివ‌రాలు

Advertisement

ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆయుష్ మాత్రే ( కెప్టెన్ ), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (WK), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్

పాకిస్థాన్ U19 (ప్లేయింగ్ XI): ఉస్మాన్ ఖాన్, సమీర్ మిన్హాస్, అలీ హసన్ బలోచ్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ ( కెప్టెన్), హమ్జా జహూర్ (WK), హుజైఫా అహ్సాన్, నిఖాబ్ షఫీక్, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయామ్, అలీ రజా

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

 

 

Related News

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

Big Stories

Advertisement
×