BigTV English

Ms Dhoni : ధోని ముందు గేమ్స్ వద్దు.. చిట్టి రోబోను మడతపెట్టి మరీ

Ms Dhoni : ధోని ముందు గేమ్స్ వద్దు.. చిట్టి రోబోను మడతపెట్టి మరీ

Ms Dhoni:  చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో  ( Ms Dhoni ) ఆటలు అంటే మామూలుగా ఉండదు. ఆయన ముందు ఎవరైనా అనిగిమనిగి ఉండాల్సిందే. టీమిండియా కెప్టెన్ గా ఉన్నప్పుడు మూడు ఐసీసీ టోర్నమెంట్లు అందించిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు ధోని. ఎంతోమంది యంగ్ స్టార్ లను జట్టులోకి తీసుకువచ్చాడు. ఈ తరుణంలోనే మహేంద్ర సింగ్ ధోనీకి ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటి మహేంద్ర సింగ్ ధోని ముందు చిట్టి రోబో… కాస్త ఓవర్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. కొత్తగా చిట్టి రోబో ను.. ఐపీఎల్ యాజమాన్యం తీసుకువచ్చింది.


ఈ రోబో లో కెమెరాలు ఫిట్ చేసి… మ్యాచ్ కు సంబంధించిన…. విజువల్స్ షూట్ చేస్తోంది. వీడియోతో పాటు ఫోటోలు కూడా తీస్తోంది ఈ చిట్టి రోబో. ఓ పెద్ద తాబేలు తరహాలోనే ఈ చిట్టి రోబో ఉంది. సోమవారం రోజున లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో.. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ లోని చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

చిట్టి రోబో పని పట్టిన మహేంద్ర సింగ్ ధోని


వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ నేపథ్యంలోనే మహేంద్ర సింగ్ ధోని కి సంబంధించిన ఫోటోలను షూట్ చేసే ప్రయత్నం చేసింది ఆ చిట్టి రోబో. ఇంకేముంది ధోని కి కాస్త కోపం వచ్చింది. దాన్ని ప్యాక్ చేసుకొని చేతిలో పట్టుకొని వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు… అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజెన్స్.. దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. ధోని ముందు చిట్టి రోబో కాదు పెద్ద రోబో వచ్చినా కూడా అంతే అని అంటున్నారు అభిమానులు.

 Also  Read : Dhoni – Abdo Feghani : ధోని క్రేజీ మామూలుగా లేదుగా.. రేసర్ కూడా ఆ జెర్సీ ధరించాడు !

లక్నో ను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్

సోమవారం రోజున లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. డు ఆర్ డై సిట్యువేషన్ లో ధోని సేన అదిరిపోయే విక్టరీ సాధించింది. లక్నో సూపర్ జైంట్స్ పైన ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది మహేంద్రసింగ్ ధోని టీం. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 166 పరుగులు మాత్రమే చేసింది. లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తొలిసారిగా.. ఫామ్ లోకి వచ్చి అద్భుతంగా ఆడాడు. కానీ ఫలితం మాత్రం చెన్నైకి అనుకూలంగా వచ్చింది. లక్నో సూపర్ జెంట్స్ విధించిన లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో చేదించింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ నేపథ్యంలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×