E-Paper
Advertisement

ఆస్ట్రేలియా లాగే టీమిండియా ఓడిపోతుంద‌ని..బంగ్లా టూర్ కు BCCI పంప‌డం లేదు !

ఆస్ట్రేలియా లాగే టీమిండియా ఓడిపోతుంద‌ని..బంగ్లా టూర్ కు BCCI పంప‌డం లేదు !
Advertisement

Inzamam-ul-Haq On IND VS BAN: టీమిండియాతో వన్డేలతో పాటు టి20లు ఆడతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెగ ఉత్సాహం చూపిస్తోంది. తమ దేశానికి టీమిండియాను ఆహ్వానిస్తోంది. అయితే బంగ్లాదేశ్ టూర్ కు వెళ్లే విషయంపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. హిందువులపై దాడులు, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ను బంగ్లాదేశ్ బహిష్కరించడం లాంటి సంఘటనలను చూపిస్తూ ఈ సిరీస్ ను హోల్డ్ లో పెట్టింది బీసీసీఐ. ఈ క్రమంలో టీమిండియా పరువు తీసేలా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ (Inzamam-ul-Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా తరహాలోనే టీమిండియా కూడా ఓడిపోతుందని.. ఈ భయంతోనే బంగ్లాదేశ్ టూర్ కు వాళ్ల‌ జట్టును బీసీసీఐ పంపించడం లేదని బాంబు పేల్చారు. దీంతో ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లకు విశ్వ ప్రయత్నాలు

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మళ్లీ సంబంధాలు ఎప్పటిలాగే ఉండేలా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంటుంది. ఆ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత… ఇండియాకు దగ్గరయ్యే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీమిండియాను తమ దేశానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఆహ్వానిస్తోంది. తమతో మూడు టీ20 లతో పాటు మూడు వన్డేలు ఆడాలని ఇప్పటికే బీసీసీఐకి సందేశం పంపింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఒకవేళ బీసీసీఐ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సెప్టెంబర్ మాసంలో టి20ల‌తో పాటు వన్డే సిరీస్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

ప్రధాని మోడీ నిర్ణయం పై ఉత్కంఠ

బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య సిరీస్ జరగాలంటే కచ్చితంగా మోడీ ప్రభుత్వం అనుమతి కావాలి. ఇందులో భాగంగానే మోడీ ప్రభుత్వానికి ఈ సిరీస్ గురించి బీసీసీఐ లేఖ కూడా రాసింది. అయితే దీనిపై ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదు. అంతలోనే ఆఫ్ఘనిస్తాన్ తో టి20 లు ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 3 T20లు జరుగుతాయి. అంటే బంగ్లాదేశ్ తో సిరీస్ ఆడే అవకాశాలు లేనట్లేనని పరోక్షంగా హింట్ ఇచ్చింది ఇండియా. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.

ఓట‌మి భ‌యంతో బంగ్లాకు వెళ్ల‌డం లేదంటూ విమ‌ర్శ‌లు

Advertisement

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టూర్ ఉత్కంఠత పై తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ స్పందించారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాను టెస్టుల్లో బంగ్లాదేశ్ ఓడించిందని గుర్తు చేశారు. ఈ భయంతో బంగ్లాదేశ్ టూర్ కు టీమిండియా వెళ్లడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోతే పరువు పోతుందన్న భయంతో బీసీసీఐ, వెనక్కి అడుగు వేస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

 

Related News

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

Big Stories

Advertisement
×