Los Angeles Olympics: ఒలంపిక్స్ లో ( 2028 Los Angeles Olympics ) క్రికెట్ నిర్వహించాలని చాలా రోజుల నుంచి డిమాండ్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై చాలా చర్చలు నిర్వహించిన అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ ( International Olympic Committee ) … దీనిపై గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ తరుణంలోనే 2028 సంవత్సరంలో జరిగే లాస్ ఏంజెల్స్ ఒలంపిక్స్ లో ( 2028 Los Angeles Olympics) క్రికెట్ ( Cricket ) కూడా ఉండబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా అవెలు పడింది. 2028 అంటే దాదాపు 39 నెలల తర్వాత ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది.
Also Read: RCB IPL 2025 Trophy : ఈ సారి వాళ్ళదే కప్.. అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
కేవలం 6 క్రికెట్ జట్లకు మాత్రమే అవకాశం
2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ క్రీడలలో… ఈసారి క్రికెట్ కూడా ఉండనుంది. అయితే ఇందులో కేవలం 6 క్రికెట్ జట్టులో మాత్రమే పాల్గొంటారని తాజాగా ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో అలాగే జాతీయ కథనాలలో వస్తోంది. ఈ జట్లలో టీమిండియా ( Team India), ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు పాల్గొంటాయి. అంతర్జాతీయ టి20 ర్యాంకింగ్స్ ప్రకారం… ఈ ఆరు జట్లను ఫైనల్ చేశారు. అందుకే ఈ ఆరు జట్లు ఇందులో పాల్గొనబోతున్నాయి.
1. Team India – 20170
2. ఆస్ట్రేలియా – 12417
3. ఇంగ్లాండ్ – 12688
4. న్యూజిలాండ్ – 14652
5. వెస్టిండీస్ – 14587
6. దక్షిణాఫ్రికా – 11345
ఒలంపిక్స్ లో పాకిస్తాన్ కు నో ఛాన్స్
2028 ఒలంపిక్స్ లో పాకిస్తాన్ జట్టుకు అవకాశం ఏమాత్రం లేదని తాజాగా ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ టి20 ర్యాంకింగ్స్ ప్రకారం… పాకిస్తాన్ కు ఛాన్స్ దక్కలేదు. పాయింట్ల ప్రకారం 13,845 పాయింట్లు మాత్రమే.. పాకిస్తాన్ చేతిలో ఉన్నాయి. విజయాల శాతం తక్కువ ఉన్న నేపథ్యంలో… పాకిస్తాన్ ఇందులో.. ఛాన్స్ దక్కించుకోలేదని తెలుస్తోంది. అయితే ఒలంపిక్స్ లో పాకిస్తాన్ కూడా క్వాలిఫై అయితే… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉండేది అంటున్నారు ఫాన్స్. కానీ… పాకిస్తాన్ క్వాలిఫై కాకపోవడంతో… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చాలా మంది మిస్ అవుతున్నారు.
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఏ క్రీడాలు ఉంటాయి ?
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ ( 2028 Los Angeles Olympics ) క్రీడలలో 5 కొత్తగా గేమ్స్ వస్తున్నాయి. ఇందులో క్రికెట్ ( Cricket ) అలాగే ఫ్లాగ్ ఫుట్బాల్ ( Flag football ) ఉన్నాయి. అదే సమయంలో లక్రోస్, బేస్ బాల్, స్క్వాష్ క్రీడాలు కూడా కొత్తగా చేరబోతున్నాయి. ఇందులో కొత్తగా ఒలంపిక్స్ లోకి వచ్చే స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్బాల్ ఉన్నాయి. ఇక చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చే క్రీడలలో లాక్రోస్, క్రికెట్ అలాగే బేస్ బాల్ ఉన్నాయి. ఈ మేరకు 2023 అక్టోబర్ మాసంలో అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ క్రీడాలన్నీ లాస్ ఏంజెల్స్ లో 2028 లో జరుగుతాయి.
Also Read: Yuzi Chahal With Mahvash : విడాకులైన నెల రోజులకే లవర్ తో సెల్ఫీ… చాహల్ సంచలన పోస్ట్
🚨 CRICKET TEAMS AT OLYMPICS. 🚨
– 6 teams will be participating at the 2028 Los Angeles Olympics. pic.twitter.com/haYycKIzdC
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2025