BigTV English

Pak Player Run out: పాకిస్థాన్ ప్లేయర్ల బద్ధకం చూడండి…రనౌట్ అయి..తోటి ప్లేయర్ దాడి ?

Pak Player Run out: పాకిస్థాన్ ప్లేయర్ల బద్ధకం చూడండి…రనౌట్ అయి..తోటి ప్లేయర్ దాడి ?

Pak Player Run out: ప్రపంచ క్రికెట్ లో పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా తయారయింది. ఎక్కడ చూసినా… పాకిస్తాన్ జట్టు తిట్టే వాళ్ళు తప్ప మెచ్చుకున్న వాళ్ళు లేరు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ గెలిచిన దాఖలాలే కనిపించడం లేదు. వెస్టిండీస్ జట్టు పైన t20 సిరీస్ గెలుచుకున్న పాకిస్తాన్… వారం తిరగకముందే వన్డే సిరీస్ కోల్పోయింది. ఇక ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా పోయింది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్ రన్ అవుట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అనవసరమైన పరుగుకు వెళ్లి… రన్ అవుట్ అయ్యాడు పాకిస్తాన్ ఆటగాడు ఖవాజా ముహమ్మద్ నఫాయ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.


Also Read: Tim David – Brevis: ఇద్దరు విషయంలో అంబానీ తప్పుడు నిర్ణయం.. అతలాకుతలంలో ముంబై ఇండియన్స్

తోటి ప్లేయర్ ను కొట్టబోయిన పాకిస్తాన్ ప్లేయర్


టాప్ ఎండ్ టి20 సిరీస్ 2025 టోర్నమెంట్లో భాగంగా పాకిస్తాన్ A అలాగే బంగ్లాదేశ్ A జట్ల మధ్య ప్రస్తుతం సిరీస్ జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ సందర్భంగా… పాకిస్తాన్ ఆటగాడు ఖవాజా ముహమ్మద్ నఫాయ్ తన సహనాన్ని కోల్పోయాడు. ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీలోని TIO స్టేడియంలో జరిగిన T20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. పాకిస్తాన్ షాహిన్స్ జట్టు ఆటగాడు ఖవాజా ముహమ్మద్ నఫాయ్… తన తోటి ప్లేయర్ యాసిర్ ఖాన్ ను ఉద్దేశించి బండ బూతులు తిట్టాడు. అనవసరమైన పరుగుకు వెళ్లి…. రన్ అవుట్ అయ్యాడు ఖవాజా ముహమ్మద్ నఫాయ్ ( Khawaja Muhammad Nafay ).

రన్ అవుట్ అయిన వాడు వెంటనే పెవిలియన్ కు వెళ్లకుండా… తోటి ప్లేయర్ యాసిర్ ఖాన్ ను ఉద్దేశించి… బండ బూతులు తిట్టాడు. తన చేతిలో ఉన్న బ్యాట్ నేలకేసి కొట్టాడు. నన్ను ఎందుకు రన్ అవుట్ ( Pak Player Run out) చేశావు…? నువ్వు రన్ అవుట్ అయితే అయిపోవు కదా అంటూ పచ్చి బూతులతో రెచ్చిపోయాడు ఖవాజా ముహమ్మద్ నఫాయ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు.. పాకిస్తాన్ పరువు తీస్తున్నారు.

Also Read: Ramiz Raja: బాల్ లో చిప్ పెట్టారు.. వెస్టిండీస్ పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు.. అంతా తొండాట అంటూ !    

ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. ఏకంగా 79 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది పాకిస్తాన్. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 227 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో బంగ్లాదేశ్… ఓటమిపాలైంది. 16.5 ఓవర్లలోనే 148 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది బంగ్లాదేశ్. దీంతో 79 పరుగుల తేడాతో మ్యాచ్ విజయం సాధించింది పాకిస్తాన్.

 

Related News

Muralitharan vs Gambhir: గంభీర్ ఇజ్జత్ తీసిన మురళీధరన్.. అతనికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు

S J Suryah: టీమిండియా బౌలర్ ను అవమానించిన టాలీవుడ్ విలన్

Dhoni Fan Died: ఐపీఎల్ 2026 కంటే ముందే CSK జట్టులో పెను విషాదం!

Tim David – Brevis: ఇద్దరు విషయంలో అంబానీ తప్పుడు నిర్ణయం.. అతలాకుతలంలో ముంబై ఇండియన్స్

Ramiz Raja: బాల్ లో చిప్ పెట్టారు.. వెస్టిండీస్ పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు.. అంతా తొండాట అంటూ !

Big Stories

×