E-Paper
Advertisement

KKR VS RR: రెచ్చిపోయిన డికాక్…రాజస్థాన్ ఘోర ఓటమి

KKR VS RR: రెచ్చిపోయిన డికాక్…రాజస్థాన్ ఘోర ఓటమి

KKR VS RR:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) మ్యాచ్లన్నీ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ… రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్  ( Rajasthan Royals vs Kolkata Knight Riders ) జట్ల మధ్య ఆరవ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో.. అద్భుతంగా ఆడిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిపోయిన కోల్కతా నైట్ రైడర్స్…. రాజస్థాన్ రాయల్స్ పైన మాత్రం దుమ్ము లేపింది. ఈ తరుణంలోనే.. రాజస్థాన్ రాయల్స్ పై 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది కేకేఆర్.

Also Read: KKR VS RR: ఫీల్డింగ్ చేయనున్న KKR…భారీ మార్పులతో రాజస్థాన్..జట్ల వివరాలు ఇవే

 

ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ ఓడిపోవడంతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్… నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు పెద్దగా రాణించకపోవడంతో… 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్కత్తా నైట్ రైడర్స్ లాంటి జట్టు.. ప్రత్యర్థిగా ఉన్నప్పుడు.. ఇలాంటి తక్కువ స్కోర్స్ అస్సలు పనిచేయవు. ఇక 152 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు… ఎక్కడ తలొగ్గలేదు. ముఖ్యంగా క్వింటన్ డికాక్ 97 పరుగులతో దుమ్ము లేపాడు. కేవలం 61 బంతులు ఆడిన క్వింటన్ డికాక్… 97 పరుగులు చేసి రఫ్పాడించాడు.

ఇందులో ఆరు సిక్సర్లు అలాగే 8 బౌండరీలు ఉన్నాయి. 159 స్ట్రైక్ రేటుతో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు డికాక్. అటు ఓపెనర్ గా వచ్చిన మొయిన్ అలీ ఐదు పరుగులకే రన్ అవుట్ అయ్యాడు. ఇక కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే 15 బంతుల్లో 18 పరుగులు చేసి తొందరగానే అవుట్ అయ్యాడు. ఇక చివరకు కొత్త కుర్రాడు రఘువంషి చివర్లో 17 బంతుల్లో 22 పరుగులు చేసి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ తరుణంలోనే 17.3 ఓవర్స్ లో రెండు వికెట్లు నష్టపోయిన కేకేఆర్ లక్ష్యాన్ని చేదించింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టును చిత్తు చేసింది కేకేఆర్.

Also Read: Most Ducks In IPL: డకౌట్ లో కూడా మ్యాక్సీ మామ రికార్డ్… టాప్ లో ఉన్న 5 గురు ప్లేయర్లు వీళ్లే !

ఇక ఇవాల్టి మ్యాచ్ పూర్తి కావడంతో పాయింట్స్ టేబుల్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి విజయంతో… ఆరవ స్థానానికి చేరుకుంది కోల్కత్తా రైడర్స్. రెండు మ్యాచ్లు ఆడిన కేకేఆర్ ఒక మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ లో ఓడిపోయింది. దీంతో కేకేఆర్ చేతిలోకి రెండు పాయింట్లు రావడం జరిగింది. అటు సన్రైజర్స్ హైదరాబాద్… మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంది. ( Rajasthan Royals vs Kolkata Knight Riders )

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×