E-Paper
Advertisement

Moeen Ali: బీసీసీఐపై AUS, ENG బోర్డులు తిర‌గ‌బ‌డాలి….జై షా తోక క‌ట్ చేయాల్సిందే ?

Moeen Ali: బీసీసీఐపై AUS, ENG బోర్డులు తిర‌గ‌బ‌డాలి….జై షా తోక క‌ట్ చేయాల్సిందే ?
Advertisement

Moeen Ali: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి ముస్తాఫిజుర్ రహమాన్ ను ( Mustafizur Rahman) తప్పించడంపై ఇంగ్లాండ్ క్రికెటర్ మొయీన్ అలీ ( Moeen Ali ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలిని ( BCCI ) తప్పుపడుతూ హాట్ కామెంట్స్ చేశారు. ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి ముస్లిం క్రికెటర్ల పై ఇలా వ్యవహరించడంపై మండిపడ్డారు. ఎంతో కష్టపడి పైకి వచ్చిన ముస్తాఫిజుర్ రహమాన్ ను అర్ధాంతరంగా తొలగించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు తిరగబడాలని హితువు పలికారు మొయీన్ అలీ. అదే సమయంలో ఐసీసీ బాస్ జై షా న్యూట్రల్ గా ఉండడం లేదని, బీసీసీఐకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

బీసీసీఐపై AUS, ENG బోర్డులు తిర‌గ‌బ‌డాలి

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ను తొలగించడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఇండియన్స్ మాత్రమే దీన్ని సమర్థిస్తుంటే, విదేశీ క్రికెటర్లు అలాగే పాకిస్తాన్ కుట్ర దారులు మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. లేటెస్ట్ గా ముస్తాఫిజుర్ రహమాన్ పై వేటు వేయడాన్ని తప్పుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మొయిన్ అలీ. ముస్తాఫిజుర్ రహమాన్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడని.. ఐపీఎల్ లో సెలెక్ట్ కావడం మామూలు విషయం కాదని వివరించారు.

కానీ 9 కోట్లకు పైగా ముస్తాఫిజుర్ రహమాన్ ధర పలికిన తర్వాత, ఇంటికి వెళ్ళిపోమంటే ఎలా వెళ్తాడు ? అతడి కెరీర్ ఏం కావాలి అంటూ నిలదీశారు మొయిన్ అలీ. ఇలా తప్పిస్తే ముస్తాఫిజుర్ రహమాన్ కు చాలా నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలిపాడు. రాజకీయాలు వేరు అలాగే క్రికెట్ వేరు అంటూ వ్యాఖ్యానించారు. కానీ క్రికెట్ లోకి రాజకీయాలు రావడంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోందని మండిపడ్డారు. దీనికి పరిష్కారం వెంటనే చూపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సందర్భాల నేపథ్యంలో ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు కచ్చితంగా స్పందించాలి.. బీసీసీఐ పై తిరుగుబాటు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ను ( ICC) ఎవరు కంట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలుసంటూ అటు జై షా ను ( Jay Shah) కౌంటర్ చేశారు మొయిన్ అలీ ( Moeen Ali ) .

ఐపీఎల్ 2026పై బంగ్లాదేశ్ బ్యాన్‌

Advertisement

ముస్తాఫిజుర్ రహమాన్ ను ( Mustafizur Rahman) తొలగించడం పై తీవ్రస్థాయిలో స్పందించింది బంగ్లాదేశ్ స‌ర్కార్‌. త‌మ దేశంలో ఐపీఎల్ 2026 టోర్న‌మెంట్ ప్ర‌సారాల‌పై బ్యాన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది బంగ్లాదేశ్ స‌ర్కార్.

 

Also Read: Mustafizur Rahman-PSL: ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకున్న ముస్తాఫిజుర్ కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు? PSLలోకి జంప్ !

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×